
గుంటూరు: ఆంధ్రప‍్రదేశ్‌లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. సీఎం సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్లకార్డులు ప‍్రదర్శిస్తే ఏమైనా దేశ ద్రోహమా చంద్రబాబు అంటూ అంజాద్ బాషా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని అడిగితే తప్పా అని నిలదీశారు.
అసలు ముస్లింలపై చంద‍్రబాబుకు ప్రేమ లేదని, ఎన్నికలు వస్తున్నాయనే ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అంజాద్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment