జైరాం రమేష్ కు చేదు అనుభవం! | Minister Jairam Ramesh face ire from United Andhra protesters in Vishakha | Sakshi
Sakshi News home page

జైరాం రమేష్ కు చేదు అనుభవం!

Published Mon, Mar 3 2014 5:35 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

జైరాం రమేష్ కు చేదు అనుభవం! - Sakshi

జైరాం రమేష్ కు చేదు అనుభవం!

విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి  జైరాం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత కొద్దిరోజులుగా రాష్ట్ర పర్యటనలో జైరాం రమేష్ ను సమైక్యవాదులు అడ్డకుంటున్న సంగతి తెలిసిందే. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొనేందుకు వచ్చిన జైరామ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు అడ్డకున్నారు. జైరాంరమేష్‌ను ఘెరావ్ చేసిన నేతల్లో విద్యార్థి విభాగం నేతలు కాంతారావు, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులున్నారు. 
 
ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేష్కు గత బుధవారం సమైక్య సెగ తగిలిన సంగతి తెలిసిందే. విభజన ద్రోహి  గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జైరాం రమేష్ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement