బహదూర్‌పురా: జంతు మార్పిడిలో భాగంగా నెహ్రూ జూలాజికల్ పార్కులో పుట్టి పెరిగిన ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను చైన్నైలోని వడలూరు జూకు తరలించారు. చైన్నై జూ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఒక జత నీటి గుర్రాలు, రెండు జతల నీలగిరి కోతులు, బారాసింగా జింకలు, జత గ్రే వుల్ఫŠస్ జూకు తీసుకురానున్నారు. జంతువు రక్త మార్పిడిలో భాగంగా వన్యప్రాణులను ఇతర జూలకు తరలించి అక్కడి నుంచి జూకు అవసరమయ్యే వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు సెంట్రల్ జూ అథారిటీ అనుమతి ఇచ్చింది. జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం గురువారం ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను వడలూరు జూ సిబ్బందికి అప్పగించారు. మొత్తం మీద జూపార్కులో జంతువు రక్త మార్పిడి కార్యక్రమం సంవత్సరంలో రెండు మూడుసార్లు జరుగుతుండటం గమనార్హం. జూపార్కులో 2015 జూలై 15న సూరజ్, సరస్వతిలకు రాము ఖడ్గమృగం జన్మనిచ్చిందన్నారు. అప్పటి నుంచి జూ సందర్శకులను అలరిస్తున్న రాము ఇతర జూలకు జంతువు మార్పిడిలో తరలివెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment