సాక్షి, అమరావతి : ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ఆందోళనకు దిగిన విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం తనకు బాధ కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి అనుమతి తీసుకొని నిరసన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. విద్యార్థుల నిరసనలు, పోరాటాలు చూసి భయమేస్తోందా చంద్రబాబు అని వైఎస్ జగన్ నిలదీశారు. నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేసేవిధంగా చంద్రబాబు మభ్యపెడుతుండటాన్ని వ్యతిరేకిస్తూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులను విజయవాడలో పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
It's disheartening to hear about the students who were arrested, for raising their concerns on unemployment and their future, even after taking permission from the concerned authorities. @ncbn are you threatened by student protests now? pic.twitter.com/6eYw2WlaGU
— YS Jagan Mohan Reddy (@ysjagan) 3 October 2018
Comments
Please login to add a commentAdd a comment