సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆయన శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది.
మరోవైపు సీఎం ధర్మపోరాటం పేరిట చేస్తున్న ఒక్కపూట దీక్ష కోసం ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దీక్ష కోసం ఏకంగా రూ.30 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నట్లు అంచనా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి ఇటీవల బంద్ పాటించగా ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన ఒక్కపూట దీక్ష పేరిట అంతకు మూడురెట్లు డబ్బును ఖర్చు చేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment