nehru zoolagical park
-
పాన్ ఇండియా క్రేజ్.. పులికి ప్రభాస్ పేరు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలె ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్‌లోని నెహ్రు జూలాజికల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్‌కు అధికారులు ప్రభాస్ పేరు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ క్రేజీ న్యూస్ తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. -
ఆ రెండింటిని దత్తత తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ?
Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park: మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఫిట్నెస్, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేస్తుంటారు. తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన కొణిదెల. వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్‌కు అందించారు ఉపాసన. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఉపాసన తెలిపారు. క్యూరేటర్, అతని బృంద సభ్యులను ఆమె అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, వాటి పరిశుభ్రతగా ఉంచడంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఉపాసనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజసేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెది మంచి మనసు అని కొనియాడారు. వన్యప్రాణుల పరిరక్షణపై వారు చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇలా పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీతో ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, ఆశీర్వాదాలు -
మృగరాజుపై కరోనా పంజా
సాక్షి, హైదరాబాద్/ బహదూర్‌పురా: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. భారత్‌లో లక్షల మంది ప్రాణాలు హరించిన కోవిడ్ మహమ్మారి జంతువులకూ సోకడం ఇదే తొలిసారి. గత నెల 24వ తేదీకి ముందు సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటం గమనించిన జూ సిబ్బంది సమాచారాన్ని అధికారులకు తెలిపారు. అప్పటికే జూలోని యానిమల్ కీపర్లకు కరోనా పరీక్షలను నిర్వహించగా.. దాదాపు 25 నుంచి 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జూ అధికారులు సింహాల నోరు, ముక్కు నుంచి ద్రవాలు సేకరించారు. ఆ నమూనాలను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అనుబంధ సంస్థ ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (లాకోన్స్)లో ఈ నమూనాలను విశ్లేషించగా, కోవిడ్–19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సెంటర్ జూ అథారిటీ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏషియాటిక్ సింహాల ముక్కు, నోటిలోని ద్రవాల నమూనాలను సేకరించామని, ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా కరోన బారిన పడినట్లు నిర్ధారించామని సీసీఎంబీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏషియాటిక్ సింహాల్లో కనిపించిన కరోనా వైరస్ అంత ప్రమాదకరమైన రకమేమీ కాదని సీసీఎంబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ సింహాలన్నింటినీ వేరుగా ఉంచామని, తగిన చికిత్స అందిస్తున్నామని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ సుభద్ర దేవి తెలిపారు. తెలంగాణ జంతు సంరక్షణాలయాల డైరెక్టర్ డాక్టర్ కుక్రెటి మాట్లాడుతూ.. కరోన బారిన పడ్డ సింహాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, కోలుకుంటున్నాయని వివరించారు. 5 మగ, 3 ఆడ సింహాలకు.. జూలాజికల్ పార్కులో ఉన్న లయన్ సఫారీలోని ఐదు మగ సింహాలు, మూడు ఆడ సింహాలు కరోనా బారిన పడ్డాయి. గతంలో పులుల ఎన్‌క్లోజర్‌లో పని చేసిన ఓ యానిమల్ కీపర్‌ను సింహాల ఎన్‌క్లోజర్‌కు మార్చారు. గత నెల ఏప్రిల్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆ యానిమల్ కీపర్‌కు పాజిటివ్ వచ్చింది. అతడిని క్వారంటైన్ కు పంపిన కొద్ది రోజులకే సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి.. సింహాలకు అందించిన ఆహారంతోనే కరోనా సోకిందా.. లేదా ఇతర కారణాలతో వచ్చిందా అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే చాలా జంతువులకు కరోనా? గతేడాది కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి పలు జంతు సంరక్షణ కేంద్రాల్లో జంతువులు వ్యాధి బారిన పడినట్లు సమాచారం ఉందని, మనుషుల నుంచి సోకిన ఈ వ్యాధి ఇతర జంతువులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లాకోన్స్ సైంటిస్ట్ ఇన్చార్జి డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ తెలిపారు. ఈ ఆసియా సింహాల్లో వ్యాధి లక్షణాలను గుర్తించడంతో పాటు, నమూనాల సేకరణకు మెరుగైన మార్గాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందని వివరించారు. జంతువులకు నాలుగు కేంద్రాలు.. జంతువుల్లో కరోనా నిర్ధారణకు భారత్ లో మొత్తం నాలుగు కేంద్రాలు ఉండగా.. హైదరాబాద్‌లోని లాకోన్స్ అందులో ఒకటి. ప్రతి జంతువు లాలాజలం సేకరించడం కష్టమైన పని కాబట్టి, జంతువుల మలం ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు తాము ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, తద్వారా