హైదరాబాద్:రాజకీయ లబ్దికోసమే హడావిడిగా రాష్ట్ర విభజన చేస్తున్నారని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం రాష్ట్రపతి కలిసిన ఆయన విభజనపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లులోని లోపాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష నేరవేర్చడంతో పాటు సీమాంధ్రలోని ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రాజ్యాంగపరంగా విభజన చేస్తేనే లోక్సత్తా మద్దతు ఇస్తుందని రాష్ట్రపతికి తెలిపామన్నారు.
డిసెంబర్ 19వ తేదీ, గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రణబ్ ను పలువురు నేతలు కలిసి విభజనపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోరాష్ట్రపతిని కలిసిన జేపీ..రాష్ట్ర విభజన బిల్లులు లోపాలను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏ ప్రాంత ప్రజలు నష్టపోకుండా చూడాలని రాష్ట్రపతికి తెలిపారు.