Pocket Money
-
మిత్రమా... ప్రతి మీమ్‌కు ఒక లెక్క ఉంది!
కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఊపందుకున్న ‘మీమ్స్’ ట్రెండ్ ఇప్పుడు ‘మోర్ దేన్ ఏ ట్రెండ్’గా మారింది.పాకెట్ మనీ సంపాదించుకోవడానికి యూత్‌కు మార్గం అయింది... పాప్ కల్చర్ మూమెంట్ అనగానే యూత్‌కి సంబంధించి ఒక సినిమా రిలీజ్, క్రికెట్ ఆట, మ్యూజిక్ప్రోగ్రామ్... ఇలా ఏవేవో గుర్తుకు వస్తాయి. అయితే మిలీనియల్స్‌కు మాత్రం మీమ్స్, వైరల్ వీడియోలే పాప్‌కల్చర్ మూమెంట్. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మీమ్స్ ట్రెండ్ ఊపందుకుంది. టైమ్‌పాస్ కోసం చేసినా తమలోని ఒత్తిడి, అకారణ భయం, బోర్డమ్ దూరం కావడానికి మీమ్స్ ఉపకరించాయి. మొన్నటివరకు ట్రెండ్‌గా ఉన్న మీమ్స్ ఇప్పుడు మోర్ దేన్ ఏ ట్రెండ్‌గా మారాయి. దీనికి కారణం సోషల్ మీడియా బ్రాండ్ మార్కెటింగ్‌లో ‘మీమ్స్’ భాగం కావడమే కాదు కీలకం కావడం.‘ఒక విషయాన్ని సీరియస్‌గా, బోధన చేస్తున్నట్లుగా కాకుండా సరదాగా చెబితే కస్టమర్లకు వేగంగా చేరువ అవుతుంది’ అనే పబ్లిసిటీ సూత్రానికి మీమ్ అనేది నిలువెత్తు దర్పణంగా మారింది. బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగం అయింది.‘హైంజ్’ అనే అమెరికన్ ఫుడ్ ్రపాసెసింగ్ కంపెనీ యూత్ క్రియేటివిటీని ఉపయోగించి మీమ్స్‌ను బాగా వాడుకుంటోంది. మీమ్స్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బ్రాండ్‌కు సంబంధించి వోవర్ ప్రమోషన్ కనిపించదు. సహజంగా, సరదాగా ఉంటూనే బ్రాండ్ గురించి ఎలాంటి ఆడంబరం లేకుండా నిశ్శబ్దంగా ప్రచారం చేస్తాయి. ఎక్కువ సమయం తీసుకోకపోవడం మరో ప్రత్యేకత. ‘మీమ్స్ అనేవి ఫ్యూచర్ ఆఫ్ సోషల్ మార్కెటింగ్. వీటిలో యూత్ కీలక పాత్ర పోషించనుంది. కాలం మారింది. చిన్న బ్రాండ్, పెద్ద బ్రాండ్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని బ్రాండ్లకు సోషల్ మార్కెటింగ్‌లో మీమ్స్ అనేవి తప్పనిసరి అవసరం’ అంటున్నాడు మీమ్స్.కామ్ కో–ఫౌండర్ రజ్వన్. మీమ్స్ అనేవి కేవలం సరదా కోసం మాత్రమే కాదని పాకెట్‌మనీ సంపాదించుకోవచ్చనే సత్యం బోధపడడం తో యూత్ ఇప్పుడు వాటిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ‘మీమ్ హిట్ కావడానికి గోల్డెన్ రూల్స్ ఏమిటి?’ అంటూ వెదకడం ్రపారంభించింది. గోల్డెన్ రూల్స్‌లో ఒకటి...‘అందరికీ నచ్చేలా ఉండాలి అని చేసే మీమ్స్ కంటే టార్గెట్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేసేవే బాగా క్లిక్ అవుతాయి’ అనేది.బెంగళూరుకు చెందిన ఎన్ఆర్.హారికకు మీమ్స్ అంటే ఇష్టం. తాను కూడా వాటిని చేయాలనుకుంటోంది. ఎలీన్ బ్రౌన్ అనే జర్నలిస్ట్ రాసిన ‘ది మ్యాథ్స్ బిహైండ్ ది మీమ్స్’ అనే వ్యాసాన్ని మిత్రులకు షేర్ చేయడం అంటే తనకు ఇష్టం. మీమ్స్ తయారీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇష్టమైన వ్యాసాల్లో ఒకటి అంజలి వేణుగోపాలన్ రాసిన ‘ది సైన్స్ బిహైండ్ మీమ్ మార్కెట్’‘ఒకరు ఒక మీమ్‌ను క్రియేట్ చేయడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మోటివేషనల్ అండ్ ఎమోషనల్ రెస్పాన్స్’ అంటుంది ఎలీన్ బ్రౌన్. అయితే ఇప్పటి విషయానికి వస్తే మీమ్‌ను రూపొందించడంలో మోటివేషనల్, ఎమోషనల్ కంటే వినోదం, వ్యంగ్యం పాలే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కావచ్చు...‘మీమ్ నిర్వచనం కాలంతోపాటు మారుతూ వస్తుంది’ అంటుంటారు. ‘మీమ్స్ అనేవి మన నిత్యజీవితంలో భాగం అయ్యాయి. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు కొత్త న్యూస్ క్లిప్‌ల నుంచి పాత న్యూస్ క్లిప్‌ల వరకు ఏదైనా మీమ్ చేయవచ్చు. అయితే దాన్ని ఎలా హిట్ చేస్తాం అనేదే ముఖ్యం. యువతరం ఈ విద్యలో ఆరితేరింది’ అంటున్నారు మీమ్ మార్కెటింగ్ ఏజెన్సీ‘యంగ్‌గన్’ ఫౌండర్ సాక్ష్యమ్ జాదవ్.‘మీమ్’ల రూపకల్పనలో ఎన్నో వెబ్సైట్లు యూత్‌కు ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటి... సూపర్మీమ్. మీమ్‌కు అవసరమైన కంటెంట్ ఇస్తే ఈ ఏఐ ఆధారిత వెబ్సైట్ మనకు అవసరమైన మీమ్ తయారు చేసి ఇస్తుంది. టెక్ట్స్‌ను మీమ్‌గా కన్వర్ట్ చేయడమే కాదు మీమ్ సెర్చ్ ఇంజిన్‌గా కూడా ఉపయోగపడుతుంది. పాకెట్‌మనీ కంటే కాస్త ఎక్కువే! ‘మీమ్స్’కు డిమాండ్ ఏర్పడడానికి కారణం సంప్రదాయ అడ్వర్టైజింగ్లతో పోల్చితే తక్కువ ఖర్చు కావడం. క్రియేటర్లలో వైట్–కాలర్ ఎంప్లా యీస్ కంటే హైస్కూల్, కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువమంది ఉండడం! తమ క్రియేటివ్ టాలెంట్‌తో తల్లిదండ్రులపై ఆధారపడకుండా పాకెట్ మనీ, కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నారు. మీమ్ క్రియేటింగ్ అండ్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘మీమ్చాట్’ 1,50,000 క్రియేటర్స్‌కు ఒక్కో మీమ్‌కు 20 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తుంది. అయితే ప్లాట్‌ఫామ్‌ను బట్టి ఈ రెమ్యునరేషన్ మారుతూ ఉండవచ్చు. -
రాణిగారి కన్నా ఏం తక్కువ
సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్ మీడియా! ఎలిజబెత్ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది. ఇన్ఫోసిస్ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్ ఇండియాలోనే ‘హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్’కి టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్ వర్కర్. కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్ టీచర్. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్ చైర్మన్. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది. ∙∙ అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్మేట్స్. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘క్యాటమరాన్ వెంచర్స్’ ఆస్తులు, ఇన్ఫోసిస్ లో ఆమెకు ఉన్న షేర్లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ∙∙ ‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి. తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు. -
వారికి పాకెట్ మనీ రూ.500 ..
సాక్షి, నిర్మల్ : విద్యతోనే ప్రగతి సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ఎస్సీ వసతి గృహాల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్యూషన్ ఫీజు, మెస్‌బిల్లు, పరీక్ష ఫీజు ఇలా ఎన్నో మినహాయింపు ఇస్తున్నారు. అయితే విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి ఆర్థిక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. జేబు ఖర్చులు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో లోలోన మదనపడుతున్నారు. వీరి ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.500 కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు జేబు ఖర్చుల కింద సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వీరికి ప్రతి నెల ఠంచన్‌గా నెలకు రూ.500చొప్పున అందజేయనుంది. ప్రస్తుతం వసతి గృహాల్లో కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే కాస్మోటిక్ చార్జీ లు అందిస్తున్నారు. బాలురకు రూ.62, బాలికలకు 3 నుంచి 7వ తరగతి చదివేవారికి రూ.55, అలాగే 8,9,10 తరగతుల వారికి రూ.75 అందిస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు విద్యనభ్యసించి, మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు సైతం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసింది. ఈ మేరకు షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహాలను జిల్లాలో ఇదివరకే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలా అమలు.. నిర్మల్ జిల్లాలో మొత్తం ఐదు ఎస్సీ కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. నిర్మల్‌లో రెండు బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉండగా, భైంసాలో ఒకటి బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉంది. ఇందులో మొత్తం 366మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాల్లో పారామెడికల్, నర్సింగ్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం కేవలం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తోంది. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికభారం కావడంతో నెలనెలా అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నెలకు రూ.500 చొప్పున సాయం అందించనుంది. నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే ఈ సొమ్ము జ మ చేయనుంది. అయితే ప్రతి నెలా ఈ డబ్బు లు పొందాలంటే 75శాతం హాజరు, 20 రోజు ల పాటు వసతి గృహంలో ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇందుకోసం విద్యార్థి ప్రతి నెలా హాజరుకు సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 75శాతం హాజరు తప్పనిసరి విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల్లో 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అవసరాలకు మాత్రమే వినియోగించుకుని ఉత్తమ ఫలితాలపై దృష్టి సారించాలి. – కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి -
‘సాంఘిక సంక్షేమం’లో పాకెట్ మనీ..
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం పాకెట్ మనీ అందించనుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు వివిధ అవసరాల నిమిత్తం చేతిలో నగదు లేక.. ఇంటి వద్ద నుంచి పాకెట్ మనీ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా రూ.500 అందజేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 11 ఎస్సీ కళాశాల హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో మొత్తం 1864 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ లబ్ధి జరగనుంది. హాస్టళ్ల నిర్వహణ వ్యయం పెంపు.. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్ నిర్వహణ వ్యయం కూడా పెంచాలని నిర్ణయించింది. గతంలో ఒక విద్యార్థికి రూ.4వేలు వెచ్చిస్తుండగా.. ప్రస్తుతం రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న బాలికలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పగలు, రాత్రి వేళల్లో వాచ్మన్లను నియమించనున్నారు. గతంలో ఒక వాచ్‌మన్ మాత్రమే పగటిపూట కాపలా ఉండేవాడని, ప్రసుత్తం 24 గంటలు హాస్టళ్ల వద్ద కాపాలా ఉండేందుకు వాచ్మన్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు సైతం నిధులను ప్రతి సంవత్సరం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కళాశాల హాస్టళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వార్షిక వేడుకలకు నిధులు.. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థులు ప్రతీ సంవత్సరం వార్షిక వేడుకలను నిర్వహించుకునేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇక నుంచి ప్రతి ఏటా రూ.20వేలను మంజూరు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులటు కూడా జారీ చేసి ఆయా జిల్లా అధికారులకు జీవోలను జారీ చేసింది. ఈ నెల నుంచి వ్యక్తిగత ఖర్చుల కింద రూ.500 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుసుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకే.. షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదువుపై ఏకాగ్రత పెంచేందుకు వారి ఖర్చులకు అవసరమైన పాకెట్ మనీ ఏర్పాటు చేసింది. డైరెక్టర్ కరుణాకర్ ఆదేశాల మేరకు వసతిగృహాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. పాకెట్ మనీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తాం. ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున అందిస్తాం. – కస్తాల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి -
అక్క ఆనందం కోసం...తమ్ముడు...
జైపూర్, రాజస్థాన్: అక్కా, చెల్లెళ్లను ఆటపట్టించి సరదాగా వారిని ఏడిపించే అన్నా, తమ్ముళ్లను మనం చూస్తూనే ఉంటాం. ఖర్చులకు సరిపోక వారి పాకెట్ మనీ కూడా కొట్టేసే తోబుట్టువులను చూసే ఉంటాం. కానీ, సోదరి ఆనందం కోసం జైపూర్‌లోని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆమె కోసం ఒకటా, రెండా ఏకంగా 62 వేల రూపాయలు కూడ బెట్టాడు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. పదమూడేళ్ల కుర్రాడు పాకెట్ మనీని కూడబెట్టడం, అందులోనూ అవన్నీ నాణేల రూపంలో ఉండడం విశేషమే కదా..! వివరాలు... రూపాల్, యాష్ అక్కాతమ్ముళ్లు. రూపాల్‌కు స్కూటీ అంటే ఇష్టం. యాష్ ఎలాగైనా, ఆమెకు స్కూటీని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన ఒక్కో రూపాయిని కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని ఓ పెద్ద బ్యాగులో వేసుకుని రూపాల్‌తో పాటు గతేడాది దీపావళి రోజున హోండా షోరూమ్‌కు మోసుకొచ్చాడు. అప్పటికే షోరూమ్ మూసే వేళయింది. అయితే, యాష్ తన అక్క కోసం దాచిన సొమ్ముని వారికి చూపించి ఎలాగైనా ఈరోజు ఆమెకు స్కూటీ కానుకగా ఇవ్వాలనీ, షోరూమ్ అప్పుడే మూసేయవద్దని వేడుకున్నాడు. కుర్రాడి మాటలకు ముచ్చట పడిన సిబ్బంది సరే అన్నారు. యాష్ తెచ్చిన బ్యాగులోని నాణేలను లెక్క పెట్టడం మొదలు పెట్టారు. రెండు గంటల పాటు అయిదుగురు సిబ్బంది ఆ మొత్తం నాణేలను లెక్కించగా అరవై రెండు వేల రూపాయలుగా తేలింది. స్కూటీకి సరిపడా డబ్బు అందడంతో సిబ్బంది వెంటనే బండిని వారికి అప్పగించారు. కళ్లలో కొండంత ఆనందం నింపుకున్న యాష్ తన సోదరి రూపాల్‌కు స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. ఎంతో మంది పిల్లలకు ఆదర్శంగా నిలిచాడు. చివరివరకు ఈ విషయం పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పకపోవడం గమనార్హం. మామూలుగా బండి కొనేందుకు వచ్చిన వారు కొంత మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుందనీ, కానీ.. ఇలా మొత్తం సొమ్ము నాణేలుగా అందించడం ఎప్పుడూ చూడలేదని షోరూమ్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కకు బహుమతి ఇవ్వడం కోసం యాష్ ఇంతగా కష్టపడడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. -
దారి చూపుతున్న పాకెట్ మనీ
ఆదర్శం విద్యార్థికి చదువు అనేది విలువైన బహుమతి. విజ్ఞానం నుంచి మాత్రమే కాదు విషాదం నుంచి కూడా విలువైన పాఠాలు నేర్చుకునేవాళ్లే నిజమైన విద్యార్థులవుతారు. చెన్నైలోని ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూలు’ విద్యార్థులను గమనిస్తే వారు నేర్చుకునే పాఠాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని, జీవితం నుంచి కూడా నేర్చుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. గత సంవత్సరం చెన్నై వీధుల్లో భిక్షాటన చేసిన సరోజ... ఇప్పుడు పెరంబూర్ బస్‌స్టాప్ సమీపంలో రకరకాల ఫ్యాషన్ వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క సరోజ మాత్రమే కాదు భిక్షాటనే ప్రపంచంగా బతికిన కొద్దిమంది యాచకులు ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంతకాళ్ల మీద నిలబడ్డామనే తృప్తి వారి కళ్లలో బలంగా కనిపిస్తోంది. ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూల్’ విద్యార్థులు తమ పాకెట్‌మనీతో యాచకులను మార్చడానికి, వారిని కొత్త దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. యాచకవృత్తిని వదిలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లలో సరోజ నుంచి నాగర్ వరకు ఎందరో ఉన్నారు. ‘‘ఒకప్పుడు రూపాయి కోసం కూడా చేయి చాపాల్సి వచ్చేది. ఇప్పుడు నేను సొంతకాళ్ల మీద నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను. ఇదంతా ఆ పిల్లల చలవే. వారిది చల్లని మనసు’’ అంటోంది సరోజ. రోశమ్మ అనే యాచకురాలిని తమ స్కూల్లో హౌస్‌కీపర్ ఉద్యోగంలో చేర్పించడం ద్వారా ఆమెను యాచకవృత్తి నుంచి బయటికి వచ్చేలా చేశారు విద్యార్థులు. చిరిగిన మురికి దుస్తులతో దేవాలయాల దగ్గర యాచించే నాగర్ ఇప్పుడు ఆ పనికి స్వస్తి చెప్పాడు. ఒక స్టడీ టేబుల్ మీద చాక్లెట్లు అమ్ముతూ ఎవరినీ యాచించకుండా పొట్ట నింపుకుంటున్నాడు. అతడిలో మార్పు రావడానికి కారణం స్కూలు పిల్లలు. అయితే అందరు యాచకులు ఒకేలా స్పందించలేదు. ‘‘మాకు ఎవరి సహాయం అక్కర్లేదు’’ అని కొందరు ఎప్పటిలాగే యాచననే నమ్ముకున్నారు. అలాంటి వాళ్లలో కూడా కొందరిని మాటలతో మార్చారు ఆ విద్యార్థులు. ఆర్థిక సహాయం చేసి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొనేలా చేయడమే కాదు... ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి సెక్యూరిటీ గార్డ్, స్వీపర్...మొదలైన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. ఒక చిన్న సంఘటన విద్యార్థుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఒకసారి స్కూలు ముందు చిన్న అబ్బాయి, అమ్మాయి అడుక్కుంటూ కనిపించారు. ఈ దృశ్యం విద్యార్థుల మనసులను కదిలించింది. ఇక అప్పటి నుంచి ‘బెగ్గర్‌లెస్ సొసైటీ’ నినాదంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ‘‘ఆనందం అనేది ఆటపాటల్లోనే కాదు...సేవ చేయడంలో కూడా ఉంటుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’’ అంటాడు క్రిస్టీ అనే విద్యార్థి. ‘‘యాచకులను చాలామంది దూరం పెడతారు. నిజానికి వారి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి మాటలు చెబితే... వారు యాచనకు దూరం అవుతారు. కొత్త జీవితాన్ని మొదలుపెడతారు’’ అంటోంది రోషిణి అనే విద్యార్థిని. ‘‘నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వంతో కూడిన మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఈ దిశలో అడుగులు వేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్ అనిత డేనియల్. విద్యార్థుల దగ్గర ధన సహాయాన్ని పొందిన వాళ్లలో కొందరు యాచకులు మళ్లీ కనిపించలేదు. కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకొని సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు గానీ మద్యానికి బానిసై పక్కదోవ పడుతున్నారు. అయితే ఇవేమీ విద్యార్థులను నిరాశపరచడం లేదు. మార్పు అనేది ఒక్క అడుగుతో. ఒక్కరోజుతో మొదలు కాదనే విషయం వారికి తెలుసు. అందుకే భవిష్యత్ పట్ల ధీమాగా ఉన్నారు. బెగ్గర్‌లెస్ సొసైటీ గురించి చిన్న వయసులోనే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. -
బతుకు చిత్రాన్ని మార్చాడు!
ఆదర్శం చదువుకునే కుర్రాళ్లు రకరకాల కారణాలు చెప్పి, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ పాకెట్ మనీ కొట్టేస్తుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. రోహన్ పాటంకర్ కూడా ఒకప్పుడు అలా చేసినవాడే. కానీ ఇప్పుడు తను ఒక్క రూపాయి కూడా ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు చేయట్లేదు. కొందరు అభాగ్యులకు నీడ కల్పించడానికి ఖర్చు పెడుతున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మనసు చూపి ప్రశంసలు అందుకుంటున్నాడు! రోహన్ పాటంకర్... ఢిల్లీలోనే పుట్టి పెరిగాడు. అతనికి ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం. అందుకే ఆ కోర్సులో చేరాడు. చదువు పూర్తయిపోవచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సొచ్చింది. దాని కోసం నేపాల్ వెళ్లాడు. ఆ దేశం తనకి చాలా నచ్చేసింది. అక్కడి ప్రకృతి అందాల్ని చూసి ముగ్ధుడయ్యాడు. ప్రాచీన నిర్మాణాల నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. ఎప్పుడూ అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. కానీ అదెలా కుదురుతుంది! ప్రాజెక్టు ముగిసింది. తిరిగి ఢిల్లీ వచ్చేశాడు. తన పనిలో పడిపోయాడు. కానీ సంవత్సరం తర్వాత తాను మళ్లీ నేపాల్ వెళ్తానని అతనప్పుడు అనుకోలేదు. 2015, ఏప్రిల్. వార్తలు చూస్తోన్న రోహన్ ఉలిక్కిపడ్డాడు. టీవీలో భయంకర మైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘోర భూకంపం నేపాల్ దేశాన్ని కుదిపేసింది. తాను చూసి మురిసిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. చెట్లను కూల్చేసింది. ఆ దేశపు అందాన్నే తుడిచి పెట్టేసింది. చాలా బాధేసింది రోహన్‌కి. ఆ దేశం అలా అయిపోవడాన్ని భరించలేక పోయాడు. అతనిని అన్నిటికంటే బాధిం చింది ఇంకోటింది... ఇళ్లు కూలిపోవడంతో వేలమంది ప్రజలు రోడ్ల మీద పడు కున్నారు. వాళ్లను చూసి రోహన్ మనసు అదోలా అయిపోయింది. తనకెంతో ఇష్టమైన దేశానికి, ఆ దేశ ప్రజలకి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఏం చేయగలనా అని పరిపరి విధాల ఆలోచించాడు. చివరికి ఓ మార్గం కనిపెట్టాడు. సాయపడాలి అనుకున్నదే తడవుగా ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాడు రోహన్. అయితే అది తేలిక కాదని అర్థమైంది తనకి. ఎవరూ అడిగిన వెంటనే ఇచ్చేయడం లేదు. కొందరు ఇచ్చినా ఏదో కాస్త ఇస్తున్నారు. దాంతో తాను ఏం చేయ గలడు! ఎంతని చేయగలడు! అందుకే ఓ ప్లాన్ వేశాడు. నేపాల్ అందాలను చక్కని స్కెచ్‌లుగా గీశాడు. వాటితో అందమైన పుస్తకాల్ని రూపొందించాడు. వాటిని తీసుకెళ్లి అందరికీ చూపించసాగాడు. అలా ఉండే దేశం ఇలా అయిపోయింది అంటూ భూకంపం తర్వాత పరిస్థితులను కళ్లకు కట్టే ఫొటోలను కూడా చూపించసాగాడు. దాంతో చాలామంది మనసులు కది లాయి. విరాళాలు ఇవ్వడానికి ముందు కొచ్చారు. అలాగే తాను వేసిన స్కెచ్లను ఫ్రేములు కట్టించి, పుస్తకాలుగా ముద్రించి అమ్మడం ద్వారా కూడా చాలా సొమ్మును సేకరించాడు. డబ్బు చేతికొచ్చింది. కానీ దానితో ఏం చేయాలి? ఆహారం కొని పంచి పెట్టాలా? లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చే యాలా? ఆలోచించాడు రోహన్. ఆహారం పంచిపెడితే ఒక్కసారో, రెండుసార్లో చేయడంతో సరిపోతుంది. ప్రభుత్వానికి ఇస్తే అది సద్వినియోగం అవుతుందో లేదో తెలీదు. కాబట్టి ఏదైనా శాశ్వత సహాయం నేపాలీయులకు అందేలా చేయాలి. అదే రోహన్ తపన. ఆ తపన అతనిలోని ఆర్కిటెక్ట్ బుర్రని తట్టి లేపింది. ఆ వెంటనే అతి తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించే విధానాన్ని కనిపెట్టాడు రోహన్. వెంటనే తన స్నేహితులు కొందర్ని తీసుకుని నేపాల్ బయలుదేరాడు. లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు దాన్ని సాధించడంలో ఓటమి ఉండదంటారు. రోహన్ విషయంలో అది నిజమయ్యింది. తన ప్రణాళికలను నేపాల్ ప్రభుత్వం ముందు ఉంచాడు రోహన్. స్థానికంగా దొరికే మెటీరియల్‌తో, అతి తక్కువ ఖర్చుతో ఇండ్లు ఎలా నిర్మించవచ్చో అతడు చెబుతుంటే అధికారులు ఆశ్చర్యంగా విన్నారు. ఆ ఆలోచనను అమలు పర్చడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. దాంతో తాను తీసుకెళ్లిన సొమ్ముతో నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించడం మొదలు పెట్టాడు రోహన్. ఖాట్మండుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పనౌటీ గ్రామంలో చకచకా ఐదు ఇళ్లు కట్టేశాడు. మరో ఐదు ఇళ్లు కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అవి పూర్తవగానే అలాంటి ఇళ్లు మరికొన్ని కడతానని, ఆశ్రయం లేని పరిస్థితి ఎవరికీ లేకుండా చేస్తానని అంటున్నాడు రోహన్. నేను, నాది, నావాళ్లు అంటూ ఆలోచించేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో... ఓ యువకుడు తన సరదాలను, సంతోషాలను పక్కనబెట్టి, దేశం కాని దేశం వెళ్లి, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం సామాన్యమైన విషయం కాదు. అతడి మంచి మనసుకి, సేవానిరతికి అభినందనలు చెప్పి తీరాలి. నేపాల్‌లో రోహన్ కట్టించిన ఇల్లు ఇది. మన దేశంలో కూడా ఎంతోమంది ఆశ్రయం లేక అలమటిస్తున్నారు. వాళ్లందరికీ కూడా తన ప్రణాళికల ప్రకారం ఇళ్లు కట్టిస్తే బాగుంటుందని, ఖర్చు చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలనీ అంటున్నాడు తను. -
పొదుపు పాఠాలు.. నేర్పండిలా!
వెంకట్, సౌమ్య భార్యాభర్తలు. ఉండేది బెంగళూరులో. రాహుల్ వారికి ఒక్కగానొక్క కొడుకు. టీనేజ్‌లోకి వచ్చాడు. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం అలవాటైంది. ఇది చూసి తల్లిదండ్రులకు ఆందోళన కూడా ఆరంభమైంది. ఎన్నోసార్లు కూర్చోబెట్టి డబ్బు విలువ గురించి పాఠాలు చెప్పారు. అయినా పలితం లేకపోయింది. ఏం చేయాలి? బాగా ఆలోచించాక వారు ఇక మాటలు ఆపి చేతల్లోనే (ప్రాక్టికల్‌గా) కొడుక్కు పొదుపు పాఠాలు నేర్పించాలనుకున్నారు. ‘‘నీకు ప్రతి నెలా ప్యాకెట్ మనీగా రూ.2,000 ఇస్తున్నాం. కాబట్టి నీ పుట్టినరోజుకు ప్రత్యేకంగా డబ్బులివ్వలేం. నువ్వే నీ ప్యాకెట్ మనీ కొంత మిగుల్చుకుని బర్త్‌డే పార్టీ చేసుకోవాలి’’ అని చెప్పేశారు. ఎప్పుడూ ఏమీ చెప్పని అమ్మానాన్నా ఇలా చెప్పటంతో రాహుల్ కూడా విన్నాడు. దీంతో పుట్టినరోజు పార్టీకి డబ్బు కూడబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై పడింది. అప్పటికి ఇంకా పుట్టినరోజు 11 నెలలు ఉండటంతో... బర్త్‌డే పార్టీకి డబ్బు కూడబెట్టడం ఆరంభించాడు రాహుల్. బర్త్‌డేకి రూ.12 వేలు కావాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి... 11 నెలల పాటు నెలకు రూ.1,100 దాచుకోవటం మొదలుపెట్టాడు. ప్యాకెట్ మనీలో రూ.900 మాత్రమే ఖర్చుచేయడం ఆరంభించారు. 11 నెలలు గడిచేసరికి ముందుగా నిర్ణయించుకున్న రూ.12 వేల కన్నా 100 రూపాయలు ఎక్కువే సమకూరింది. అనుకున్న మొత్తం సిద్ధమైపోయింది. ఎంతో సంతోషం. అయితే అప్పటికే 11 నెలల నుంచి పొదుపు అలవాటవటంతో... పుట్టినరోజు బడ్జెట్‌ను కూడా రాహుల్ తగ్గించేసుకున్నాడు. కాస్త తక్కువ ఖరీదుండే రెస్టారెంట్‌కి వేదిక మార్చాడు. అనవసరమైన ఖర్చులు మానేశాడు. దీంతో బర్త్‌డే పార్టీ ఖర్చు కూడా రూ.12,000 నుంచి రూ.8,000కు తగ్గిపోయింది. దాంతో ఒకేసారి రూ.4 వేలు మిగిలింది. అంత డబ్బు మిగలటం రాహుల్‌కు విపరీతమైన ఉత్సాహాన్నిచ్చింది. ఇదే పరిణామం రాహుల్‌కు ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక కూడా నేర్పించింది. అదీ కథ. నగదు నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. అయితే ఇవన్నీ తల్లిదండ్రులే నేర్పాలి తప్ప స్కూళ్లలో నేర్పేవి కావు. మరి ఇవన్నీ నేర్పడానికి తల్లిదండ్రులేమైనా ఫైనాన్షియల్ ఇంజనీర్లో లేక వారెన్ బఫెట్ అంతటి ఇన్వెస్ట్మెంట్ గురులో కావాలి? అలాంటిదేమీ అక్కర్లేదు. జీవితంలో తమకెదురైన అనుభవాల్నే పాఠాలుగా మార్చాలి. పిల్లలకు అర్థమయ్యేట్టు చూడాలి. ఆర్థికపరమైన నడవడిక, నిర్ణయాలు జీవితంలో ఎంత ముఖ్యమో వారికి తెలిసేలా చేయాలి. నెలవారీ బడ్జెట్ నుంచి పెట్టుబడుల వరకూ... అక్కడి నుంచి లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన మనీ మేనేజిమెంట్‌ను పిల్లలకు వివరించాలి. అప్పుడే వారికి డబ్బు విలువ తెలుస్తుంది. ‘టీన్’లో ఉన్నప్పుడు ఆరంభించే ఆర్థిక పాఠాలు... వారిని ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేస్తాయి. ఎలా ప్రారంభించాలి... పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచే... రోజుకు కొన్ని పైసలు ఇచ్చి వాటిని ‘డిబ్బీ’లో దాచుకునేలా చేయాలి. వారి అవసరానికి ఆ ‘డిబ్బీ’ నుంచే డబ్బు తీసుకుని ఖర్చు చేసుకునేలా ఒక పద్ధతి నేర్పాలి. టీనేజ్‌లోకి ప్రవేశించే సరికి వారి పుట్టినరోజు పండుగకు ఆర్థిక ప్రణాళిక, డబ్బు సమీకరణ వంటి అంశాల విషయంలో వారే ఒక అవగాహనకు వచ్చేలాంటి పాఠాలు నేర్పాలి. నిజానికిపుడు పొదుపుల పాఠాలు నేర్పడం చాలా తేలికయింది. ఇందుకోసం ఎన్నో పాఠాలు, ఎక్సర్సైజులు పుట్టుకొచ్చాయి. అయితే వాటిని నేర్చుకునే దిశగా పిల్లల్ని నడిపించాల్సింది తల్లిదండ్రులే. క్రెడిట్ కార్డుల బదులు వారిచేత నేరుగా కరెన్సీనే ఖర్చుపెట్టించటం, పిల్లలను తమతోపాటు బ్యాంక్‌కు తీసుకువెళ్లి ఆర్థిక అంశాలకు సంబంధించి చిన్న చిన్న అంశాలను నేర్పించడం, డబ్బు పొదుపు పద్ధతులను నేర్పే ఆటలను పిల్లల చేత ఆడించడం వంటివి చేయాల్సింది తల్లిదండ్రులే. అవే ఇక్కడ ముఖ్యం. -
పాకెట్ మనీకి నిశ్‘చింత’!
వేసవి సెలవులిచ్చారు. గిరి బాలలు బడుల నుంచి ఇళ్లకు చేరారు. ఇంటి వద్ద ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చిరుతిళ్లు, అవసరమైన వస్తువులు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి పాకెట్ మనీ కావాలి. తల్లిదండ్రులను అడిగేకంటే వాటిని తామే సంపాదించుకుంటే ఎలా ఉంటుందని చక్కని ఆలోచన చేశారు. చింతచిగురు సేకరించి అమ్మితే పాకెట్‌మనీకి ఇబ్బంది ఉండదని యోచించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఉదయాన్నే నిద్రలేచి గ్రామాల్లోని చింతచెట్లు ఎక్కి లేత చింతచిగురు కోస్తున్నారు. దానిని సంచిలో వేసుకుని మండలకేంద్రానికి వచ్చి అక్కడి మెయిన్‌రోడ్ సెంటర్లో కుప్పలుగా పోసి ఒక్కో కుప్పను రూ.పదికి విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ ఒక్కొక్కరూ రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు సంపాదిస్తున్నారు. వాటిని తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొందరు చింతచిగురుతోపాటు ముంజుకళ్లు కూడా సేకరించి విక్రయిస్తున్నారు. చిన్నారులు విక్రయించే చింతచిగురు ఎంతో లేతగా వుంటుందని, దీనిని పప్పు, మటన్, బోటీలో వేసుకుని వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. - చింతూరు -
లోటు పాట్లు
బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థమే చాలా మందికి. రూపాయి రాక.. రూపాయి పోక.. హౌస్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ వినే పదాలే గానీ... వస్తే ఎవరికి లాభం... పోతే ఎవరికి నష్టం! ఇంటి ఆదాయ వ్యయాల లెక్కలు తేలక బిజీ లైఫ్‌లో కొట్టుకుపోయే సగటు జీవికి బడ్జెట్‌వల్ల వచ్చేదెంత! పోయేదెంత! ఇవన్నీ బేరీజు వేసుకుంటే తికమకలే తప్ప కన్‌క్లూజన్‌కు వచ్చేదెంతమంది! మరి నేటి విద్యార్థులే రేపటి ఆర్థిక వ్యవస్థకు పునాదులైతే... వారిలో దీనిపై ఉన్న నాలెడ్జ్ ఎంత! ఆసక్తి ఎంత! ఏఎస్‌రావునగర్ ‘అనీష్ కాలేజీ ఆఫ్ కామర్స్’ విద్యార్థులను ఇదే ప్రశ్న వేసింది ‘సిటీ ప్లస్’. అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో కాలేజీకి వచ్చి... కాసిన్ని పాఠాలు వినేసి... ఆపై చిట్‘చాట్’లు, మూవీ మస్తీలతో సాగిపోయే లైఫ్‌లో ‘ఈ బడ్జెట్ ఏంట్రా బాబూ’ అంటారా..! చూద్దాం... వారి థాట్స్.. ఎక్స్ప్లనేషన్స్ ఏంటో! లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్! అఖిల్: బడ్జెట్ గురించి చాలామంది విద్యార్థులకు అవగాహన లేదు. ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్‌కి మనకి సంబంధం ఏంటనుకుంటారు. అనూష: నిజానికి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకే ఎక్కువ. రామ్: ఈసారి బడ్జెట్ ఎడ్యుకేషన్‌కి సపోర్ట్‌గా ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలనుకుంటే ఆల్కహాల్, సిగరెట్ల ధరలను బాగా పెంచాలి. అజయ్: ఎంత పెంచినా వాటిని కొనేవారు కొంటూనే ఉంటారు కదా! ప్రియాంక: నిజానికి బడ్జెట్‌ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలు కాదు... మనమే. మన ఇంట్లో బడ్జెట్‌ని చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే చాలు. దానికి ముందు మన ఇంట్లో బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. అజయ్: కానీ ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు... పిల్లలకు ఇంటి బడ్జెట్ల గురించి చెప్పరు. లక్ష్మీప్రియాంక: తల్లిదండ్రులు చెబితేనే గానీ తెలుసుకోలేని వయసుకాదు కదా మనది. ఇప్పటికే దాదాపుగా అన్నీ తెలిసి ఉండాలి. రామ్: లేదు... తల్లిదండ్రులు చెబితేనే అప్పు ఎంతో, ఆదాయం ఎంతో తెలుస్తుంది. సుప్రియ: ఎంత చెప్పినా అబ్బాయిలు తమ ఖర్చుని తగ్గించుకోరు. వర్ష: అవును... ఇంటి బడ్జెట్ గురించి తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా అమ్మాయిలు అర్థం చేసుకుని మసులుకుంటారు. వెంకట్: అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రామ్: అబ్బాయిలు ఖర్చు చేసేది మాత్రం ఎవరి కోసం! (నవ్వుతూ) అనూష: ఎవరు ఖర్చు చేయమన్నారు? ఇంటి స్థోమతని బట్టి మన బడ్జెట్‌ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అమ్మానాన్నల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి. అర్జున్: ఎంత తగ్గించుకున్నా... జేబులో 500 రూపాయలు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు. బైక్ మెయింటెనెన్స్, సెల్‌ఫోన్ బిల్, మధ్యాహ్నం భోజనం, మధ్యమధ్యలో ఫ్రెండ్స్ బర్త్‌డేలు... ప్రియాంక: అదే అమ్మాయిలు బయటికి రావాలంటే బ్యాగులో యాభై రూపాయలుంటే చాలు. రామ్: అందరూ ఒకేలా ఉండరు కదా! బాగా ఖర్చుపెట్టే అమ్మాయిలూ ఉన్నారు. కౌండిన్య: ముందు ఇంటి ఖర్చుల గురించి అవగాహన వస్తే మనమెలా ఉండాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలతో ఫైనాన్స్ విషయాలన్నీ డిస్కస్ చేయాలి. లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల గురించి ఓపెన్ స్టేట్మెంట్లు, కామెంట్లు ఎలా ఇస్తామో ఇంటి బడ్జెట్ గురించి కూడా అంతే తేలిగ్గా మాట్లాడేస్తాం. అనూష: మనమిప్పుడు డిగ్రీ చదువుతున్నాం. ఇంకా తల్లిదండ్రులు కూర్చోబెట్టి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాలని కోరుకోకూడదు. మనమే అడిగి తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అమ్మానాన్నల అనుభవాల మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. సుప్రియ: ఎన్ని చెప్పినా ఇంటి బడ్జెట్ గురించి తెలియని పిల్లలు మన దగ్గర డెబ్బైశాతంమంది ఉన్నారు. వెంకట్: మనం కూడా కష్టపడి సంపాదించిన రోజు బడ్జెట్ ఏంటో బాగా అర్థమవుతుంది. బాసిర్బేగం: ఇట్స్ ట్రూ. నేను పార్ట్‌టైం జాబ్ చేసుకుంటున్నాను. సంపాదన విలువ తెలిసింది. ఖర్చు చేసేముందు భయం వేస్తుంది. ఆ భయం అంతకు ముందు తెలియలేదు. కౌండిన్య: ఎందుకు అమ్మానాన్నలు పడే ఇబ్బందుల్ని మనం బాగా దగ్గరగా చూసిన రోజున కూడా అలాంటి భయం కలుగుతుంది. అయితే మన కష్టాన్ని ఖర్చు చేసే రోజున ఇంకా బాగా తెలుస్తుంది. ప్రతిమ: ఏది ఏమైనా మన ఇంటి బడ్జెట్ అయినా, దేశం బడ్జెట్ అయినా మనకు సంబంధించే కాబట్టి... ఖర్చు పెట్టే ముందు ఓ క్షణం తప్పకుండా ఆలోచించాలి. ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలు చేయాలి. ఖర్చును తగ్గించుకునే ప్లాన్స్ వేసుకోవాలి. ... భువన ఫొటోలు: జి.రాజేష్ -
ఆ అవగాహన వస్తుంది ఇలా...
మాకు ఎనిమిది, పది సంవత్సరాల పిల్లలున్నారు. వాళ్లకు పొదుపు చేయడం నేర్పించాలనుకుంటున్నాను. మంచి సలహా ఇవ్వగలరు. - రాగిణి, గుంటూరు ఇప్పటినుంచే పిల్లలకు పొదుపు, పెట్టుబడిని అలవాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇందు కోసం కొన్ని ఐడియాలు...{పతి నెల వారికి కొంత పాకెట్ మనీ ఇవ్వండి. అలాగే ఒకటి పొదుపు కోసం, మరొకటి ఖర్చుల కోసం అంటూ రెండు డిబ్బీలు ఏర్పాటు చేయండి. పాకెట్ మనీ అయినా, ఇతరత్రా గిఫ్ట్ రూపంలో డబ్బులు వచ్చినా వాటిల్లో వేసేట్లు అలవాటు చేయండి. ముందు పొదుపు కోసం అంటూ ఇంత మొత్తం అని కేటాయించి, మిగతాదే ఖర్చుల డిబ్బీలో వేసేలా నేర్పండి. ఊరికే పొదుపు చేయడం అని కాకుండా సైకిల్, ఐప్యాండ్ లాంటివి ఏదో ఒకటి సమకూర్చుకునేలా దానికి ఒక లక్ష్యం అంటూ నిర్దేశించండి. {పస్తుతం బ్యాంకులు పిల్లల కోసం కూడా ఖాతాలు అందిస్తున్నాయి. కాబట్టి పిల్లల పేరిట అకౌంటు తెరిచి, రెగ్యులర్‌గా ప్రతి నెలా అందులో ఎంతో కొంత డిపాజిట్ చేసేలా ప్రోత్సహించవచ్చు. డిబ్బీలో దాచిపెట్టుకోవడం, బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం మధ్య తేడాలను, ప్రయోజనాలను వారికి వివరించండి. మరోవైపు, చిన్నతనం నుంచే పొదుపు, పెట్టుబడులు చేయడం వల్ల చక్రవడ్డీ మహిమతో అధిక ప్రయోజనం ఎలా పొందవచ్చన్నది తెలిసేలా చెప్పండి. ఇవే కాకుండా, ప్రతి నెలా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు మీ పిల్లలను కూడా వెంట తీసుకెళ్లండి. వివిధ ఉత్పత్తుల ధరల గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. దీనివల్ల రేట్ల పెరుగుదల, తగ్గుదల గురించి వారికి కూడా తెలుస్తుంది. - రజనీ భీమవరపు, సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
ఇంటి కోసం పొదుపు..
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ డెరైక్టర్ మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ (21) .. లుక్స్, యాక్టింగ్ నైపుణ్యాలపరంగా బాలీవుడ్లో బోలెడంత పేరు తెచ్చుకుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించిన ఆలియా.. ప్రతి సినిమాకు రూ. 2-5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని పరిశ్రమలో టాక్. సిల్వర్ స్పూన్‌తో పుట్టినప్పటికీ ఆలియా భట్ డబ్బు విషయంలో ఆచి తూచే వ్యవహరిస్తుందట. బడ్జెట్‌కు లోబడే ఖర్చు చేస్తుంది. తాను పాటించే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు తన మాటల్లోనే.. ‘నా పాకెట్ మనీ రూ. 500తో మొదలైంది. నేను, మా అక్క జాగ్రత్తగా ఖర్చు చేయడాన్ని బట్టి పాకెట్ మనీ పెరిగేది. ఇంటర్లో ఉన్నప్పుడు నెలకు రూ. 4,000కు చేరింది. రెండేళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మొట్టమొదటిసారిగా రూ. 2.5 లక్షల చెక్ అందుకున్నాను. మేం ఏదైనా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటే మా సంపాదనతోనే కొనుక్కోమంటారు మా పేరెంట్స్. నా పారితోషికంతో ఖరీదైన ప్రాదా బ్యాగ్ కొందామనుకున్నాను. కానీ, అంతలోనే డబ్బు విషయంలో బాధ్యతగా ఉండాలన్నది గుర్తొచ్చింది. దీంతో, ఆ డబ్బు అలా బ్యాంకులోనే ఉంచేశాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే డెబిట్ కార్డు చేతికొచ్చింది. ఈ ఏడాదే నా ఇరవై ఒకటో పుట్టినరోజు నాడు మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు వచ్చింది. రోజువారీ చేసే ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నది ఇవి నేర్పాయి. ఖర్చుల విషయానికొస్తే.. నా బిల్స్ అన్నీ మా అమ్మే కడుతుంది. కానీ వాటికి సంబంధించిన చెక్కులపై నేనే సంతకం చేస్తాను కాబట్టి అన్ని ఖర్చుల గురించీ నాకు తెలుసు. అంతే కాదు నేను ఎంత ఇన్‌కం ట్యాక్స్ కట్టేదీ నాకు తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకు ఆసక్తి ఎక్కువే. ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల గురించి తెలుసుకుంటుంటాను. ఇల్లు కొనుక్కోవాలన్నది నా ఆలోచన. దీనికోసమే నేను పొదుపు చేస్తున్నాను. అఫ్కోర్స్ కారు కూడా కొనుక్కోవాలని ఉంది. అయితే, మూడు నెలలకోసారి మనసు మారిపోతుంటోంది కనుక.. ఏది కొంటానో చూడాలి’. -
సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ
లక్నో: అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ పిన్ని నుంచి పాకెట్ మనీ తీసుకుంటారట. చిన్నతనం నుంచి నేటి వరకు అఖిలేష్ ఖర్చుల కోసం పిన్ని డబ్బులు ఇస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ కొడుకైన అఖిలేష్ ఇటీవల 42 వ ఏట అడుగుపెట్టారు. అఖిలేష్ చిన్నతనంలో తల్లి మరణించడంతో బాబాయ్ శివపాల్ యాదవ్ దగ్గర పెరిగారు. అఖిలేష్ పిన్ని అయిన శివపాల్ భార్య అతణ్ని సొంత కొడుకులా పెంచారు. వివిధ ప్రాంతాల్లో అఖిలేష్ విద్యాభ్యాసం కొనసాగింది. పెళ్లి చేసుకుని తండ్రి అయ్యారు. ములయాం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అఖిలేష్ పిన్ని మాత్రం ఇప్పటికి ఆయనకు పాకెట్ మనీ ఇస్తూ తల్లిలా ఆదరిస్తారట. -
పాకెట్ మనీతో చెబితేనే పేమెంట్ విలువ తెలిసేది
కల్యాణ్‌కు ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తవుతుండగానే... క్యాంపస్‌లోనే ఓ బహుళజాతి సంస్థ తనను సెలక్ట్ చేసుకుంది. ఆరంభంలో నెలకు రూ.25 వేల జీతం. రెండేళ్లు తిరిగేసరికల్లా జీతం రూ.50 వేలు దాటిపోయింది. ఐదేళ్లు తిరిగేసరికి ఇంట్లో వాళ్లు పెళ్లి కూడా కుదిర్చేశారు. ‘‘పెళ్లయ్యాక ఇంట్లో చక్కని సామగ్రి, హనీమూన్ ట్రిప్... అన్నిటికీ నీ సేవింగ్స్ పనికొస్తాయిరా’’ అన్నాడు కల్యాణ్ తండ్రి. తెల్లమొహం వేశాడు కల్యాణ్. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచీ పైసా దాస్తే ఒట్టు. జీతం పెరిగితే ఖర్చులూ పెరిగాయి. అంతెందుకు! చదువుకునేటపుడు సైతం పాకెట్ మనీ అయిపోయి మళ్లీ మళ్లీ ఇంట్లోవాళ్లనే అడిగేవాడు కల్యాణ్. ఇదంతా ఎందుకంటే... చిన్నప్పటి నుంచే కళ్యాణ్‌కు పొదుపు చేయటం అనే అలవాటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పటానికే. అది అలవాటు కావాలంటే నేర్పించాల్సింది తల్లిదండ్రులే. అదెలాగో ఈ వారం చూద్దాం... పాత సలహానే అనిపించినా.. ముందుగా పిల్లలకంటూ పిగ్గీ బ్యాంక్ లాంటిది ఒకటి అలవాటు చేయండి. దాని ప్రయోజనాలేంటో వివరించండి. వాళ్లేదైనా మంచి పని చేస్తే చిన్నపాటి పారితోషికం ఇవ్వడంతో పాటు దాన్ని వారు దాచుకునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పొదుపు చేయడం అన్నది చిన్నతనంలోనే అలవాటవుతుంది. పిల్లలకు ప్రతి నెలా పాకెట్ మనీ లాంటిది ఇచ్చినప్పుడు అది మొత్తం ఖర్చు చేసేయకుండా.. కొంతైనా దాచుకునేలా ప్రోత్సహించండి. అలా జమ చేసిన డబ్బుతో వారికి నచ్చినవి కొని గిఫ్టుగా ఇవ్వండి. కొంత కొంతగా పొదుపు చేసిన డబ్బుతో పెద్ద అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో దీని వల్ల వారికి తెలియజేయొచ్చు. వస్తువులు కొనుక్కురావడం వంటి డబ్బుతో ముడిపడి ఉన్న చిన్న చిన్న పనుల్ని అప్పుడప్పుడు వారికి పురమాయించండి. మొదట్లో తప్పులు చేయొచ్చు. కానీ ఓర్పుగా వివరిస్తే వారు ఆర్థిక లావాదేవీల గురించి త్వరగానే తెలుసుకుంటారు. అప్పుడప్పుడు బ్యాంకులకూ, ఏటీఎంలకూ వెంట తీసుకెళ్లండి. చెక్కులు వేయడం, డబ్బు డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం లాంటి లావాదేవీల గురించి వారు తెలుసుకునే వీలుంటుంది. వీలయితే పిల్లల పేరుతో బ్యాంకు అకౌంటు కూడా తెరవచ్చు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి కిడ్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. కిడ్స్ ఖాతా తెరవాలంటే... పద్దెనిమిదేళ్ల దాకా వయసుండే పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. సేవింగ్స్ ఖాతా తరహాలోనే ఈ అకౌంట్లకు కూడా అన్ని సదుపాయాలూ ఉంటాయి. డెబిట్ కార్డు, పాస్ బుక్ లాంటి వాటితో పాటు కొన్ని బ్యాంకులు మైనర్ల కోసం చెక్ బుక్‌లు కూడా ఇస్తున్నాయి. ఖాతా తెరిచేందుకు వయసు, చిరునామాతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లలకు మధ్య బంధాన్ని తెలియజేసే పత్రాలు, మైనర్ ఫోటో కావాల్సి ఉంటుంది. .. కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బీమా కవరేజి కూడా ఇస్తున్నాయి. పేరెంట్స్‌కి ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో బీమా సొమ్ము పిల్లలకు అందుతుంది. మిగతా ఖాతాల్లానే కిడ్స్ అకౌంట్లలోనూ కనీస బ్యాలెన్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏమేం ఖాతాలున్నాయంటే... ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ 1 రోజు నుంచి 18 ఏళ్ల దాకా వయసున్న వారికి సగటున కనీస బ్యాలెన్స్ రూ. 2,500 ఉండాలి. పర్సనలైజ్డ్ చెక్ బుక్, ఉచిత డెబిట్ కార్డు రోజువారీ రూ.5,000 వ్యయం లేదా విత్‌డ్రాయల్ పేరెంట్స్‌కి ఐసీఐసీఐలో ఖాతా తప్పనిసరి. హెచ్డీఎఫ్సీ కిడ్స్ అడ్వాంటేజీ ఖాతాలో రూ. 35,000 దాటాక.. ఎఫ్డీ కింద ఆటోమేటిక్‌గా మార్చుకునే మనీ మ్యాగ్జిమైజర్ సదుపాయం. ఈ ఖాతా నుంచి పిల్లల పేరిట సిప్‌తో ఫండ్స్‌లోకి మళ్లించవచ్చు కూడా. తల్లిదండ్రులకు ఏదైనా జరిగిన పక్షంలో పిల్లల చదువుకు రూ.1,00,000 ఉచిత విద్యా బీమా. ఆంధ్రా ఏబీ కిడ్డీ 18 ఏళ్ల దాకా వయసున్న వారికోసం పొదుపు అలవాటును పెంచేందుకు ఖాతా తెరిచే సమయంలో పిల్లలకు ఉచితంగా ఒక బొమ్మ కిడ్డీ బ్యాంకును అందిస్తోంది. పిల్లలు దీన్లో డబ్బులు దాచుకోవచ్చు. దీనికి ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది. ఖాతా ఉన్న శాఖలోనే ఈ లాక్‌ని తీయడానికి వీలవుతుంది. కనీస బ్యాలెన్స్ రూ. 100. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ 12 ఏళ్లకు లోబడి ఉంటే తల్లిదండ్రులు లేదా గార్డియన్ల పేరిట చెక్ బుక్, ఏటీఎం కార్డు మెట్రో నగరాల్లో కనీస త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 2,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000. 6 నెలలకు రూ.25,000 ఎఫ్డీ, రూ.2,000 ఆర్డీ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్‌లో సడలింపు 12 ఏళ్లు పైబడిన పిల్లలైతే.. వారు కోరుకున్న బొమ్మను డెబిట్ కార్డుపై ముద్రించి ఇస్తారు