మగధీర.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు | 11 Years For Magadheera : KK Senthil Remembers Memories | Sakshi
Sakshi News home page

11 ఏళ్లైంది.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు

Published Fri, Jul 31 2020 10:08 AM | Last Updated on Fri, Jul 31 2020 12:35 PM

11 Years For Magadheera : KK Senthil Remembers Memories - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్‌ అగర్వాల్‌, శ్రీహరి, దేవ్‌ గిల్‌, రావు రమేష్‌.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌.. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.(జూన్‌ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా)

అలాగే రాజమౌళి- డైరెక్షన్‌, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్‌- సినిమాటోగ్రఫీ, పీటర్‌ హెయిన్‌- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్‌ డిజైన్స్‌‌.. ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది.  ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది’ అని పేర్కొంది.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా)

తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్‌ కుమార్‌ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్‌ను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత నటుడు శ్రీహరికి రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీహరి తనపై తీసుకున్న కేర్‌ గురించి రామ్‌చరణ్‌ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement