అప్పుడు పవన్, ఇప్పుడు మహేష్ | Mahesh Babu bags SIIMA for SVSC | Sakshi
Sakshi News home page

అప్పుడు పవన్, ఇప్పుడు మహేష్

Published Sun, Sep 14 2014 12:29 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అప్పుడు పవన్, ఇప్పుడు మహేష్ - Sakshi

అప్పుడు పవన్, ఇప్పుడు మహేష్

కౌలాలంపూర్: ప్రిన్స్ మహేష్ బాబు మరో అవార్డు దక్కించుకున్నాడు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాగానూ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న ఆయన ఇప్పడు 'సైమా'ను సొంతం చేసుకున్నారు. మలేసియాలోని కౌలాలంపూర్ లో వైభవంగా జరిగిన 3వ దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు(సైమా)లో కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రకటించారు. మహేష్బాబు తరపున ఆయన బావ సుధీర్బాబు ఈ అవార్డు అందుకున్నారు. గతేడాది 'గబ్బర్ సింగ్'లో నటనకు పవన్ కళ్యాణ్ ఈ అవార్డు దక్కించుకున్నారు.

ఈసారి పవన్ సినిమా 'అత్తారింటికి దారేది' ఉత్తమ చిత్రంగా ఎంపికవడమే కాకుండా ఉత్తమ నటి(సమంత), ఉత్తమ దర్శకుడు (త్రివిక్రమ్ శ్రీనివాస్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ ఛాయగ్రాహకుడు(ప్రసాద్ మూరెళ్ల) పురస్కారాలు దక్కించుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ నటిగా త్రిష ఎంపికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement