బొత్స ఇంటిని ముట్టడించిన విద్యార్ది జేఏసీ | Botsa's house attacked by Samaikyandhra activists | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 1 2013 1:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

విజయనగరం: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జాక్టో), విద్యార్థి సంఘాల జెఎసి, ఎన్జీఓ సంఘం నేతలు ఈరోజు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో బొత్స భార్య ఎంపి ఝాన్సీ ఇంట్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర వహిస్తున్న బొత్స సత్యనారాయణ వంటి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తక్షణమే రాజీనామాలు చేసి పాలనా పరమైన సంక్షోభాన్ని సృష్టించాలని సమైక్యాంధ్రవాదులు డిమాండ్ చేశారు. ఆ విధంగా సహకరించని కాంగ్రెస్‌నాయకులకు తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. సమైక్యాంధ్రకు కోసం పలు జేఏసి నేతల ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపధ్యంలో విజయనగరం పట్టణం పోలీసు వలయంలో చిక్కుకొంది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యూరు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ ముమ్మరం చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి, ఎస్‌పీ కార్తికేయ శాంతిభద్రతల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని కూడా సమైక్యాంధ్రవాదులు ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement