ఏపీలోని ముస్లిం మైనారిటీలను సీఎం చంద్రబాబు అన్నిరకాలుగా మోసం చేశారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు.
విజయవాడ: ఏపీలోని ముస్లిం మైనారిటీలను సీఎం చంద్రబాబు అన్నిరకాలుగా మోసం చేశారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు.
మంగళవారం విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన బాషా.. మైనారిటీలకు ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గంలో కనీసం ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.