లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్కు కర్నూలులో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. తెలుగు తేజం పేరుతో కర్నూలులో జేపి తలపెట్టిన యాత్రలో జై సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని ఉద్యమదారులు డిమాండ్ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.