బోనుల్లో ఉండే, స్వేచ్ఛగా తిరిగే జంతువుల నమూనాలు సేకరించడం సులువవుతుందని సీసీఎంబీ గౌరవ సలహాదారు, మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. జంతువుల్లో కరోనా వైరస్‌ను సీసీఎంబీ ఇప్పటివరకు గుర్తించలేదని, అయితే త్వరలో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తామని సీసీఎంబీ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు. వాటి నుంచి మనకు సోకదు! ఏషియాటిక్ సింహాలకు సోకిన కరోనా వైరస్ మళ్లీ మనుషులకు సోకే అవకాశం లేదని, మనకు సోకుతుందనేందుకు తగిన ఆధారాలు లేవని సెంట్రల్ జూ అథారిటీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల జంతువులకు ఈ వ్యాధి సోకినప్పటికీ వాటి నుంచి తిరిగి మనుషులకు సోకినట్లు సమాచారం లేదని తెలిపింది. దేశంలోని అన్ని జంతు సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్–19 నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, తగిన మార్గదర్శకాలు కూడా జారీ చేశామని తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. గతేడాది స్పెయిన్ లోని బార్సిలోనాలోని ఓ జూలో సింహాలు, పులులకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ఉన్న జూ పార్కులు, టైగర్ రిజర్వులు, వైల్డ్ లైఫ్ శాంచురీలు మే 2 నుంచి మూత పడిన సంగతి తెలిసిన విషయమే. చదవండి: కరోనా: ఆహారం అందిస్తాం.. అంత్యక్రియలు చేస్తాం.. -
కిరణ్ మరణం
బహదూర్‌పురా: రాయల్ బెంగాల్ వైట్ టైగర్ (కిరణ్– 8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్ కణితితో బాధపడుతూ గురువారం మృతి చెందింది. నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులో పుట్టి పెరిగిన కిరణ్ (టైగర్) కొంతకాలంగా న్యూయో ప్లాస్టిక్ ట్యూమర్‌తో బాధపడుతోంది. దీనికి కొన్నిరోజులుగా ల్యాంకోన్స్ శాస్త్రవేత్తలు, వైద్యులు, జూపార్కు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. గత నెల 29న టైగర్‌కు డాక్టర్ నవీన్, వీబీఆర్ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మృతి చెందిన వైట్ టైగర్‌కు వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. కిరణ్ తండ్రి బద్రి కూడా న్యూయో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ (టైగర్) తాత రుద్ర (టైగర్) 12 ఏళ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. కిరణ్ కూడా న్యూయో ప్లాస్టిక్ వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించారు. జూపార్కుకే వన్నె తెచ్చే రాయల్ బెంగాల్ టైగర్లు ట్యూమర్ వ్యాధితో మృతిచెందుతుడటం ఆందోళనకు గురి చేస్తోంది. -
ఫీల్.. కూల్
ఠారెత్తిస్తున్న ఎండలతో ఇళ్ల నీడన ఉంటున్న మనుషులే తల్లడిల్లుతున్నారు. మరి వేడి సెగలు, వడగాలుల మధ్య తిరుగాడే వన్యప్రాణులు ఇంకెంత విలవిలలాడాలి. నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి మూగజీవాలను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో చర్యలకు ఉపక్రమించారు. జూలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుత పులుల ఎన్‌క్లోజర్ లోపల 50కిపైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను పెట్టారు. బహదూర్‌పురా :సూరీడు సుర్రుమంటున్నాడు.. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి.. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో కాస్త తక్కువగా ఉన్నా.. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో కాస్త రక్షణ పొందారు. గత నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. వేసవి తాపం నుంచి జీవులను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ప్రారంభంలోనే జూలోని వన్య ప్రాణుల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రస్తుతం మరింత శ్రద్ధ పెట్టారు. జంతువులు ఉండే చోట్ల స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్గన్స్లను ఏర్పాటు చేసి నీటిని విరజిమ్ముతున్నారు. పక్షులు ఇతర వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లో ఫాగర్లను ఏర్పాటు చేసి నీటి బిందువులను పొగమంచు వలే విరజిమ్ముతున్నారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైకప్పుపై తుంగ గడ్డిని ఏర్పాటు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులుల ఎన్‌క్లోజర్ లోపల 50పైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వెటర్నరీ వైద్య సిబ్బందితో పర్యవేక్షణ.. వన్యప్రాణులను జూపార్కు వెటర్నరీ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో పుట్టిన వన్యప్రాణుల కూనలపై మరింత శ్రద్ధ తీసుకుంటూ అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని జూపార్కు క్యూరేటర్ క్షితిజ తెలిపారు. ఓపెన్ ఎన్‌క్లోజర్‌లోని ఏనుగులు, తాబేలు, నీటిగుర్రం, ఖడ్గమృగంతో పాటు ఆస్ట్రిచ్ పక్షి ఇతర వన్యప్రాణుల ఎన్క్లోజర్లలో నీటిని నేరుగా వన్యప్రాణులపైకి విరజిమ్ముతున్నట్లు వారు వివరించారు. వేసవి తాపాన్ని తట్టుకునేలా... వేసవిని తట్టుకునేందుకు వన్యప్రాణులకు పుచ్చకాయలు, కర్బూజ వంటివి అందిస్తున్నారు. గ్లూకాన్డీ, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్–సీ, బీ కాంప్లెక్స్ సప్లిమెంట్లను అందిస్తూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నారు. సూర్యకాంతి నేరుగా వన్యప్రాణులపై పడకుండా కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులకు గోనె సంచులను కప్పి వాటిని నీటితో ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. పక్షుల ఎన్క్లోజర్ల పైకప్పులు, చుట్టుపక్కల ఆకుపచ్చని నీడ వలయాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులకు సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. లోపల ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిని తట్టుకునే శక్తి వేటికిఎంత..? ♦ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు 44 డిగ్రీలకు పైగా పెరగడంతో కొన్ని వన్యప్రాణులు, పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి. మనుషులతో పాటు వన్యప్రాణులు ఎండ వేడిని కొంతమేర తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. 38–40 డిగ్రీల ఎండను కొన్ని వన్యప్రాణులు ఓర్చుకుంటాయి. క్రూర జంతువులైన పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్లు, చిరుతపులులు, ఎలుగుబంట్లు 40 డిగ్రీల ఎండను సైతం తట్టుకుంటాయి. భారీ జంతువైన ఏనుగు 44 డిగ్రీల ఎండను సైతం ఓర్చుకోగలుగుతుంది. ఆస్ట్రిచ్ పక్షులు 45–47 డిగ్రీల ఎండలో హాయిగా జీవిస్తాయి. చిన్న పక్షులైతే 40 డిగ్రీలలోపు ఎండ వేడిమికే సతమతమవుతాయి. ♦ రామచిలుకలు, అడవి కోళ్లు, బాతులు, ఇతరత్ర చిన్న చిన్న పక్షులు జూలో 500కు పైగా ఉన్నాయి. సహజ సిద్ధమైన జూ వాతావరణంలో ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఎండ వేడిమిని అతికష్టం మీద ఈ పక్షులు తట్టుకోగలుగుతాయి. రాత్రివేళ సంచరించే నిశాచర జంతువు, దేవాంగ పిల్లి, గబ్బిలాలు, ముళ్ల పంది, రాటేల్, అడవి పిల్లులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. -
నెహ్రూ జూపార్కులో జూనియర్ ఫ్రెండ్స్
బహదూర్‌పురా: లాక్డౌన్ అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహాలు, పులులు, నక్కలు, ఆస్ట్రిచ్ పక్షులు జూ సందర్శకులను అలరించనున్నాయి. ఇటీవల జూపార్కులోని ఆదిసన(రాధ), మాధవ్‌లకు రెండు సింహపు కూనలు జన్మించాయి. వాటిని డార్క్ రూమ్‌లో నుంచి డే క్రాల్‌లోకి విడుదల చేశారు. ప్రస్తుతం సింహపు కూనలు సమ్మర్ హౌజ్‌లో ఉన్నాయి. 2013లో సౌదీ అరేబియా ప్రిన్స్ సింహాలను జూకు బహుమతిగా అందించారు. జూలో వీటికి రాధ, మాధవ్‌లుగా పేర్లు పెట్టారు. ఇటీవల రెండు కూనలు జన్మించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం రాయల్ బెంగాల్ టైగర్(ఆశ) మూడు పులి కూనలకు జన్మనిచ్చింది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నక్కలు కూడా రెండు నక్క కూనలకు జన్మనిచ్చాయి. జూపార్కులో ఉన్న ఆస్ట్రిచ్ పక్షులు మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. మొత్తం మీద లాక్డౌన్లో జూపార్కులో 10 కొత్త వన్యప్రాణులు సందర్శకులను అలరించనున్నాయి. బుడిబుడి నడకలతో జూపార్కు యానిమల్ కీపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు జూపార్కులో మరిన్ని కొత్త వన్యప్రాణులు పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయి. జూలోని వన్యప్రాణులకు కరోనా వ్యాధి సోకకుండా పెద్దఎత్తున జాగ్రత్త చర్యలను జూ అధికారులు తీసుకుంటున్నారు. -
సుమారు 155 రకాల సీతాకోక చిలకలు
బహదూర్‌పురా: ప్రకృతి రమణీయతను సీతాకోక చిలకలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. జూ సందర్శకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులోని బటర్‌ఫ్లై పార్కు అమితంగా ఆకర్షిస్తోంది. ఇటీవల పునర్నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన ఓపెన్ బటర్‌ఫ్లై పార్కులో ఎన్నో రకాల సీతాకోక చిలుకలు సందర్శకులను అలరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 వేల సీతాకోక చిలకలలో భారతదేశంలో 1,500 రకాలు ఉన్నాయి. ఇందులో 155కుపైగా వివిధ రకాల సీతాకోక చిలకల్ని హైదరాబాద్ జూపార్కులో చూడవచ్చు. పార్కు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల చెట్లు ఉన్నాయి. సీతాకోక చిలకల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల చెట్లను ఈ పార్కులో నాటారు. దీంతో సీతాకోక చిలకల పార్కు సందర్శకుల మదిని దోచుకుంటోంది. ముఖద్వారం..నయనానందకరం సీతాకోక చిలకల పార్కు ముఖద్వారాన్ని వివిధ రంగులతో తీర్చిదిద్దారు. బయట గేటుతో పాటు లోపల పచ్చిక బయలు, వివిధ రకాల సువాసనతో కూడిన పూల మొక్కలతో పార్కు ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. సందర్శకులకు మానసికోల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తోంది. కీటకాల మ్యూజియం.. వివిధ రకాల క్రిమికీటకాల మ్యూజియం కూడా ఓపెన్ బటర్‌ఫ్లై పార్కులో ఏర్పాటు చేశారు. క్రిమికీటకాలు ప్రారంభ దశ నుంచి మార్పు చెందే విధానాన్ని వివరించే బోర్డు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఎన్నో రకాల క్రిమికీటకాల గురించి తెలుసుకునేందుకు ఈ మ్యూజియం ఒక విశ్వవిద్యాలయమేనని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లిపాదీ బటర్‌ఫ్లై పార్కును సందర్శించి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి. -
మన జూకు విదేశీ వన్యప్రాణులు!
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు కొత్త జీవులు రానున్నాయి. ఇక్కడి అధికారులు ఇతర దేశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జపాన్ జూ నుంచి రెండు జతల కంగారూలను, ఒక జత మిర్కట్స్ (ముంగీసలు)ను తీసుకురానున్నామని జూ అధికారులు పేర్కొన్నారు. సౌతాఫ్రికా నుంచి జీబ్రాలను తీసుకొస్తామని గతంలో పేర్కొన్నారు. జూపార్కులో లేని వన్యప్రాణులన్నింటినీ తీసుకొచ్చేందుకు విదేశాల్లోని జూ పార్కుల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకనుగుణంగా తాజాగా జపాన్ నుంచి రెండు జతల కంగారూలు, జత ముంగీసలను జంతువు మార్పిడిలో భాగంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. జూ అధికారుల ప్రణాళికలు సఫలమైతే విదేశీ వన్యప్రాణులై కంగారూలు, ముంగీసలు, జీబ్రాలు సందర్శకులను అలరించే అవకాశముంది. జూ పార్కుకు ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సౌతాఫ్రికా నుంచి జిబ్రాలను తీసుకొస్తామని పేర్కొన్న జూ అధికారులు సంవత్సరాలు గడుస్తున్నా సఫలీకృతులు కాలేకపోయారు. ఈసారి అలా కాకుండా జపాన్, సౌతాఫిక్రాల నుంచి కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చి జూకు మరింత శోభ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
వడలూరుకు రాము
బహదూర్‌పురా: జంతు మార్పిడిలో భాగంగా నెహ్రూ జూలాజికల్ పార్కులో పుట్టి పెరిగిన ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను చైన్నైలోని వడలూరు జూకు తరలించారు. చైన్నై జూ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఒక జత నీటి గుర్రాలు, రెండు జతల నీలగిరి కోతులు, బారాసింగా జింకలు, జత గ్రే వుల్ఫŠస్ జూకు తీసుకురానున్నారు. జంతువు రక్త మార్పిడిలో భాగంగా వన్యప్రాణులను ఇతర జూలకు తరలించి అక్కడి నుంచి జూకు అవసరమయ్యే వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు సెంట్రల్ జూ అథారిటీ అనుమతి ఇచ్చింది. జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం గురువారం ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను వడలూరు జూ సిబ్బందికి అప్పగించారు. మొత్తం మీద జూపార్కులో జంతువు రక్త మార్పిడి కార్యక్రమం సంవత్సరంలో రెండు మూడుసార్లు జరుగుతుండటం గమనార్హం. జూపార్కులో 2015 జూలై 15న సూరజ్, సరస్వతిలకు రాము ఖడ్గమృగం జన్మనిచ్చిందన్నారు. అప్పటి నుంచి జూ సందర్శకులను అలరిస్తున్న రాము ఇతర జూలకు జంతువు మార్పిడిలో తరలివెళ్లింది. -
రాబందును చూపిస్తే లక్ష నజరానా
రాబందులు.. అంతరించిపోయే పక్షి జాతిలో ఉన్న వీటిని ఈ తరం వారు చూసింది తక్కువమందే ఉంటారు. పర్యావరణ అసమతుల్యం.. వాతావరణంలో మార్పులతో పాటు మానవ జాతి చేసిన తప్పిదాలు ఈ పక్షుల మనుగడపైపెను ప్రభావం చూపాయి. దాంతో ఒకప్పుడు హైదరాబాద్ నగర పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న రాబందులు క్రమంగా కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రాబందును చూపిస్తే లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. ఆ పక్షుల ఆహారమైన జంతువుల కళేబరాలు దొరకకపోవడం.. దొరికినా అవి విషతుల్యం కావడంతో ఇవి అంతరించిపోయే దశకు చేరాయి. కుళ్లిన మాంసం వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఈ జాతి ఉనికి గత పదేళ్లుగా కనిపించనే లేదు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఏడు మగ, నాలుగు ఆడ రాబందులు ఉన్నప్పటికీ వాటి జీవిత కాలం కూడా దాదాపు చరమాంకానికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి జాతి పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకోవడంతో పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాబందుల జాతిని, సంతతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జూపార్కుకు కొన్ని రాబందులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న లేఖ రాసింది. దీనిపై అక్కడి సర్కారు సానుకూలంగా స్పందించడంతో ఇటీవల కొందరు జూపార్కు అధికారుల బృందం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పర్యటించి 10 నుంచి 12 రాబందులను ఎంపిక చేశారు. వాటిని త్వరలో జూ పార్కుకు తీసుకురావాలని నిర్ణయించారు. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ విభాగం రాబందుల సంరక్షణ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు అవసరమైన నిధులను సెంట్రల్ జూ అథారిటీ సమకూరుస్తుంది. అత్యంత అరుదైన పక్షి జాబితాలో రాబందు ఒకప్పుడు సామాన్య పక్షుల జాబితాలో ఉన్న రాబందులను భారత ప్రభుత్వం ‘అత్యంత అరుదైన పక్షుల’ జాబితాలో చేర్చింది. పశువుల్లో నొప్పుల నివారణకు వినియోగించే డైక్లో ఫినాక్ వంటి ఔషధాలను కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కువగా వాడేవారు. ఈ ఔషధం ఆనవాళ్లు ఆ జంతువుల్లో అలాగే ఉండిపోవడంతో పశువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాన్ని తిన్న రాబందులు ఎక్కువగా మరణిస్త్నుట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పంటల ఎదుగుదలకు, సస్యరక్షణకు వినియోగించే ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కూడా ఈ జాతి పాలిట శాపంగా మారినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. ♦ బెంగళూరు సమీపంలోని హండిగుండి వద్ద అత్యంత ఎత్తయిన రామదేవర గుట్టపై 2005లో కొన్ని రాబందులను గుర్తించారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాబందుల అభయారణ్యంగా ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్‌లోని పింజర్‌లో బ్రీడింగ్ సెంటర్, మహరాష్ట్రలోని గడ్చిరోలిలో అభయారణ్యం ఏర్పాటుతో వీటి సంతానం క్రమంగా వృద్ధి చెందుతోంది. కాగా, 2013 లో రెండు రాబందులను ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు అటవి ప్రాంతంలోని పాలరాపు గుట్ట పై అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇవి గడ్చిరోలి నుంచి వలస వచ్చినట్లు తేల్చారు. ఏడాదికి ఒక్క గుడ్డు మాత్రమే.. నెహ్రూ జూ పార్కులో ప్రస్తుతం వైట్ బ్యాక్డ్ (తెల్ల వీపు) రకానికి చెందిన రాబందులు మాత్రమే ఉన్నాయి. లాంగ్ బిల్డ్ (పొడవు ముక్కు) రకాలకు చెందినవి ఒక్కటీ లేదు. ఒక్క ఆడ రాబందు ఏడాదికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డు పొదిగి పిల్ల పుడితే వాటి జాతి క్రమేణ పెరిగేది. కానీ జూ పార్కులో ఉన్నవి ఏటా గుడ్లు పెడుతున్నప్పటికీ దాని పెంకు పలుచగా ఉండడంతో పొదిగి పిల్లగా మారడం లేదు. ఒకవేళ గుడ్డు పొదగి పిల్ల పుట్టినా అది బతకడం లేదని అధికారులు చెబుతున్నారు. జూలో ఉన్న రాబందులు కొన్నేళ్లుగా ఇవే ఉండటంతో జన్యుసంబంధిత లోపాలతో వాటి జాతి వృద్ధి చెందడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గడ్చిరోలి నుంచి తెచ్చే కొత్త రాబందులు, జూలో ఉన్నవి కలవడం వల్లయినా వాటి జాతి పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జూపార్కులో గంధపు చెట్లు మాయం
