jp
-
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
దేశవ్యాప్తంగా రైట్ టు సర్విసెస్ రావాలి
-
హోదాకోసం బాబే కేంద్రంపై ఒత్తిడి తేవాలి
‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పుస్తకావిష్కరణలో జేపీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు చంద్రబాబే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, హోదా కల్పిస్తామన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌నారాయణ పేర్కొన్నారు. పారిశ్రామిక పన్ను రాయితీలు హోదాలో భాగమేనని.. ఆ రాయితీలు, వాటితోపాటు ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయన్న ఆశతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. ‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పేరుతో లోక్‌సత్తా పార్టీ రూపొందించిన పుస్తకాన్ని జయప్రకాష్‌నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు బీశెటి బాబ్జీ పాల్గొన్నారు. -
'లోక్‌సత్తా' జేపీ రాయని డైరీ
ప్రజాస్వామ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. యూపీఏ సోనియాది కాదు. ఎన్డీఏ మోదీది కాదు. టీఆరెస్ కేసీఆర్‌దీ కాదు. పైన ఉన్నది ఏదైనా కింది వరకు అందరికీ చెందాలి. టీవీలో ఓ యాడ్ చూశాను. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరేదైతే తింటున్నారో దాన్నే నన్ను కూడా తిననివ్వండి’ అంటాడు అతను ఆమెతో. బహుశా ఆమె.. చాక్లెట్ బార్ లాంటిదేదో తింటూ ఉంటుంది. అదీ ప్రజాస్వామ్యం అంటే! అది కూడా పూర్తి ప్రజాస్వామ్యం కాదు. హాఫ్ డెమోక్రసీ. ‘తిననివ్వండి’ అని అడగడం పోరాటం. ‘తినిపెట్టండి’ అని ఇవ్వడం సామ్యవాదం. రెండూ కలిస్తేనే పూర్ణ ప్రజాస్వామ్యం. పాలిటిక్స్ నుంచి ‘లోక్‌సత్తా’ను ఎత్తేసి వారం అవుతోంది. మొత్తుకున్నవాళ్లు ఒక్కరూ లేరు. ‘ఎత్తేయడం ఏంటి?’ అని పాపం ఒకరిద్దరూ మాత్రం ఆశ్చర్యంగా అడిగారు. ‘పార్టీ ఉంటుంది. ఫైట్ చేసేవాళ్లు ఉంటారు. ఎలక్షన్స్‌కి మాత్రం వెళ్లం’ అని చెప్పాను. వాళ్లింకా ఆశ్చర్యంగానే చూస్తున్నారు. ఏదైనా ఉంటేనే కదా ఎత్తేయడానికి వీలౌతుంది. లేనిదాన్ని ఎలా ఎత్తేస్తారని వాళ్ల సందేహం! లోక్‌సత్తా ఈ పదేళ్లలో ప్రజల్లోకి వెళ్లిందా? ప్రజలకు దూరంగా వెళ్లిందా? ఫైల్స్ తిరగేయాలి. లోపల అన్నీ జీవోలే ఉంటాయేమో! ప్రజలకు హామీలు తప్ప జీవోలు అర్థం కావు. హామీలు ఇవ్వకుండా చేయించుకొచ్చిన జీవోలు అసలే అర్థం కావు. ఒక్కొక్కరూ వచ్చి పరామర్శిస్తున్నారు! అరె, ఏం జరిగిందని? పార్టీ ఆఫీస్ నుంచి ఫామ్ హౌస్‌కి వచ్చినట్టు, పాలిటిక్స్ నుంచి పబ్లిక్‌లోకి వచ్చాను. అంతే కదా! పవన్ కల్యాణ్ ఒప్పుకోవడం లేదు. ‘ఇది కరెక్టు కాదేమో జేపీజీ’ అంటున్నాడు. ‘పోనీ కరెక్ట్ అయిందేదో నువ్వు చెప్పు కల్యాణ్’ అన్నాను. ఏమీ మాట్లాడలేదు. బెరుగ్గా చూశాడో, కరుగ్గా చూశాడో గానీ గుడ్లురిమి చూశాడు. ‘లోక్‌సత్తా జెండాలో స్టార్ ఉంది. జనసేన జెండాలో స్టార్ ఉంది. పాలిటిక్స్‌లో మాత్రం మన స్టార్డమ్ లేదు. మీ సత్తా తగ్గినట్టే.. నా సేనా తగ్గిపోదు కదా జేపీజీ..’ అన్నాడు కల్యాణ్. ఇంకోమాట కూడా అన్నాడు. ‘మీరిలా సడెన్‌గా పాలిటిక్స్ నుంచి బయటికి రావడం చూస్తే నాకేదో సందేశాన్నో, సంకేతాన్నో ఇస్తున్నట్లుంది’ అన్నాడు. నిజమే!! ‘ప్రశ్నిద్దాం రండి’ అని నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాను. ‘ప్రశ్నించండి పొండి’ అని కల్యాణ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. జనం ప్రశ్నించడం లేదు. సమాధానం అడగడం లేదు. టీవీల్లో బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు చూస్తూ ఏడాదంతా హ్యాపీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో నటించలేక కల్యాణ్‌కి, పాలిటిక్స్‌లో జీవించలేక నాకు అలసట వస్తోంది. ఇద్దరం ఒకే పడవలో ఉన్నట్లున్నాం. ‘అదే బెటర్ జేపీజీ.. ఒకళ్లం రెండు పడవల మీద లేకుండా’ అనేసి వెళ్లిపోయాడు కల్యాణ్. తర్వాత రాజమౌళి వచ్చాడు. సిరివెన్నెల సీతా రామశాస్త్రి వచ్చారు. రాజకీయాలను సంస్కరించ డానికి వచ్చి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వాళ్లిద్దరూ ప్రశ్నించారు. నవ్వాను. ప్రజాస్వా మ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. జేపీ లేనంత మాత్రాన లోక్‌సత్తా లేనట్టు కాదు. జేపీకి సత్తా లేనట్టూ కాదు. - మాధవ్ శింగరాజు -
విశ్వనగరం ఎలా సాధ్యం?
♦ సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ♦ స్థానిక సంస్థలను అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ♦ వీటిని కాక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ♦ ఎంచుకోవాలి.. ‘వన్హైదరాబాద్’ నేతలు ♦ రాఘవులు, చాడ, జేపీ, తమ్మినేని, గౌస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరం ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, లోక్‌సత్తా నేతలు ప్రశ్నించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని అసమర్థ, అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను కాకుండా, స్వచ్ఛమైన పాలన అందించే తమ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమవారం సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, లోక్‌సత్తా నేతలు జయప్రకాష్‌నారాయణ, పాండురంగారావు, ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పాత, కొత్త నగరాలు... ముస్లిం, హిందువు... తెలంగాణ, ఆంధ్రా, ఉత్తర భారత్ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటే అని గర్వంగా ప్రకటించడమే... ‘వన్ హైదరాబాద్’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు నిధులను హరించడం, సమస్యల పరిష్కారంలో చిన్న చూపు తప్ప స్థానిక సంస్థలపై నమ్మకం, గౌరవం లేదని బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల హక్కులను హరించి, పరోక్షంగా తామే పాలన సాగిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని జయప్రకాష్‌నారాయణ సూచించారు. ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్‌సత్తా కూటమి నేతలు కావాలా?... ఎన్నికలను, పదవులను నిచ్చెనగా చేసుకుని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో?.. ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన వారే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ అవకాశవాదంతో ప్రకటనలు చేస్తున్నారని ఎండీ గౌస్ ఎద్దేవా చేశారు. రాజకీయ అనిశ్చితి కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. -
అమెరికా అధ్యక్షులు కూడా అంత చేయరేమో?
విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్సత్త అధినేత జయప్రకాష్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అమరావతి తప్ప...ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇంత రాద్ధాంతం అవసరమా అని జేపీ బుధవారమిక్కడ ప్రశ్నించారు. గతంలో అన్నింటిని హైదరాబాద్‌లోనే పెట్టి...మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇప్పుడూ కూడా చంద్రబాబు అలానే చేస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు విమాన ప్రయాణాలకు చేసిన ఖర్చు అమెరికా అధ్యక్షులు కూడా చేయరేమో అని, హుద్‌హుద్ నుంచి జనం కోలుకుంటుంటే సంబరాలు చేస్తారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు. ఢిల్లీకెళ్లిన చంద్రబాబు....ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి కాకుండా రాయితీల గురించి మాట్లాడుతున్నారని జేపీ ధ్వజమెత్తారు. -
పసుపు, కాషాయాల మధ్య మంటలు!
టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడనన్న కేంద్ర మంత్రి అవాక్కైన తమ్ముళ్లు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు పాలకొల్లు: రాష్ట్రం, దేశంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సమక్షంలోనే ఇరు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు వాదులాడుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా ఆదివారం అధికార టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. వివరాలు.. పాలకొల్లు శివారులో కొత్తగా నిర్మించిన రైలు ఓవర్ బ్రిడ్జి, రహదారులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరణ, రోడ్డు ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా మంత్రి సీతారామన్ పట్టణంలోని ఎమ్మెల్యే రామానాయుడు వ్యక్తిగత కార్యాలయం వద్దకు వచ్చి అల్పాహారం స్వీకరించాక సమీపంలోని టీడీపీ సమావేశ మందిరం వద్ద విలేకర్లతో సమావేశానికి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కార్యాలయాన్ని పూర్తిగా పసుపు జెండాలతో అలంకరించారు. అక్కడికి చేరుకున్న సీతారామన్.. టీడీపీ జెండాలు, బాబు ఫ్లెక్సీల మధ్య కూర్చుని విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఘటనతో అవాక్కైన ఎమ్మెల్యే రామానాయుడు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ.. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది మంత్రి సీతారామన్, ఎంపీ గోకరరాజులకు కూడా తెలిసింది. ఇంతలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎమ్మెల్యే రామానాయుడుతో ఫోన్లో చర్చించారు. ఈ క్రమంలో మెత్తబడ్డ రామానాయుడు కార్యక్రమానికి హాజరై.. తమను అవమానపర్చే రాజకీయాలు మంచిది కాదంటూ ఎంపీ గంగరాజుపై మండిపడ్డారు. శిలాఫలకం ఆవిష్కరణను సీతారామన్ తిరస్కరించి.. ఎమ్మెల్యే రామానాయుడినే చేయమన్నారు. ఆయన కూడా తిరస్కరించడంతో కొద్దిసేపు వారిద్దరూ వాదించుకున్నారు. కేంద్ర మంత్రి మెట్టు దిగకపోవడంతో రామానాయుడే ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రారంభోత్సవంలో రిబ్బన్ కటింగ్‌ను కేంద్ర మంత్రి కాకుండా ఎమ్మెల్యేలు రామానాయుడు, పితానిలు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనను ఓడించడానికి పాటుపడ్డ నేతలను బీజేపీలో చేర్చుకునే యత్నం మంచిది కాదన్నారు. -
ఈల మోగలేదు...గోల చేయలేదు
నూతన రాజకీయాలు, నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు.. భారత రాజ్యాంగం .... ఇది లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నిత్యం చెప్పే మాటలు. ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రజల చేతికి అధికారం రావాలి. రాజకీయాలంటే ఐదేళ్లకోసారి అధికార మార్పిడి కాదంటూ ఐదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చదువుతున్న యువతతో పాటు, పట్టణ, నగర ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించారు. నూతన విధానాల పేరిట వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లు తిరిగిచూసేసరికి ఇప్పుడు లోక్ సత్తా అధినేత ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన విషయం స్పష్టమైంది. జేపీ మాటల్లో చెప్పిన ఆదర్శాలను ఆచరణలో నిరూపించుకోలేక రాజకీయాల్లో నామమాత్ర పాత్రకు పరిమితమయ్యారు. ఐదేళ్ల కిందట కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ నియోజకవర్గ ప్రజలకు సైతం తాను చేయదల్చుకున్న నూతన రాజకీయాలేమిటో, అభివృద్ది ఏమిటో చూపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన మొదలుకొని.. అనేక అంశాల్లో జేపీ అనుసరించిన విధానం కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలా పూటకో మాట తరహాలో ఉండటం.. ఆయనను అభిమానించినవారిలో సైతం వ్యతిరేకత వచ్చేందుకు కారణమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే.. జేపీ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లాగే వ్యవహరించిందన్న విషయం స్పష్టమైంది. లోక్ సత్తాలో జేపీ తర్వాత పేరున్న నేత కటారి శ్రీనివాస్. ఆ తర్వాత చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. ఆపార్టీలో మిగతా నేతల పేర్లు కూడా జనాలకు చేరనేలేదు. గత ఎన్నికల్లో లోక్ సత్తా గట్టి పోటీ ఇవ్వలేకపోయినప్పటికీ చాలాచోట్ల ఓట్లను చీల్చింది. హైదరాబాద్‌లో పలుచోట్ల బీజేపీ కన్నా మెరుగ్గా ఉండి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ....ఈల వేసి గోల చేసిన లోక్‌సత్తా ఈసారి మాత్రం ఎలాంటి సత్తా చూపలేకపోయింది. గత ఎన్నికల్లో వచ్చిన ఒక్క సీటును కూడా ఈసారి నిలుపుకోలేకపోయింది. ఆయన ఈ సారి లోక్ సభ సీటకు పోటీ చేసి 1,47,458 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మారిన జేపీ.. అక్కడ గెలుపు కోసం సినీ ప్రముఖుల్ని వాడుకున్నారు. అంతే కాకుండా మోడీ బొమ్మను ప్రచారంలో ఉపయోగించుకోవటంతో పాటు పవన్ కల్యాణ్ మద్దతు కోసం పాకులాడినా ఫలితం లేకపోయింది. ఇంత చేసి.. బీజేపీతో అంటకాగినా జేపీ సత్తా చూపలేక మల్కాజ్‌గిరిలో సోదిలో లేకుండా పోయారు. ఇవన్నీ ఇలా ఉండగా జేపీ నీతిమంతమైన రాజకీయాల గుట్టు విప్పారు ఆయన పార్టీ ఢిల్లీ కన్వీనర్ ఒకాయన. అంతర్గతంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కు కావడం.. పారిశ్రామికవేత్తల కోసం సెటిల్మెంట్లు చేయడం, తన మేధావితనాన్ని అంత ఉపయోగించుకొని ఢిల్లీ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో లాబీయింగ్ జరుపడం ద్వారా లోలోపల చీకటి వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట జేపీ అని ఆయన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో కుండబద్దలు కొట్టడం సంచలనం సృష్టించింది. -
ఈ లీడర్లకు ఇక 'శుభం' కార్డేనా?
ఎన్నికలైపోయాయి. ప్రజాతీర్పు పెట్టెల్లో భద్రంగా ఉంది. కానీ ఫలితాలు రాకుండానే కొందరి కథ మాత్రం కంచికి వెళ్లిపోయిందన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. రాజకీయంగా వారి కథకి శుభం కార్డు పడిపోయింది. అలాంటి నేతలెవరో ఒక సారి చూద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి - ఆఖరి బంతి ఆడే వరకూ గేమ్ అవదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆట అసలు ఆటకు ముందే అంతమైపోయింది. ఆయన స్వయంగా పోటీ చేయలేదు. అంతే కాదు. ఎన్నికలకు ముందే పార్టీ అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. ఫలితం ఏదైనా, కిరణ్ కుమార్ రెడ్డి రిటైర్మెంట్ ఖాయమన్నదే రాజకీయ పండితుల ఏకాభిప్రాయం. పవన్ కళ్యాణ్ - పెర్ఫార్మెన్సంతా ఒకే సారి చేసేస్తే వచ్చేసారికి ఏం మిగులుతుంది. పవన్ కళ్యాణ్ పరిస్థితీ అదే. ఈ సారి కాంగ్రెస్ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. తరువాత జరిగే ఎన్నికల్లో ఈ ఆయుధం వాడటానికి వీలుండదు. ఇప్పుడు ఆయన కూరలో కరివేపాకా లేక పప్పచారులో మునక్కాడా ఆయనే డిసైడ్ చేసుకోవాలి. చిరంజీవి - సీమాంధ్రలో కాంగ్రెస్ అసలు ఖాతా తెరుస్తుందా అన్నది చాలా మందికి ఉన్న పెద్ద అనుమానం. రాజ్యసభ ఎంపీగా కొన్నాళ్లు ఉండొచ్చు. ఆ తరువాత చిరంజీవి సంగతేమిటి? 2019 నాటికి చిరంజీవి అంటే ఎవరు అని అడిగే తరం ఓటు హక్కు సంపాదించుకుంటుంది. ఫేసు టర్నింగ్ ఇచ్చుకొమ్మన్నా, రఫ్ఫాడిస్తానన్నా ఆ తరానికి అర్థం కాదు. జెపి - అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడటం అంటే ఏమిటో జెపి గారిని చూస్తే అర్థమౌతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖం మీదే తలుపేసింది. ఇటు బిజెపి-టీడీపీ కూటమి కిటికీ కూడా తెరవలేదు. అయినా మోడీ బొమ్మ పెట్టుకుని జెపి ప్రచారం చేశారు. కానీ ఫలితం ఏమౌతుందన్న విషయంలో ఎవరికైనా సందేహాలుండవచ్చునేమో కానీ జేపీకి మాత్రం అస్సలు లేదు. ఆర్ కృష్ణయ్య - పాపం ఆర్ కృష్ణయ్య రాజకీయ జీవితం భ్రూణ హత్యలా మారిపోయింది. పుట్టకముందే గిట్టింది. ఇన్నేళ్లు బిసిల కోసం ఆయన చేసిన పోరాటాన్ని విజయవంతంగా సమాధిచేశారు నారా వారు. కృష్ణయ్యకి బాకు వెన్నులో గుచ్చుకుందా లేక ఛాతీలో గుచ్చుకుందా అర్థం కావడం లేదు. అసలు వెన్నుపొటు ఎలా జరిగిందన్నది కూడా అయనకు అర్థం కావడం లేదు. -
డబ్బు, మద్యం, సినీ గ్లామర్... ఇదేనా రాజకీయం !
-
సిద్ధాతమంటూ ఒకటి లేని స్టార్ నేత !
-
ఇలాంటి పొత్తులను ఎక్కడా చూడలేదు !
-
"జేపీకి తెలియకుండానే 'ఇదంతా' జరిగుంటుందా ?"
-
క్రేజివాల్ను బహిష్కరిస్తున్నాం: జెపి
-
''లోక్‌సత్తా ఎవరితో ఒప్పందాలున్నాయో చెప్పాలి''
-
ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా 'సత్తా'
-
ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా..
రూ. 35 కోట్ల మొత్తానికి అనురాగ్ కేజ్రీవాల్ ఒప్పందం కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా ఓ చానల్ పాత్రికేయుల బేరాలు మోడీ ప్రభుత్వంలో జేపీ మంత్రి కావటం ఖాయమన్న అనురాగ్ ఆయన శాఖలో ఏ పని కావాలన్నా చేస్తామంటూ ‘గ్యారంటీ’ జేపీ ‘నో కరప్షన్’ నీతి పాఠాలు యువత కోసమేనని వ్యాఖ్యలు ఆంధ్రాలో 5 ఎంపీ, 20 అసెంబ్లీ సీట్లు, ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్లకు మొత్తం రూ. 35 కోట్లు పార్టీకి ఇవ్వాలని ఒప్పందం ‘ఆపరేషన్ లోక్‌సభ’ స్టింగ్ ఆపరేషన్‌ను బయటపెట్టిన న్యూస్ ఎక్స్‌ప్రెస్.. వీడియో దృశ్యాల ప్రసారంతో లోక్‌సత్తాలో కలకలం హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన అనురాగ్.. జేపీతో భేటీ అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని జేపీ వెల్లడి ‘‘మోడీ గెలవడం గ్యారంటీ.. 99 శాతం జేపీ మంత్రి కావడం ఖాయం. ఆయన పేరు లిస్ట్‌లో ఉంది. జేపీ మంత్రి అయ్యారనుకోండి.. ఆయన శాఖకు సంబంధించి మీకు ఏ రకమైన ప్రయోజనం కావాలన్నా చేస్తాం. మీ కంపెనీ షార్ట్ లిస్ట్ అయితే ఎలాంటి లెసైన్స్ ఇచ్చేందుకు ప్రమోట్ చేస్తాం. ప్రతి పనికీ ఓ బడ్జెట్ ఉంటుంది. మీరు 2జీ లాంటి స్కాం చేయాలంటే ఆయన చేయడు. మీరు నా చేతుల్లో ఒక లాజికల్ పేపర్ ఉంచారనుకోండి.. జేపీ హామీ ఇస్తారు.. నేను జేపీతో చెప్తాను.. మన వాళ్లకు సాయం చేయాలి అని’’ ‘‘జేపీ గురించి అందరికీ తెలుసు.. టీవీలో మీరు వినే ఉంటారు.. ‘నో కరప్షన్ - నో కరప్షన్’ అనే ఆయన నినాదాన్ని. ‘మీరిలా నీతి పాట పాడితే ఎలా కుదురుతుంది సార్..?’ అని నేను ప్రశ్నిస్తే.. ‘అనురాగ్! నేను యువతకు చెప్తున్నా.. మూర్ఖులు కాకండి అని. అయినా నేను డబ్బు ఇవ్వకుండా ఒక లెసైన్స్ కోసం వారం రోజులు లైన్లో నిలబడతానా?’ అని ఆయన బదులిచ్చారు...’’ ‘‘కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా పాలసీ వస్తే.. మీరు లాజికల్ పాయింట్ ఇస్తే మేము వ్యతిరేకిస్తాం.. పార్లమెంటులో గొడవ చేయించాలి.. లేదా పాలసీకి వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఏదైనా సాధ్యం.. మీకు ఏ అవసరం వచ్చినా లెటర్ ఇప్పించగలను. దోపిడీలు చేయించలేము.. కానీ జేబులు కత్తిరిస్తాం...’’ ‘‘ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్ల కోసం రూ. 20 లక్షల చొప్పున కావాలి. అంటే రూ. 14 కోట్లు అవుతుంది. మొత్తం రూ. 25 కోట్లు మా పార్టీ కోసం ఇవ్వాలి. ఆంధ్రాలో 5 పార్లమెంటు సీట్లకు రూ. 70 లక్షల చొప్పున రూ. 3.5 కోట్లు, కనీసం 20 ఎమ్మెల్యే సీట్ల కోసం రూ. 20 లక్షలు చొప్పున రూ. 4 కోట్లు ఇవ్వండి. మొత్తం 32.5 కోట్లు అవుతుంది. రౌండ్ ఫిగర్ రూ. 35 కోట్లు ఇవ్వండి...’’ లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ ‘కార్పొరేట్ సంస్థల’ ప్రతినిధులతో నెరపిన ‘బేరసారా’ల్లో సంభాషణలివి! ప్రముఖ హిందీ వార్తా చానల్ ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా నేత ఇలా ఒప్పందం చేసుకుని దొరికిపోయారు. ఆయనను పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ సస్పెండ్ చేశారు. తాను సరదాగా మాట్లాడిన మాటలను రహస్యంగా చిత్రీకరించారని, పూర్తి సంభాషణలను ప్రసారం చేయకుండా, తమకు అనుకూలంగా కత్తిరించి ప్రసారం చేశారని అనురాగ్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మంత్రి అవటం ఖాయమని.. ఆయన మంత్రిత్వశాఖలో కార్పొరేట్ సంస్థలకు ఏ పని కావాలన్నా చేసిపెడతామని.. అందుకోసం ఎన్నికల్లో తమ పార్టీకి రూ. 35 కోట్లు ఇవ్వాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన దృశ్యాలు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడటం కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్.. ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు, అవినీతి నిర్మూలనకు ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభించిన లోక్‌సత్తాను గత ఎన్నికలకు ముందు లోక్‌సత్తా పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి జేపీ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలవటమూ విదితమే. తాజా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో లోక్‌సత్తా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుండటం.. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి జేపీ పోటీ చేస్తుండటం తెలిసిందే. అయితే..ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు సంబంధించి చిన్న పార్టీలు, డమ్మీ అభ్యర్థుల పా త్ర, కార్పొరేట్ సంస్థలతో చీకటి ఒప్పందాలు తదితర అం శాలపై ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజాగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ‘ఆపరేషన్ లోక్‌సభ’ పేరుతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో దృశ్యాలను ఆ చానల్ శనివారం ప్రసారం చేసింది. ఇందులో లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ చేసుకున్న ‘ఒప్పందాన్ని’ కూడా బయటపెట్టింది. ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుని పరిచయం చేసుకున్న తమ చానల్ పాత్రికేయులు.. కార్పొరేట్ వర్గాలకు సహాయం చేస్తామంటే ఎన్నికల నిధులు సమకూరుస్తామని లోక్‌సత్తా పార్టీ నేతను సంప్రదించగా ఆయన బుట్టలోపడ్డారని పేర్కొంది. జేపీతో చెప్పి ఏ పని కావాలన్నా చేయిస్తానని ‘గ్యారంటీ’ ఇచ్చారని.. ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని చెప్తున్న దృశ్యాలను చూపింది. అలాగే.. ‘‘ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అవుతా.. ఇక్కడ కూడా మీరు ఏం చెప్తే అది చేయగలను... ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధం.. దక్షిణ ఢిల్లీ, ఆర్కే పురం, కొత్త ఢిల్లీ.. సీట్లూ నా చేతిలోనే ఉన్నాయి’’ అని కూడా అనురాగ్ కేజ్రీవాల్ చెప్తున్న దృశ్యాలనూ ప్రసారం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు, ఆంధ్రప్రదేశ్‌లోని 5 పార్లమెంటు, 20 అసెంబ్లీ స్థానాలకు మొత్తం రూ. 35 కోట్లు తమ పార్టీకి ఇవ్వాలని ఖర్చు అవుతుందని అనురాగ్ కేజ్రీవాల్ డీల్ చేసుకున్న వీడియో దృశ్యాలను ఆ చానల్ చూపింది. ఆయనను సస్పెండ్ చేశాం: జేపీ న్యూస్ ఎక్స్‌ప్రెస్ స్టింగ్ ఆపరేషన్ లోక్‌సత్తా పార్టీలో కలకలం సృష్టించింది. అనురాగ్ కేజ్రీవాల్ శనివారం ఉదయం హడావుడిగా హైదరాబాద్ చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో సమావేశమయ్యారు. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. జయప్రకాష్ నారాయణ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులు ‘స్టింగ్ ఆపరేషన్’ గురించి ప్రస్తావించగా.. మొదట దీని గురించి ఏమీ తెలియదని అంటూనే, ఆ కొద్దిసేపటికే అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అనురాగ్ క్రేజీవాల్ డబ్బులు వసూలు చేశారంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ‘ఆయన డబ్బులు వసూలు చేశారా?’ అంటూ సదరు విలేకరిని జేపీ రెట్టించారు. ‘‘జేపీ ఎన్నికలలో గెలవడానికి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తే మీకు తెలియదా? అంతా విచిత్రంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. పార్టీకి నిధుల సేకరణ చెక్కుల రూపంలో జరుగుతుందని.. పార్టీ విరాళాలకు సంబంధించిన వివరాలను ఎవరైనా పరిశీలించుకోవచ్చని బదులిచ్చారు. సంభాషణలు కత్తిరించారు: అనురాగ్ కేజ్రీవాల్ కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా వచ్చిన వారు తమ పార్టీకి ఫైనాన్స్ చేస్తామన్నారని, అయితే లోక్‌సత్తా పెద్ద పార్టీ కాదని, అయినా తమ పార్టీకి ఎందుకు ఫైనాన్స్ చేయాలనుకుంటున్నారని, మద్దతు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని తాను వారిని అడిగానని అనురాగ్ కేజ్రీవాల్ ‘సాక్షి’తో ఫోన్లో పేర్కొన్నారు. స్టింగ్ ఆపరేషన్‌పై వివరణ కోసం ‘సాక్షి’ సంప్రదించినపుడు.. మీడియా ప్రతినిధులు తమ మధ్య జరిగిన పూర్తి సంభాషణలు లేకుండా, వారికి అవసరమయ్యే విధంగా కత్తిరించి, మార్పుచేర్పులు చేసి ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. సరదాగా మాట్లాడిన వాటిని కూడా రహస్యంగా చిత్రీకరించి ప్రసారం చేశారని వాపోయారు. పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో అనురాగ్ క్రేజీవాల్ మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. అనురాగ్ క్రేజీవాల్ తమ పార్టీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని, ఆయనపై ఇప్పుడు ఆరోపణలు రావడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. డమ్మీ అభ్యర్థుల దందాపై ‘స్టింగ్’ న్యూస్ ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ పార్టీలకు దడపుట్టిస్తోంది. ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే ఈ చానల్‌కు చెందిన బృందం అనేక అవతారాలు ఎత్తి ‘ఆపరేషన్ లోక్‌సభ’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు కొందరు గెలవడానికి పోటీచేస్తే.. కొందరు ఓడిపోవడానికి పోటీచేస్తారని, మరికొందరు ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు పోటీచేస్తారని, ఇంకొందరు ప్రధాన అభ్యర్థికి డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. వీరిని పోటీచేయించే వారు తెర వెనక ఉంటారని.. ఈ మొత్తం ‘మ్యాచ్ ఫిక్సింగ్’లలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయని ఈ స్టింగ్ ఆపరేషన్ కథనాల సారాంశం. ఇందులో పలు పార్టీల నేతలు ప్రత్యర్థుల ఓట్లను ఎలా చీల్చారో వారితోనే టీవీ చానల్ చెప్పించింది. బలమైన ప్రత్యర్థి ఉన్న చోట ఆ ప్రత్యర్థి పేరును పోలిన వారిని డమ్మీలుగా నిలబెట్టిన వైనాన్ని టీవీ కథనం వివరించింది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ నేత అశుతోష్ నిలిచిన చోట అదే పేరుతో మరో అభ్యర్థిని నిలబెట్టడం, హేమామాలిని నిలుచున్న చోట అదే పేరు ఉన్న మరికొందరు అభ్యర్థులను నిలబెట్టడం వంటి చర్యలు వెల్లడయ్యాయి. అలాగే బీఎస్పీ కూడా రాజస్థాన్‌లో ప్రత్యర్థులకు సంబంధించి డ మ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఈ కథనాలు ఆరోపించాయి. తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా పార్టీతో పాటు, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి వాటితో పాటు.. వంచిత్ సమాజ్ ఇన్సాఫ్ పార్టీ, నయాదౌర్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీల పాత్రను, కొందరు పెద్ద పార్టీల అభ్యర్థుల ధన లోలతను స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. -
ఆ ఒక్క సీటు కోసమేనా..!
-
హాట్‌కేక్‌లా మారిన నియోజక వర్గం
రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం హాట్‌కేక్‌లా మారింది. ఈ నియోజకవర్గం మీద అనేక మంది కళ్లు పడుతున్నాయి. మొన్నటి వరకూ ఇక్కడి నుంచి పోటీలోకి దిగాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి అనుకున్నారు. తాజాగా మల్కాజ్గిరి సీటు కోసం పోటీ పడుతున్న జాబితాలో లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా చేరారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. దాంతో జెపి కన్ను దీనిపై పడింది. బీజేపీ మద్దతుతో జేపీ రంగంలోకి దిగితే, తన కథ హుళక్కే అని టిడిపి నేత రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో పడ్డారు. ఆ క్రమంలో ఆమె మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. విజయశాంతి బిజెపిలో చేరితే ఆ పార్టీ ఈ స్థానాన్ని ఆమెకే కేటాయించే అవకాశం ఉంది. విజయశాంతితోపాటు జెపి కూడా ఈ నియోజకవర్గం వైపే చూస్తున్నారు. టిడిపి బిజెపితో పొత్తుపెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తుపెట్టుకుంటే ఏ విధంగా చూసుకున్నా మల్కాజ్గిరి స్థానం టిడిపికి కేటాయించే అవకాశం లేదు. టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీచేయాలన్న ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఎన్డీఏతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఇక్కడి నుంచి జేపీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి బిజెపిలో చేరితే అప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో తన పరిస్థితి ఏంటని రేవంత్ మధనపడుతున్నారు. అంతేకాకుండా టీడీపీలో లొల్లి కూడా పెడుతున్నారు. మల్కాజ్‌గిరిపై ఎక్కువమంది కన్నేయడంతో ఇప్పుడు రేవంత్ చిక్కుల్లో పడ్డారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. -
'ఇంతకీ నేను ఏ ప్రాంతానికి చెందినవాడిని?'
