బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా ప్రీరిలీజ్, ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలామంది మాట్లాడే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు. స్వయంగా దర్శకుడు రాజమౌళి కూడా కంటతడి పెట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి, ఇప్పుడు విడిపోవాలంటే ఏదోలా ఉందని బాధపడ్డారు. ఇదే విషయాన్ని రానా కూడా చెప్పాడు. ఇంత గొప్ప సినిమాలో చేసినందుకు గర్వంగా ఉందంటూనే.. ఈ కుటుంబాన్ని విడిచి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందన్నాడు. వారానికోసారి ఫోన్ చేసి తిట్టాలంటూ కీరవాణి భార్య శ్రీవల్లిని కోరాడు.
ఇక సమయం మించిపోతుండటంతో చివర్లో చాలా క్లుప్తంగా ప్రసంగాలను ముగించేశారు. అంతా అయిన తర్వాత రాజమౌళి కోరిక మేరకు టీమ్ మొత్తం కలిపి ఓ సెల్ఫీ తీసుకుంది. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరించిన సెంథిల్ స్వయంగా తన ఫోన్లోనే ఈ సెల్ఫీ తీశాడు. ఏ ఒక్కరినీ మిస్ కాకుండా.. ఫ్రేములో అందరూ పట్టేలా తన టాలెంట్ మొత్తాన్ని చూపించి మరీ ఈ సెల్ఫీ తీయడం విశేషం. ఇందులో సెంథిల్‌తో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా, హీరోయిన్లు అనుష్క, తమన్నా, సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, ఇంకా సుబ్బరాజు, సంగీత దర్శకుడు కీరవాణి, సాంకేతిక నిపుణులు కమల్ కణ్నన్, సాబు సిరిల్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, డిజైనర్ ప్రశాంతి తదితరులు ఉన్నారు. సెల్ఫీలో సరిగ్గా వచ్చేందుకు వీలుగా శోభు యార్లగడ్డ, రాజమౌళి కాస్త మోకాళ్లు వంచి నిల్చోవడం విశేషం.
ఆ సెల్ఫీ తీసిందెవరో తెలుసా?
Published Mon, Mar 27 2017 10:38 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
Advertisement
Advertisement