ఆడియో లాంచ్కి 'ఈగ' యాంకరింగ్! | hero nani to do anchoring for baahubali audio release | Sakshi
Sakshi News home page

ఆడియో లాంచ్కి 'ఈగ' యాంకరింగ్!

Published Mon, May 25 2015 3:09 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ఆడియో లాంచ్కి 'ఈగ' యాంకరింగ్! - Sakshi

ఆడియో లాంచ్కి 'ఈగ' యాంకరింగ్!

దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు చిత్రీకరణ, ఇతర పనులు జరుపుకొన్న 'బాహుబలి' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ కార్యక్రమానికి యాంకరింగ్ ఎవరు చేస్తున్నారో తెలుసా.. 'ఈగ'! అవును, రాజమౌళి చేతుల్లోనే రూపుదిద్దుకున్న ఈగ సినిమాలో చాలా తక్కువసేపు ఉండే పాత్ర పోషించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని స్వయంగా యాంకర్ అవతారం ఎత్తి.. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాడు.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ''బాహుబలి ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి యాంకరింగ్ చేయడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాజమౌళి ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement