
సింహం అతుల్ (18)
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం అతుల్ (18) వృద్ధాప్యం, గాయాల కారణంగా గురువారం మృతి చెందింది. జూ అధికారులు తెలిపిన మేరకు.. వృద్ధాప్యంతో బాధపడుతున్న సింహం వారం రోజుల నుంచి జూ వైద్యుల పర్యవేక్షణలో చి కిత్స పొందుతోంది. అతుల్‌ను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, అలీపూర్, కలకత్తా, డబ్ల్యూబీ నేషనల్ పార్కు అధికారులు కృషి చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం సింహానికి జూపార్కులో పోస్టుమార్టం నిర్వహించారు. అభయారణ్యాల్లో సింహాలు 15 ఏళ్ల వరకే జీవిస్తాయని జూపార్కులో మాత్రం అతుల్ 18 ఏళ్లు జీవించిందని అధికారులు తెలిపారు.