సొంత సామాజికవర్గ రాజకీయ, ఆర్థిక అధిపత్యం కోసమే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పాకులాడుతున్నారని టీఆర్‌ఎస్ అధికారప్రతినిధి శ్రవణ్ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: సొంత సామాజికవర్గ రాజకీయ, ఆర్థిక అధిపత్యం కోసమే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పాకులాడుతున్నారని టీఆర్‌ఎస్ అధికారప్రతినిధి శ్రవణ్ విమర్శించారు.
తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై నెలకొన్న పరిస్థితులను ప్రజలంతా ఉత్కంఠగా చూస్తుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ తో రాజకీయ పొత్తుకోసం దుర్మార్గపు ఎత్తులు వేస్తున్న జేపీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో కులం, మతం, నేరం, వ్యాపారం వంటి నాలుగు కీడు చేసే వైరస్‌లు జేపీకి, లోక్‌సత్తాకు ఉన్నాయని ఆరోపించారు.