సాక్షి, హైదరాబాద్: దక్షిణభారత సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) నిర్వహణకు తెర లేచింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం వచ్చే ఆగస్టు నెల 15,16 తేదీలలో జరుగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని నగరంలోని వెస్టిన్ హోటల్‌లో శనివారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైమా చైర్ పర్సన్‌బృందా ప్రసాద్ మాట్లాడుతూ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినీ తారలు శ్రియా శరన్, నిధిఅగర్వాల్, శాన్వీ, అషిమా, రోహిణి శర్మ... తదితరులు పాల్గొని సైమాతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment