జనవరి 11న కేజ్రివాల్ తో జయప్రకాశ్ సమావేశం!
జనవరి 11న కేజ్రివాల్ తో జయప్రకాశ్ సమావేశం!
Published Mon, Jan 6 2014 1:52 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ నేతలతో కలిసి జనవరి 11 తేదిన సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయేతర ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇరుపార్టీలు కలిసి పనిచేసే అవకాశంపై చర్చించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి తమ పార్టీ వాలింటర్లు కృషి చేశారని, నిధులను కూడా సేకరించి పంపామని జేపీ వెల్లడించారు.
వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు స్వచ్చమైన రాజకీయాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మానిక్ సర్కార్, మమతా బెనర్జీ, మనోహర్ పరిక్కర్, ఎన్ రంగస్వామి, లాంటి వ్యక్తులందర్ని కలుపుకుపోతే కొద్ది నెలల్లోనే ఢిల్లీ రాజకీయాల్లో మార్పును దేశవ్యాప్తంగా సాధించేందుకు అంత కష్టమేమి కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏపీ సహా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో లోక్‌సత్తా శాఖలున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి పెడతామన్నారు. కాగా, జబ్బార్, దివాకర్ ట్రావెల్స్‌పై లోక్‌సత్తా మెరుపుదాడులకు దిగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు.
Advertisement
Advertisement