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రెండు గంధపు చెట్లను దొంగలు నరుక్కెళ్లిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూ పార్కులో మీరాలం ఈద్గా వైపు గంధపు చెట్లు ఉన్నాయి. మీరాలం ఈద్గా సమీపంలోని గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు రెండు గంధపు చెట్లను నరుక్కెళ్లారు. జూపార్కు అసిస్టెంట్ క్యూరేటర్–3 సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బహదూర్‌పురా అదనపు ఇన్స్పెక్టర్ శివ కుమార్ సోమవారం గంధపు చెట్లు చోరీకి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. గంధపు చెట్ల మాయంపై జూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలోనూ జూ పార్కులో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఇక రజినీ కనిపించదు
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగే మొహర్రం, బోనాల వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. నగరవాసులేగాక, దేశవిదేశాల నుంచి భక్తులు ఈ వేడుకలను చూసేందుకు నగరానికి వస్తుంటారు. అది మొహర్రం అయినా బోనాల పండుగ అయినా.. ఒక ప్రత్యేక అతిథి మాత్రం సాధారణంగా సందడి చేస్తుంటుంది. అదే రజినీ ఏనుగు. ఈ ఏనుగు వయసు 54 ఏళ్లు. ప్రస్తుతం నెహ్రూ జూపార్కులోనే ఉంది. గత 17 ఏళ్లుగా ఇది నగరంలో జరిగే మతపరమైన వేడుకల్లో కనువిందు చేస్తోంది. న్యాయస్థానం ఆదేశాలతో.. తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇక ముందు బోనాలు, మొహర్రం లాంటి వేడుకలకు జూపార్క్ నుంచి ఏనుగును ఇవ్వబోమని అటవీ శాఖ స్పష్టం చేసింది. మతపరమైన ప్రదర్శనల్లో రజినీ పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. అయితే జంతువులను ఇలాంటి ప్రదర్శనల్లో ఉపయోగించటాన్ని ఇకపై అను మతించబోమని ఇటీవల హైకోర్టు తెలిపింది. ఏనుగులను నియంత్రించే నిపుణులు (మహావత్) లేకపోవటం, ప్రదర్శన సమయంలో ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇకపై ఎలాంటి ప్రదర్శనలకూ ఏనుగును పంపబోమని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మతపరమైన ఉత్సవాల్లో జంతువుల వినియోగాన్ని నిషేధించాలని గతంలోనే సుప్రీంకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలిచ్చాయి. ఈ ఆదేశాలనే బలపరుస్తూ తాజాగా ఇక్కడి హైకోర్టు కూడా ఇదే తీర్పునిచ్చింది. ఉత్సవాల్లో జంతు వులను కట్టేయడంతో వాటికి గాయాలవుతున్నాయని, ఇది హింస కిందకే వస్తుందని జంతుప్రేమికులు వాదిస్తున్నారు. పైగా భారీ శబ్దాలు, జన సందోహాన్ని చూసి ఇవి బెదిరినపుడు ప్రజల ప్రాణాలకే నష్టం వాటిల్లుతున్నదని వారు వాదిస్తున్నారు. ప్రజలు, జంతువుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
జూపార్కులో ధరల పెంపు
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఫిష్ అక్వేరియం, నిశాచర జంతుశాల, ఫొసిల్ మ్యూజియం, మూత్రశాలల వినియోగానికి ఈ నెల 12 నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని జూ క్యూరేటర్ క్షితిజా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూపార్కులోని ఫిష్ అక్వేరియానికి ప్రస్తుతం రూ.10, నిశాచర జంతుశాలకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, ఫొసిల్ మ్యూజియానికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.3, 5 చొప్పున రుసుం వసూలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి వీటి ప్రవేశం ఉచితంగా పొందవచ్చన్నారు. కాగా జూపార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25గా ఉందని.. ఈ నెల 12 నుంచి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 రుసుం తీసుకోనున్నామన్నారు. వారాంతపు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ప్రవేశ ముఖద్వారం రుసుం పెద్దలకు రూ.60, చిన్నారులకు రూ.40 వసూలు చేస్తున్నామని.. పెద్దలకు మాత్రం రూ.10ని పెంచి రూ.70 వసూలు చేయనున్నామన్నారు. వారాంతపు, సెలవు రోజు పెద్దలకు రూ.80, చిన్నారులకు రూ.50 వసూలు చేయనున్నామన్నారు. 10 సీట్ల కాలుష్య రహిత బ్యాటరీ వాహనం ప్రత్యేక రైడ్ కోసం 120 నిమిషాలకు రూ.2 వేలు, 14 సీట్ల వాహనానికి రూ.3 వేలు వసూలు చేయనున్నామన్నారు. స్టిల్ కెమెరా రుసుం రూ.30 నుంచి 100కు, వీడియో కెమెరా రుసుం రూ.120 నుంచి 500కు పెంచామన్నారు. చిట్టి రైలు రుసుం పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10, వారాంతపు, సెలవు రోజుల్లో పెద్దలకు రూ.30, చిన్నారులకు 15 వసూలు చేయనున్నామన్నారు. జూపార్కులో గెస్ట్‌హౌస్ రుసుం రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. ఐదుగురు దాటితే అదనంగా ఒకరికి రూ.200 చార్జీ చేస్తామన్నారు. గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న హాల్లో 40 మంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించుకునేందుకు రూ.10 వేల చార్జి వసూలు చేస్తున్నామన్నారు. లయన్ సఫారీ పార్కు వాహనం పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 ఉండగా... వారాంతపు, సెలవు రోజుల్లో రూ.60 వసూలు చేస్తున్నామన్నారు. సఫారీ వాహనంలో చిన్నారుల టికెట్టు రూ.30 నుంచి రూ.20కి తగ్గించామన్నారు. హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రుసుంలను పెంపుతో పాటు కొన్ని ప్రవేశాలు ఉచితం చేశామన్నారు. పెరిగిన ధరలు, ఉచిత సేవలు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. -
జూలాలా.. తిరిగొచ్చెయ్యాలా!
పార్కులో 120, 85 ఏళ్ల వయసున్న తాబేళ్లు ఉన్నాయి. నాంపల్లి జూపార్కు నుంచి ప్రస్తుత పార్కు వరకు పెద్ద తాబేలు ప్రస్థానం కొనసాగుతోంది. ఈ రెండు జీవులు జూ పార్కులో అంత్యంత ఓల్డేస్ట్గా గుర్తింపు పొందాయి. పార్కులో 163 జాతులకు చెందిన 1600 రకాల జంతువులు, 72 జాతులకు చెందిన 700 పక్షులతో పాటు సరిసృపాలు ఉన్నాయి. ఇందులో 30 క్రూరమృగాల జాతులు, 30 శాకాహార జంతు జాతులు ఉన్నాయి. 50కి పైగా పక్షి జాతులు ఉన్నాయి. జంతువులకు ప్రతిరోజు సమృద్ధిగా ఆహారం అందజేస్తారు. వారాంతంలో ఒక రోజు (శుక్రవారం) మాత్రం పస్తులు ఉంచుతారు. ఇది వాటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. జూ పార్కును సందర్శించిన అరబ్ యువరాజులు ఏషియాటిక్ సింహాలు, చీతాలను బహుమతిగా అందించారు. జంతు మార్పిడిలో జత ఖడ్గ మృగాలు ఇక్కడికొచ్చాయి. జకోస్లోవియా నుంచి అరుదైన చీతాలు, షీసెల్ నుంచి అల్దాబ్రా తాబేళ్లు మన జూకు వచ్చాయి. బహదూర్‌పురా: కాంక్రీట్ జంగిల్‌గా మారిన మహానగరంలో మనుషులు యంత్రాలుగా బతకాల్సి వస్తోంది. ఇలాంటి చోట ఓ చిక్కని చిట్టడవి... అందులో పులుల గాండ్రింపులు, సింహాల గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తే.? జింకల పరుగులు, పక్షుల సందళ్లు కనిపిస్తే.? ఎలా ఉంటుంది. అవి మనకు అతి చేరువగా తిరుగుతుంటే... ఎంతటి ఒత్తిడి అయినా వెంటనే మాయమవుతుంది. ఇంతటి అద్భుత అనుభూతిని పంచుతోంది నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు. నిత్యం రణగొణ ధ్వనులతో సతమతమయ్యే జనారణ్యానికి భిన్నంగా అరుదైన వన్యప్రాణి ప్రపంచాన్ని పరిచయం చేసే పర్యాటక కేంద్రమిది. పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తికి కేంద్రంగా వర్ధిల్లుతోంది. అంతరించిపోయే స్థితిలో ఉన్న ఎన్నో జీవులను పునఃసృష్టి చేసి ప్రపంచానికి అందిస్తోంది. అక్టోబర్ 6న జూపార్కు వ్యవసాప్థక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెహ్రూ జూలాజికల్ పార్కు సుమారు 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1963 అక్టోబర్ 6న అప్పటి గవర్నర్ నగేశ్ చేతుల మీదుగా హైదరాబాద్ జూలాజికల్ గార్డెన్ ప్రారంభమైంది. అదేరోజు సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అంతకముందు 1926లో ఏడో నిజాం ఈ మినీ జూను పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. 1959లో మీరాలం ట్యాంక్ వద్ద జూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పటి ప్రధాని నెహ్రూ మరణానంతరం 1967లో నెహ్రూ జూలాజికల్ పార్కుగా పేరు మార్చారు. నాలుగు సఫారీలు... అడవిని పోలిన నాలుగు సఫారీలను (లయన్, టైగర్, బేర్, బైసన్ (ప్రస్తుతం నీల్గాయ్)) ఏర్పాటు చేసిన ఘనత నెహ్రూ జూలాజికల్ పార్కుకే దక్కింది. తొలినాళ్లలో జూలో బంధించిన జంతువులను సందర్శకులు చూసేవారు. 1970 తర్వాత జూపార్కు నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి. వన్యప్రాణుల ఆవాసాలకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించాలని జూ అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 1974లో లయన్ సఫారీ, 1983లో టైగర్ సఫారీ, 1992 బేర్, బైసన్ సఫారీ పార్కులను ఏర్పాటు చేశారు. జంతువులు బయట తిరుగుతూ ఉంటే సందర్శకులు వాహనాల్లో నుంచి చూసే విధానమిది. అనంతరం 2000 నుంచి జూలోని జంతువులు కేజ్, మోట్, ఎన్క్లోజర్లకు పరిమితం కాకుండా, వాటి జీవన పరిస్థితులకు అనుగుణంగా సహజమైన వాతావరణాన్ని కల్పించి బయోలాజికల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్ జూ అథారిటీ కృషి చేస్తోంది. 36 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లయన్ సఫారీ గుజరా>త్ ఘిర్ ఫారెస్ట్ తరహాలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1970కి ముందు ఘిర్ నేషనల్ ఫారెస్ట్‌తో పాటు దేశంలోనే వివిధ జూల్లోని సింహాల సంతతి వేగంగా క్షీణించసాగింది. అయితే ఇక్కడి సఫారీలో మాత్రం ఆయా ప్రాణులు వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి సింహాలు, ఎలుగుబంట్లు, పులులను ఇతర జూలకు పంపిస్తూ, అక్కడి అరుదైన జీవులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇక్కడి ప్రయోగాల ఫలితంగా 20 పులులు జూలో ప్రాణం పోసుకున్నాయి. అంతేగాక అరుదైన కృష్ణ జింకలు, మూషిక జింకలు, తామిన్ డీర్, మణిపూర్ జింకల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇలా పెరిగిన జంతువులకు సహజ ఆవాసం కల్పించేందుకు అడవుల్లో వదులుతున్నారు. టికెట్లధరలు.. పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25. రైలు బండిలో పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, కెమెరాకు రూ.30, వీడియో కెమెరాకు రూ.120, బ్యాటరీ వాహనంలో ప్రయాణానికి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.40, సఫారీలో తిరిగేందుకు రూ.50, పిల్లలకు రూ.30. ప్రతి సోమవారం జూ పార్కుకు సెలవు ఉంటుంది. జూ రైడ్: విజటర్స్ వ్యాన్‌లో 10 మందిని ఎక్కించుకొని 40 నిమిషాలు జూపార్కులో తిప్పుతారు. పార్కు గేట్ నుంచి ప్రారంభమై తాబేలు, జింకలు, ఏనుగులు, తెల్లపులి, జాగ్వార్, ఉడ్స్, తొడేళ్లు, సింహం, చిరుతలు, నీటి గుర్రం, ఖడ్గమృగం, నిప్పుకోళ్లు, కొంగలు, జిరాఫీ, చిలుకలు, పచ్చ పాములు, నెమళ్లు, హిమాలయన్ ఎలుగుబంట్లను చూపించి తిరిగి జూపార్కు గేట్ వద్దకు చేరుకుంటుంది. సఫారీ రైడ్: పార్కులోని లయన్స్ సఫారీలో 30 నిమిషాలు తిరగవచ్చు. కేవలం 10 అడుగుల దూరం నుంచి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను చూడొచ్చు. ఇక చిట్టి రైల్లో 20 నిమిషాల్లో జూపార్కులోని జంతువులు, పక్షులను చూడొచ్చు. సంతానోత్పత్తిలో గణనీయఫలితాలు.. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంతానోత్పత్తిని జూలో చేపట్టి గణనీయమైన ఫలితాలు సాధించారు. మూషిక జింక (మౌస్ డియర్), ముళ్ల పందులు, చిన్న చిన్న పక్షులు, రాబందులతో పాటు మొసళ్లు, తెల్లజాతి పులులు, రాయల్ బెంగాల్ టైగర్లను ఇక్కడే పెంచారు. పరిశోధనలకు కేంద్రం... 53 వసంతాలు పూర్తి చేసుకున్న జూ పార్కు పరిశోధనలకు, అరుదైన జంతువుల పునరుత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. అడవిని పోలిన సఫారీలు, పగలే వెన్నెల వాతావరణంతో నిషాచర జీవులకు అనువుగాను మారింది. ఎన్నో రకాల పక్షులు, కీటకాలకు ఈ ప్రదేశం ఆలవాలం. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియాటిక్ సింహాల పరిరక్షణ, వాటి పునరుత్పత్తికి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేగాక తెల్ల పులుల సంతానోత్పత్తి కేంద్రం కూడా ఇక్కడే ఉంది. కృత్రిమ గర్భోత్పత్తి, సీసీఎంబీ పరిశోధనలకు కేంద్రంగాను ఉంది. పార్కు విహారానికి మాత్రమే గాక జంతువులు, పక్షుల్లోని కొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేసే పరిశోధన కేంద్రంగాను రూపుదిద్దుకుంది. ‘జూ కారŠప్స్’ పేరుతో విద్యార్థులు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలకు శిక్షణ కేంద్రంగాను ఇది కొనసాగుతోంది. -
జూలో సింహం మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం అతుల్ (18) వృద్ధాప్యం, గాయాల కారణంగా గురువారం మృతి చెందింది. జూ అధికారులు తెలిపిన మేరకు.. వృద్ధాప్యంతో బాధపడుతున్న సింహం వారం రోజుల నుంచి జూ వైద్యుల పర్యవేక్షణలో చి కిత్స పొందుతోంది. అతుల్‌ను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, అలీపూర్, కలకత్తా, డబ్ల్యూబీ నేషనల్ పార్కు అధికారులు కృషి చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం సింహానికి జూపార్కులో పోస్టుమార్టం నిర్వహించారు. అభయారణ్యాల్లో సింహాలు 15 ఏళ్ల వరకే జీవిస్తాయని జూపార్కులో మాత్రం అతుల్ 18 ఏళ్లు జీవించిందని అధికారులు తెలిపారు. -
జూలో అరుదైన మూగజీవాల మృత్యువాత
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వరుసగా అరుదైన వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. సంవత్సరం పొడవునా వన్యప్రాణుల జననం 10 వరకు ఉంటే.. మృతిచెందుతున్నవి మాత్రం 70– 100 ఉంటున్నాయి. ఎక్కువ శాతం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందినట్లు జూ ఉన్నతాధికారులు పేర్కొంటూ చేతులు దులుపుకొంటున్నారు. గత నవంబర్‌లో ఏడాదిన్నర వయసున్న బహిస్మతి సింహం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇది పిల్లకూన కావడంతో అనారోగ్యాన్ని సాకుగా చూపకుండా జూ అధికారులు దీని మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి సాకి అనే పులిని చంపిన కేసు మొదటిది కాగా... సింహం కూన అనుమానంపై కేసు రెండోది. మొత్తంగా జూపార్కులో అరుదైన వన్యప్రాణుల మృతికి జూ అధికారుల నిర్లక్ష్యం, యానిమల్ కీపర్ల సలహాలు, సూచనలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వన్యప్రాణుల బలిగొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారణాలేమిటి.. నెహ్రూ జూలాజికల్ పార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులకు అసలు కారణాలను ఆదిలోనే గుర్తించడంలో జూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడం ప్రధానమైన కారణం. సీజనల్‌గా వచ్చే వ్యాధుల పేరుతో తీసుకుంటున్న ముందస్తు చర్యలు నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువగా తీసుకోవడం. ఆయా వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లో నీటి మోడ్‌ను పరిశుభ్రపరచకపోవడం, బ్యాక్టీరియా వ్యాపించకుండా సున్నం కలిపిన బ్లీచింగ్ పౌడర్‌ను 15 రోజులకోసారి చల్లడం, మోడ్‌లోకి కొత్త నీరు విడుదల చేయకపోవడంతో చల్లిన బ్లీచింగ్ పౌడర్, సున్నం మరింత కలుషితం కావడంతో ఆ నీటిని తాగి వన్యప్రాణులు కాలేయం, ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. వైద్య సేవలు అంతంతే.. జూలోని ఆయా ఎన్‌క్లోజర్‌లో ఉన్న వన్యప్రాణులను పరిశీలిస్తూ వైద్య సేవలను జూ అధికారులు అంతంత మాత్రంగానే అందిస్తుండటంతో వన్యప్రాణులు మృత్యు చెందుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యానికి గురైన వన్యప్రాణులకు వైద్యం అందించాలంటే జూ కన్సల్టెంట్, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ సూచనలు, సలహాలు తీసుకోవాల్సింది. ఆయా వన్యప్రాణుల నీటి నమునాలను సేకరించి కాలుష్యాన్ని గుర్తించే చర్యలు చేపట్టకపోవడం, యానిమల్ కీపర్లు వన్యప్రాణులకు నివేదికలను జూ వెటర్నరీ వైద్యులు బుట్టదాఖలు చేయడంతో ఎక్కువ సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులకు అందిస్తున్న ఆహారాన్ని పూర్తిగా పరిశీలించడంలోనూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడంతో వన్యప్రాణులు అనారోగ్యానికి గురవుతున్నాయి. నివేదికలేవీ.. జూపార్కులో మృతి చెందిన వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించి నమునాలను సేకరించి మృతికి కారణాలను తెలియజేయాల్సిన జూ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. సింహం కూన మృతి నివేదికను ఇప్పటి వరకు వెల్లడించలేదు. గత నెల 29న మృతి చెందిన సింహం నివేదికను రెండు రోజుల్లోనే జూ అధికారులు పత్రికలకు విడుదల చేయడం గమనార్హం. గత ఏడాది అడవిదున్న, నీటి గుర్రం, ఐనా, నీటి కుక్క, సారస్ క్రేన్ పక్షి, చింపాంజీ, ఎలుగుబంటి, మూషిక జింకలు, నామాల కోతులు, చిరుత పులులు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగు, వివిధ రకాల కోతులతో పాటు ఇతర వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించిన సీసీఎంబీ, వీబీఆర్ఐ, జూ వెటర్నరీ, రాజేంద్రనగర్ వెటర్నరీ వైద్యులు, శాస్త్రవేత్తలు మృతికి కారణాలపై ఇచ్చిన నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం జూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. పదుల సంఖ్యలో మూషిక జింకల మృతి.. సెంట్రల్ జూ అథారిటీ సహకారంతో అంతరించిపోతున్న మూషిక జింకల సంతానోత్పత్తిని జూలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అనతి కాలంలోనే మూషిక జింకల సంతానోత్పత్తిలో సత్ఫలితాలను సాధించారు. మూషిక జింకల సంతానోత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోవడంతో వాటికి వేరే ఇతర ప్రదేశాలను కేటాయించకపోవడంతో మూషిక జింకలు అంతర్గతంగా పోట్లాకు దిగి 12 వరకు మృతి చెందడం గమనార్హం. -
జూపార్క్‌లో మగ సింహం మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూపార్కులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మరో సింహం మృతి చెందింది. క్రేజీ అనే మగ సింహాం(15) మే 19 నుంచి అనారోగ్యానికి గురైంది. రక్తహీనత, తలకు గాయాలు, మూత్రంలో రక్తం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రేజీకి జూ పార్కు వైద్యసిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. గత నెల 28న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు వైద్యానికి స్పందించకపోవడంతో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది. జూ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ దేవేందర్‌రావు, డాక్టర్ జీ.సునీత, డాక్టర్ సుహ్రుద, సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ ఎం.ఏ.హకీం తదితరులు గత 29న పోస్టుమార్టం నిర్వహించారు. క్రేజీ శరీరం నుంచి మరిన్ని నమూనాలను సేకరించి వీబీఆర్ఐ ల్యాబ్‌కు తరలించినట్లు జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా తెలిపారు. -
జూలో సిబ్బందిపై జింకల దాడి!!
నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతు సంరక్షకులు (యానిమల్ కీపర్లు)గా పనిచేస్తున్న ఇద్దరిపై జింకలు దాడి చేశాయి. వాటికి కేటాయించిన ఎన్‌క్లోజర్ నుంచి జింకలను వదిలేందుకు గేట్‌ను తెరిచిన కృష్ణారెడ్డి, అక్బర్‌లపై జింకలు తిరగబడ్డాయి. ఈ సంఘటనలో తొలుత కృష్ణారెడ్డి జింకల కోపానికి గురయ్యాడు. అప్రమత్తమైన మరో కీపర్ అక్బర్ వాటిని నిరోధించేందుకు యత్నించడంతో అతనిపైనా కొమ్ములతో దాడికి దిగి ఓ చెట్టుకు గుద్దేశాయి. దీంతో అతనికి నడుము, కాలు భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో ఇతరుల సహాయం కోసం ప్రయత్నించిన కృష్ణారెడ్డినీ గాయపరిచాయి. అక్కడికి చేరుకున్న తోటి జంతు సంరక్షకులు అక్బర్‌ను యశోదా ఆసుపత్రికి తరలించారు. వన్యప్రాణులను ఉదయం ఎన్క్లోజర్ల నుంచి విడిచి పెట్టి సాయంత్రం మళ్లీ ఎన్‌క్లోజర్‌లోకి పంపిస్తారు. ఇది జూలో రోజూ జరిగే ప్రక్రియ. జింకల నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని జూ సిబ్బంది చెబుతున్నారు.