వైఎస్ఆర్‌సీపీ నేతల సాయంతో స్వస్థలానికి.. | g suribabu will return to home by the help of ysrcp leaders | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్‌సీపీ నేతల సాయంతో స్వస్థలానికి..

Published Wed, Jan 18 2017 7:08 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్ఆర్‌సీపీ నేతల సాయంతో స్వస్థలానికి.. - Sakshi

వైఎస్ఆర్‌సీపీ నేతల సాయంతో స్వస్థలానికి..

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మలేసియా సభ్యుల సహకారంతో ఓ వ్యక్తి తన స్వస్థలానికి చేరుకోనున్నాడు. వైఎస్ఆర్ సీపీ గల్ఫ్ కన్వినర్ బి.హెచ్.ఇలియాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన జి. సూరిబాబు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం జీవనోపాధి కొరకు మలేసియా వెళ్లి ఓ కంపెనీలో వెల్డర్ గా పనిచేశాడు. అయితే 17 నెలలు గడిచిన తర్వాత అక్కడ ఏ పనిలేదని కంపెనీవారు సూరిబాబును ఆకస్మికంగా బయట పంపించేశారు. 'ఇండియాకు తిరిగి వెళతాను.. నా పాస్ పోర్ట్ ఇప్పించాలని కాంపెనీ వారిని ప్రాధేయపడినా పాస్ పోర్ట్ ఇవ్వలేదని' సూరిబాబు చాల అవస్ధలు పడ్డాడని ఇలియాస్ తెలిపారు. ఈ విషయాన్ని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ద్వారా సూరిబాబు తల్లి జి.అన్నమ్మ తెలపగా వెంటనే స్పందించి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో మలేసియా వైఎస్ఆర్‌సీపీ నేత రేవంత్ తిప్పరాజు గారి దృష్టికి తీసుకెళ్లాం.

తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న సూరిబాబును తమ వద్దకు పిలుచుకొని అన్ని వసతులు కల్పించి భారత రాయబార కార్యాలయ అధికారికులతో మాట్లాడి ఈ 19న స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. సూరిబాబు లాంటి ఎందరో అభాగ్యులు మలేసియాలో అవస్ధలు పడుతున్నారని సూరిబాబు ద్వారా తెలిసిందన్నారు. సమస్యలలో ఉన్న ఎన్ఆర్ఐలను ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడము లేదనే అక్కసుతో ప్రవాసులు ఆయా దేశాలను సర్వనాశనం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. నేడు మన రూపాయి విలువ పడిపోకుండా మన పక్క దేశాలకన్నా ఉన్నత స్ధానంలో ఉందంటే అది కచ్చితంగా ఎన్ఆర్ఐల ద్వారా జరిగే బ్యాంక్ లావాదేవీలే కారణమన్న విషయం సీఎం తెలుసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. సూరిబాబును సురక్షితముగా ఇండియా పంపేందుకు ఏర్పాట్లు చేసిన రేవంత్ తిప్పరాజు, రాంబాబుకు, వారి మిత్ర బృందానికి  కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ముఖ్యమైన ఫోన్ నెంబర్లు : సూరిబాబు తల్లి జి. అన్నమ్మ సెల్ నెం: +918886368312,  సూరిబాబు సెల్ నెం : 00601139497477,  రేవంత్ సెల్ నెం : 0060172150232.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement