![Mohanlal Giving Voiceover For Sye Raa Malayalam Teaser - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/18/Sye%20Raa.jpg.webp?itok=qYvS-PWO)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్.
అన్ని భాషల్లో సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించగా మలయాళ వర్షన్‌కు మోహన్ లాల్ వాయిస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మలయాళ, హిందీ వర్షన్‌లకు కూడా టాప్ స్టార్స్ గాత్రదానం చేయనున్నారట.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టీజర్ ఆగస్టు 20న రిలీజ్ చేస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలతో అమితాబ్ బచ్చన్, తమన్నా, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment