ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. లేదంటే ఎమ్మెల్యేలందరికీ విడివిడిగా అవకాశమిచ్చి వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా అన్న ప్రశ్నకు ‘బలవంతంగా చేసే నిర్ణయాన్ని లోక్‌సత్తా పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని బదులిచ్చారు.