SIIMA 2023 Awards Nominations List Released Today - Sakshi
Sakshi News home page

SIIMA 2023 Nominations: సైమా అవార్డ్స్‌- 2023.. ఆర్ఆర్‌ఆర్‌కు ఏకంగా 11 నామినేషన్స్‌!

Published Tue, Aug 1 2023 9:18 PM | Last Updated on Tue, Aug 1 2023 9:24 PM

SIIMA 2023 Awards Nominations List Released Today - Sakshi

సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌  - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్‌ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్‌ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11  విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. 

(ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్‌ మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ కార్తికేయ-2, అడవి శేష్‌ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్‌ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. 

తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌ పొన్నియిన్‌ సెల్వన్‌-1 చిత్రానికి దక్కించుకుంది.  ఆ తర్వాత కమల్‌హాసన్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమ్‌ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్‌ హిట్ కాంతార, యశ్‌ యాక్షన్‌ మూవీ కేజీయఫ్‌-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. 

మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్‌ రాగా, టోవినో థామస్‌ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్‌ వచ్చాయి. కాగా.. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్‌- 2023) ఈవెంట్‌ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్‌ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement