
కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పడం మర్చిపోకండి!
తన తాజా సినిమా 'భలే భలే మగాడివోయ్'లో మతిమరుపు మనిషిగా చిత్రమైన పాత్రలో నటిస్తున్న హీరో నానికి ఉన్నట్టుండి ఓ కొత్త విషయం గుర్తుకొచ్చింది. బాహుబలి సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ట్విట్టర్ ద్వారా సంభాషిస్తూ.. తనలా ఆయన కూడా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతారేమోనని గుర్తుచేశాడు. బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని చంపడం చిట్ట చివరి సీన్. అయితే, అలా ఎందుకు చంపాడన్న విషయం మాత్రం సస్పెన్స్గానే ఉంచారు.
ఇప్పుడు రెండో భాగంలో ఆ విషయం ఎలా చెబుతారా అని అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయాన్ని బాహుబలి సినిమా రెండో భాగంలో చూపించడం మర్చిపోవద్దని, అలా మర్చిపోయారో.. ఇక అంతే అని నాని అన్నాడు. దాన్ని చాలా సరదాగా తీసుకున్న రాజమౌళి.. తప్పకుండా చెబుతానని అన్నారు. దాంతోపాటు, అప్పుడే భలే భలే మగాడివోయ్ సినిమా టీజర్ చూశారు. దాన్ని కూడా వెంటనే ట్వీట్ చేశారు. అసలు నాని సినిమా విషయాన్ని తాను ఎలా మర్చిపోయానో అన్నారు. సినిమా కాన్సెప్టు చాలా బాగుందని, తప్పకుండా సినిమా చూడాలని తెలిపారు.
@ssrajamouli haha.. Idhi ok .. Baahubali ni kattappa endhuku champaado part 2 lo cheppadam marchipoyaroo .. Inka anthey