ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్ | telugu warriors won the semi final match | Sakshi
Sakshi News home page

ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్

Published Sat, Jan 31 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్

ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్

హైదరాబాద్: సీసీఎల్ క్రికెట్ లీగ్(సీసీఎల్)లో తెలుగు వారియర్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై హీరోస్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది.

 

దీంతో తరువాత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.2 లక్ష్యాన్ని చేరుకుంది. తెలుగు వారియర్స్ ఆటగాళ్లలో ప్రిన్స్ (63), ఎస్ బాబు(53) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకూ వీరిద్దరూ క్రీజ్ లో ఉండి చక్కటి విజయాన్నిఅందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement