'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం' | crores for vote case should hand over to cbi, says jayaprakash narayan | Sakshi
Sakshi News home page

'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం'

Published Mon, Jun 29 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం'

'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం'

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్ -8 గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని  లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. పదమూడు నెలలుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్రా ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని జేపీ స్పష్టం చేశారు.

 

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు ప్రజల మధ్య ఎంతగా చిచ్చు పెడితే అంతలా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు, ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని జేపీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement