ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలకు కేంద్రప్రభుత్వమే కారణమని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ శుక్రవారం హైదరాబాద్లో ఆరోపించారు. రాష్ట్ర విభజననను కాంగ్రెస్పార్టీ సొంత వ్యవహారంలా భావించడన్ని ఆయన ఖండించారు. రాష్ట్రాలు ఎన్నైనా.. తెలుగు ప్రజలు ఒక్కటే అనే విశ్వాసం కల్పించడంలో ఆ పార్టీ పూర్తి గా విఫలమైందన్నారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి షిండే నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తున్న తీరు పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా అటు సీమాంధ్రలో, ఇటూ తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.