
అత్తగారి కండిషన్స్
గుణవధు
కాబోయే అత్తగారొకరు తమ కుటుంబంలోకి కోడలుగా రావలసిన అమ్మాయికి ఉండాల్సిన గుణగణాలను ఏకరువు పెడుతూ, వ్యంగ్యంగా సాగే వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. 12 అంతర్జాతీయ అవార్డులతో 2012లో సంచలనం సృష్టించిన కార్లే రే జెప్సన్ ఆల్బమ్ ‘కిస్’లోని ‘కాల్ మీ మేబీ’ పాటకు పేరడీగా మద్రాసు ఐ.ఐ.టి. విద్యార్థులు.. ‘బీ అవర్ పొండాట్టి’ పేరుతో ఈ వీడియోను రూపొందించారు.
ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావలసిన వధువు లోని లక్షణాల కోసం పెద్ద చిట్టానే విప్పింది.