
’నన్ను అలా ఎప్పుడూ చూసి ఉండరు’
తన రానున్న చిత్రం కోసం పూర్తిగా ఆహార్యాన్ని మార్చుకున్నట్లు బ్రిటన్ ప్రముఖ నటుడు, స్లమ్ డాగ్ మిలినీయర్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటుడు దేవ్ పటేల్ చెప్పాడు.
లాస్ ఎంజెల్స్: తన రానున్న చిత్రం కోసం పూర్తిగా ఆహార్యాన్ని మార్చుకున్నట్లు బ్రిటన్ ప్రముఖ నటుడు, స్లమ్ డాగ్ మిలినీయర్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటుడు దేవ్ పటేల్ చెప్పాడు. లయన్ చిత్రం కోసం తన జుట్టు, గడ్డం పెంచానని, ఈ చిత్రంలో పెద్దవాడిలా కనిపిస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా తనను చూస్తారని, ఆ మేరకు దర్శకుడు తనను మార్చాడని చెప్పారు. బ్రిటన్ దర్శకుడు గార్త్ డావిస్ దర్శకత్వంలో లయన్ అనే చిత్రంలో దేవ్ పటేల్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దేవ్ మీడియాకు చెప్పారు.
’ మేం నీతో సినిమా చేయాలంటే ముందు నిజంగా నిన్ను పూర్తిగా మార్చాలని ఆడిషన్ తర్వాత డేవిస్ చెప్పారు. దేవ్ పటేల్ ను ఇంతవరకు ఎవరూ చూడని విధంగా చూపించాలనుకుంటున్నానన్నారు. నిజంగా దాంతో పూర్తి మనిషిలా మారాను. వచ్చే ఎనిమిది నెలలపాటు ఎలాంటి డేట్లు ఇవ్వొద్దని వెంటనే నా వ్యక్తిగత మేనేజర్ కు చెప్పాను. లయన్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. ప్రతిసారి ఇలాంటివి రావు’ అని దేవ్ చెప్పాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 25న విడుదల కానుంది.