
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీలో మాట్లాడిన యాంకర్‌పై ఏఆర్ రెహమాన్ సరదాగా ట్రోల్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎహసాన్ భట్‌ను వేదికపై స్వాగతం పలికే సమయంలో యాంకర్ హిందీలో మాట్లాడింది. దీంతో పక్కనే ఉన్న రెహమాన్ హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజ్ మీదనే అనేశారు.
తరువాత నవ్వుతూ సరదాగానే అన్నానని చెబుతూ స్టేజ్ దిగి కిందకు వెళ్లిపోయారు. ఇక ఈ విషయాన్ని యాంకర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో అక్కడితో ముగిసిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా తమిళ ప్రజలు హిందీ బాషను ద్వేషిస్తారనే విషయం సాధారణంగా తెలిసిందే. తమిళనాడులో హిందీ ఎవరూ మాట్లాడరు. కావున చెన్నైలో యాంకర్ హిందీలో మాట్లాడంతో ఎక్కడ కాంట్రవర్సీ అవుతందోనని ముందే గ్రహించిన రెహమాన్ వివాదాలకు దూరంగా ఉండటానికి హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ఫన్నీగా ట్రోల్ చేశాడు.
చదవండి: రచయితగా.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహమాన్
బాలీవుడ్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ మూవీ రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment