అత్త కాదు యమదూత
- కొడుకుల కోరిక తీర్చలేదని కోడల్ని కడతేర్చింది
- పోస్టుమార్టం నివేదికతో వీడిన నవవధువు మేఘన మృతి మిస్టరీ
- అత్త సహా భర్త, బావ అరెస్టు
పెందుర్తి : అమ్మలా చూసుకోవలసిన అత్త కోడలిని అంతమొందించింది. కన్న కొడుకుల వాంఛ తీర్చలేదని, అదనపు కట్నం తేలేదని పెళ్ళైన నెల రోజులకే అంతమొందించింది. వేపగుంట సింహపురి లేఅవుట్‌కు చెందిన కాండ్రేగుల మేఘావతి (మేఘన) (28) మృతిపై నెలకొన్న మిస్టరీ వీడింది. అత్త రత్నమే మేఘనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రత్నంతో పాటు మేఘన భర్త సురేష్‌కుమార్, గణేష్‌లను పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను నార్త్ ఏసీపీ సీఎమ్ నాయుడు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఇలా అంతమొందించింది : ఖరగ్‌పూర్‌కు (ప్రస్తుతం అల్లిపురంలో నివాసం) చెందిన శరగడం శంకర్రావుకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మేఘనను సింహపురి లేఅవుట్‌కు చెందిన డాక్‌యార్డు ఉద్యోగి (కాంట్రాక్ట్) కాండ్రేగుల సురేష్‌కుమార్‌కు ఇచ్చి గత మే 11న వివాహం జరిపించారు. కట్నం రూ.2 లక్షలు, రూ.50 వేల లాంఛనాలు, 20 తులాల బంగారం ఇచ్చారు.
సురేష్‌కుమార్ సంసారానికి పనికిరాడు. దీన్ని అదనుగా చూసుకున్న బావ గణేష్ కోరిక తీర్చమని మేఘనను వేధించడం మొదలుపెట్టాడు. గణేష్ తల్లి రత్నం కూడా పెద్దకుమారుడికి వత్తాసు పలికింది. దీంతోపాటు పెళ్ళి సమయంలో ఇచ్చిన కట్నం చాల్లేదని అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించసాగింది.
ఈ రెండు ప్రతిపాదనలు మేఘన ఒప్పుకోకపోవడంతో రత్నం కోడలిపై పగబట్టింది. తరచూ ఆమెతో అత్త, భర్త, బావ ఘర్షణపడేవారు. 15న ఉదయం పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్న మేఘన వద్దకు వచ్చిన అత్త రత్నం వివాదానికి దిగింది. ఆ సమయంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇంట్లో పరిస్థితుల కారణంగా తిండి మానేసిన మేఘన నీరసంతో మంచంపై పడిపోయింది.
వెంటనే రత్నం సమీపంలో ఉన్న కర్రచెక్కతో మేఘన తలపై బలంగా మోదింది. దీంతో స్పృహ తప్పిన మేఘన మెడకు నైలాన్ తాడు బిగించింది. అపస్మారక స్థితిలో ఉన్న మేఘనను ఏమీ తెలియనట్లు స్థానికుల సహాయంతో నగరంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మేఘన ఈ నెల 18న ప్రాణాలు వదిలింది. తన కుమార్తె మృతికి అత్తింటివారే కారణమని తండ్రి శంకర్రావు అదే రోజు ఫిర్యాదు చేశారు.
పట్టించిన పోస్టుమార్టం నివేదిక
మేఘన మృతి మిస్టరీని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఛేదించినట్లు ఏసీపీ తెలి పారు. మేఘన తల నుదురు, వెనుక భాగా ల్లో తీవ్రమైన గాయాలున్నాయి. మెడకు తాడు బిగించిన ఆధారాలున్నాయి. దీంతోపాటు ఘటన జరిగిన సమయంలో పెనుగులాటలో మేఘన చేతి గోళ్ళు రత్నం చేతికి గుచ్చుకున్నాయి. మేఘన మంగళసూత్రాలు తెగిపోయాయి. వాటిని గోపాలపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రత్నం తాక ట్టు పెట్టింది.
ఈ ఆధారాల ప్రకారం దర్యా ప్తు చేసిన పోలీసులు వారంతో రోజుల్లో కేసును ఛేదించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో మేఘన అత్తతో పాటు భర్త సురేష్‌కుమార్, బావ గణేష్‌లను అరె స్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. హత్యకు వినియోగించిన చెక్క, నైలాన్ తాడు, మేఘన మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి, ఎస్‌ఐ బి.సురేష్, పీసీలు ఎల్.శివప్రసాద్, ఎమ్.నారాయణరావు, శ్రీను, లీలావతి, రామలక్ష్మి పాల్గొన్నారు.