womens leadership
-
లండన్ నుంచి పేదోళ్ల ఇంటి వరకు...
బ్రిటీష్–ఇండియన్ మోడల్‌గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన. భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. మన బాలీవుడ్‌తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్‌నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్‌స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది. ‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్‌లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన. ఇంగ్లాండ్‌లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ‘ఇండియాస్ ఫర్గాటెన్ పీపుల్’ (నెట్ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. -
వ్యాపారాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక పేర్కొంది. లింగ సమానత్వానికి సంబంధించి భారత్ ర్యాంకింగ్ ఇంకా అట్టడుగునే ఉన్నప్పటికీ, క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది. అత్యున్నత స్థానాల్లో మహిళలు 2018లో 20 శాతానికి పెరిగారని గ్రాంట్ థార్న్టన్ ‘వ్యాపారాల్లో మహిళలు: ప్రగతి దిశగా విధానాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2017లో ఈ పరిమాణం 17 శాతంగా ఉంది. ఇక 2014లో 14 శాతం మాత్రమే. గతేడాది జూలై–డిసెంబర్ మధ్య 35 దేశాల్లో మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు చెందిన దాదాపు 4,995 మంది సీఈఓలు, ఎండీలు, ఇతరత్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. ఇప్పటికీ తమ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో మహిళలు లేరని సర్వేల్లో పాల్గొన్న 30 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పడం గమనార్హం. భారత్‌లో వ్యాపారాలను నడిపిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని. అయితే, ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉందని గ్రాంట్ థార్న్టన్ అడ్వయిజరీకి చెందిన కవితా మాథుర్ పేర్కొన్నారు. దేశీ వ్యాపార సంస్థల్లో స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించిన విధానాలు మెరుగ్గానే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లోని దాదాపు 64 శాతం వ్యాపార సంస్థలు ఒకే పనికి సంబంధించి మహిళలు, పురుషులకు సమాన వేతనాలను ఇస్తున్నాయని.. అదేవిధంగా నియామకాల్లో కూడా 55 శాతం సంస్థలు వివక్షకు తావులేని విధానాలను అనుసరిస్తున్నాయని వివరించింది. కాగా, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సంబంధించి సమానత్వాన్ని తీసుకురావాలంటే ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సర్వేలో పాల్గొన్న 57 శాతం భారతీయ వ్యాపార సంస్థలు పేర్కొన్నాయి. -
అవినీతి వల్లే వెనుకబాటు
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి మహిళా నాయకత్వం అవసరం లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ {పత్యేక నిధులకు డిమాండ్ విశాఖపట్నం, న్యూస్‌లైన్: అవినీ తి, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడి పోయిందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ అన్నారు. మర్రిపాలెం శారదాగార్డెన్స్లో శనివారం సా యంత్రం నిర్వహించిన శంఖారావంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉం దని చె ప్పారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాధ్ర నుంచి బాబ్జీ, వేణుగోపాల్ వంటి నాయకులను అసెంబ్లీకి పంపించాలని కోరారు. దేశంలో మహిళాభ్యున్నతి సాధించాలంటే మహిళా నాయకత్వం అవసరమన్నారు. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మంచి నాయకులను ఎన్నుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ ఉత్తరనియోజకవర్గ అభ్యర్థి, పార్టీ ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఏళ్ల తరబడి దోచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వేణుగోపాల్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోకసత్తా సత్తా చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలరావు, యువ సత్తా, మహిళా సత్తా ప్రతినిధులు పాల్గొన్నారు.