కట్నపు కోరలకు మహిళ బలి
ఆదోని టౌన్ : అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడంతో భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆస్పరి మండలం ములుగుందంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి ఎస్‌ఐ రమేష్ బాబు, బాధతురాలి తండ్రి తిక్కయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ముద్ద రంగయ్యతో బైలుప్పలకు చెందిన లక్ష్మికి పదేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇటీవల భర్త, అత్త ఈరమ్మ లక్ష్మిని అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీకంగా వేధించేవారు. లక్ష్మిపై భర్త దాడి చేయడంతో పుట్టింటికి వెళ్లింది. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపారు. మళ్లీ వేధింపులు మొదలవడంతో తీవ్రమనస్థాపానికి గురైంది.S ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త, కుటుంబ సభ్యులు ఆదోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి ఎస్‌ఐ తెలిపారు.