
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం తెలుగునాట విచిత్ర పరిస్థితి నెలకుందని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యం అని తెలియగానే ఏపీకి జరిగే నష్టాన్ని పూరించవలసిన అవసరం ఉందని నేనే మొదట అడిగానని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘దాంతోనే విభజన బిల్లులో కొన్ని అంశాలు పేర్కొన్నారు. ప్రస్తుతం అందరం కలిసి కట్టుగా పోరాడాలి. అన్ని పార్టీలు రాజకీయ లబ్ది పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని ప్రయత్నించడం దారుణం.
దేశం.. రాష్ట్రం కంటే ఏ వ్యక్తీ గొప్ప కాదు. తెలుగునాట కులాలు.. వర్గాలు.. అధికార దాహం ఎక్కువైపోయాయి. స్థానిక ఎన్నికల్లో గెలుపొందినా సరే..విపక్షాలను నిర్వీర్యం చెయడానికి జన్మభూమి కమిటీలు పెట్టారు. ముఖ్యమంత్రి తప్ప మన రాష్ట్రంలో ఇంకెవరికీ హక్కు లేదా అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదాపై పోర్ కోసం సీఎం అందర్నీ కలుపుకోవాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లులో అత్యంత వివాదాస్పద అంశం పన్ను రాయితీ. దీనిపై అప్పుడే క్లారిటీ కోసం ప్రయత్నించినా ఎవరూ కలిసి రాలేదని పేర్కొన్నారు. వివాదం లేని అంశాలపై చర్చిండానికి రెండుసార్లు నిపుణులతో చర్చించామన్నారు. తెలుగు నేతలతో సంబధం లేని నిపుణులో మరో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. నష్టపోయేది ప్రజలు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment