
రాంచీ : మానవత్వం మంటగలిసింది. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌గర్ జిల్లాలోని బర్కకనాలో కృష్ణారామ్ (55) అనే వ్యక్తి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత గరువారం రాత్రి అనుమానాస్పదరీతిలో కృష్ణారామ్ మృతి చెందాడు. గుర్తు తెలియన వ్యక్తి గొంతు కోసి చంపినట్లుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకిని దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హత్యచేసినట్లుగా కనుగొన్నారు. చిన్న కత్తితో క్వార్టర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపినట్లుగా తెలిపారు.
(చదవండి : వివాహేతర సంబంధం, మటన్ వ్యాపారి హత్య)
హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎల్ లీగల్ విభాగం ప్రకారం ఓ ఉద్యోగి తన సర్వీసు కాలంలో మరణిస్తే.. కారుణ్య కోటా కింద అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు.నిరుద్యోగి అయిన కృష్ణారామ్ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హతమార్చినట్లుగా పోలీసులు వెల్లడించారు.