హైదరాబాద్ : 'నా బాల్యం మహారాష్ట్రలో...విద్యాభ్యాసం కోస్తాంధ్రలో.... ఐఏఎస్ శిక్షణ కరీంనగర్లో.... అసెంబ్లీకి ఎన్నికైంది హైదరాబాద్ నుంచి .... ఇంతకీ నేను ఇప్పుడు ఏ ప్రాంతానికి చెందినవాడినో చెప్పాలని' లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రావనిలో రాజకీయాలు అంపశయ్యపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజనతో పచ్చని నేలపై చిచ్చు రేగిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వందల రాత్రులు నిద్ర లేకుండా గడిపానని ఆయన అన్నారు. ఇవాళ పార్టీలు చచ్చిపోయాయని, కేవలం ప్రాంతాలు మాత్రమే మిగిలాయన్నారు. విభజన నిర్ణయంతో తెలుగు మాట్లాడే ప్రజల్లో ఎన్నో ఆశలు, భయాలు ఉన్నాయని జేపీ అన్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా చర్చ జరగాలని ఆయన కోరారు. ఏడు అంశాలపై పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని...అయితే అందులో అయిదు మాత్రమే అమలు అయ్యాయన్నారు. దాంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తెలుగు ప్రజల మధ్య కేంద్రం చిచ్చు పెట్టిందని...బలవంతంగా ఐక్యత కొనసాగించటం కష్టమన్నారు. విరిగిన మనసుల్ని అతికించటం కష్టం అన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని సకాలంలో స్పందించి ఉంటే ప్రజల మధ్య అగాధం వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రాంతీయ భావం పెరిగిపోయిందని జేపీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి అస్థిత్వం ఎంతో అవసరం అని, అయితే అది హద్దు మీరకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, ఆవశ్యమని జేపీ స్పష్టం చేశారు. బలవంతంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే అపార నష్టం కలుగుతుందన్నారు. ప్రజలను ఒప్పించి విభజన చేపట్టాలని ఆయన అన్నారు. -
'ఇంతకీ నేను ఏ ప్రాంతానికి చెందినవాడిని?'
-
'అధికారం దక్కదన్న భయంతోనే విభజన'
హైదరాబాద్ : అధికారం దక్కదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడిందని.. లోక్‌సత్తా ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మంగళవారం మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క సీటూ రాదన్నభయంతోనే.. తొమ్మదికోట్లమంది ప్రజలను విభజిస్తోందన్నారు. అతిపెద్ద భాషాప్రయుక్త రాష్ట్రాన్ని బలి చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని జేపీ మండిపడ్డారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసమగ్ర బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. బిల్లుపై గుడ్డిగా ముందుకు వెళితే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ముసాయిదా బిల్లుపై సమగ్ర వివరాలు లేకుండా చర్చ చేపట్టమంటున్నారని అన్నారు. తెలుగు ప్రజల కోసం ఏమేరకు వనరులు ఇస్తుందో కేంద్రం చెప్పలేదన్నారు. ప్రాంతాల వారీగా సిబ్బంది వివరాలు, ఆస్తులు, అప్పులు వివరాలు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరినట్లు జేపీ తెలిపారు. రాజకీయంగా ఎలాంటి మార్పులు వచ్చిన తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలి : జెపి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షోభంపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన సమస్యను తమ సొంత పార్టీ వ్యవహారంలా చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వ కమిటీ లేదా సంయుక్త పార్లమెంటరి కమిటీ వేయాలని కోరారు. కేంద్రప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రక్కన పెట్టి దేశ సమగ్రతకు కృషి చేయాలన్నారు. ఇరుప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించాడానికే తెలుగు తేజం యాత్రను త్వరలోనే కొనసాగిస్తానని చెప్పారు.