హోదాకోసం బాబే కేంద్రంపై ఒత్తిడి తేవాలి
హోదాకోసం బాబే కేంద్రంపై ఒత్తిడి తేవాలి
Published Sat, Nov 26 2016 1:06 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పుస్తకావిష్కరణలో జేపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు చంద్రబాబే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, హోదా కల్పిస్తామన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌నారాయణ పేర్కొన్నారు. పారిశ్రామిక పన్ను రాయితీలు హోదాలో భాగమేనని.. ఆ రాయితీలు, వాటితోపాటు ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయన్న ఆశతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. ‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పేరుతో లోక్‌సత్తా పార్టీ రూపొందించిన పుస్తకాన్ని జయప్రకాష్‌నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు బీశెటి బాబ్జీ పాల్గొన్నారు.
Advertisement
Advertisement