అఫ్రిది ఇంట్లో సింహం.. అభిమానుల షాక్‌ | Twitter Asks Shahid Afridi Has A Pet Lion | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 5:46 PM | Last Updated on Wed, Jul 25 2018 2:13 PM

Twitter Asks Shahid Afridi Has A Pet Lion - Sakshi

హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల తన కూతురితో గడిపిన క్షణాలను, ఫొటోలను ఈ పాక్‌ మాజీ క్రికెటర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నచ్చిన వారితో గడపడం చాలా మధురంగా ఉంటుంది. నా కూతురు నా వికెట్‌ సంబరాలను అనుకరించడం నాకు ఓ గొప్ప అనుభూతినిచ్చింది. జంతువులను సంరక్షించడం మరచిపోకండి. మన ప్రేమను పొందే అర్హత వాటికి ఉంది’ అని జింకకు తాను పాలుపడుతున్న ఫొటో, తన కూతురు సెలెబ్రేషన్‌ ఫొటోను షేర్‌ చేశాడు.

అయితే ఇక్కడ తన కూతురు ఫొటోలో ఆమె వెనుకాలా ఓ పెద్ద సింహం ఉంది. దీన్ని చూసిన అభిమానులకు వెన్నులో వణుకు మొదలైంది. ‘ఆఫ్రిది సింహాన్ని పెంచుకుంటున్నాడా ఏందీ’ అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరైనా కుక్క, పిల్లిలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు..కానీ సింహాలు పెంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే అఫ్రిది నిజంగానే సింహాన్ని పెంచుకుంటున్నట్లు మరో అభిమాని స్పష్టమైన ఫొటోను షేర్‌ చేశాడు.

అఫ్రిది చేసిన ట్వీట్‌.. ఫొటోలో సింహం​ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement