
కూతురునిచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై దాడి
నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాలపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. తన కూమార్తెను ఇచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. దీంతో మేనల్లుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని మేనత్తను గత కొంత కాలంగా ఆమె మేనల్లుడు కొరుతున్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతేకాకుండా కుమార్తెకు ....ఆమె వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. ఆ విషయం తెలుకున్న మేనల్లుడు గురువారం ఉదయం మేనత్త ఇంటికి వెళ్లి కత్తిలో దాడి చేశాడు.