సైమాకు అతిథులుగా..! | Chiranjeevi and Mohanlal to be the Guests of Honour at The SIIMA | Sakshi
Sakshi News home page

సైమాకు అతిథులుగా..!

Published Wed, Jul 31 2019 2:14 PM | Last Updated on Wed, Jul 31 2019 2:14 PM

Chiranjeevi and Mohanlal to be the Guests of Honour at The SIIMA - Sakshi

దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌). ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ ఏడాది ఖతర్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను, ఆగస్టు 16న తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డులను అందించనున్నారు.

ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, మాలీవుడ్‌ నుంచి కంప్లీట్ యాక్టర్‌ మోహన్‌లాల్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 15న చిరు, 16న మోహన్‌లాల్‌లు సైమా వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సైమా ప్రతినిథులు అధికారికంగా ప్రకటించారు.  ఖతర్‌లోని దోహలో జరగనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి తారలు తరలివెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement