హీరో సూర్య పేరుకే తమిళం. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు అనుకోని విషాదం జరిగింది. సూర్య అభిమానులు కరెంట్ షాక్ తో చనిపోయారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ షాక్ కొట్టడంతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ విషయం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తోంది.
(ఇదీ చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్)
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలోని మోపువారిపాలెంలో విషాదం నెలకొంది. హీరో సూర్య పుట్టినరోజు సందర‍్భంగా నక్కా వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు.. ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే సడన్‌గా కరెంట్ పాస్ అవ్వడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుర్రాళ్లు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.
ఇకపోతే సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దిశా పటానీ హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీని ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనుండటం విశేషం. సూర్య కెరీర్లోనే ఇది హైయస్ట్ బడ్జెట్ మూవీ.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు)
Comments
Please login to add a commentAdd a comment