ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదని తేలితే ఆయన రాజీనామా సిద్ధంగా ఉన్నారా? జేపీ సవాల్ విసిరారు. 'మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడం నిజం కాదా?, మీ అనుమతి లేకుండా చేస్తే రేవంత్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?, 15 ఏళ్లల్లో ఎన్నడూ లేనివిధంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రస్థావన నిన్నే ఎందుకు తీసుకున్నారు?అని చంద్రబాబును జేపీ నిలదీశారు. ఒకవేళ ఆ ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదని తేలితే ఆయన రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా?అని ప్రశ్నించారు.