అవినీతి వల్లే వెనుకబాటు
- యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి
- మహిళా నాయకత్వం అవసరం
- లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్
- {పత్యేక నిధులకు డిమాండ్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: అవినీ తి, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడి పోయిందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ అన్నారు. మర్రిపాలెం శారదాగార్డెన్స్‌లో శనివారం సా యంత్రం నిర్వహించిన శంఖారావంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉం దని చె ప్పారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాధ్ర నుంచి బాబ్జీ, వేణుగోపాల్ వంటి నాయకులను అసెంబ్లీకి పంపించాలని కోరారు. దేశంలో మహిళాభ్యున్నతి సాధించాలంటే మహిళా నాయకత్వం అవసరమన్నారు. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మంచి నాయకులను ఎన్నుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
విశాఖ ఉత్తరనియోజకవర్గ అభ్యర్థి, పార్టీ ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఏళ్ల తరబడి దోచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వేణుగోపాల్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోకసత్తా సత్తా చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలరావు, యువ సత్తా, మహిళా సత్తా ప్రతినిధులు పాల్గొన్నారు.