దాహమేసి దప్పిక తీర్చుకోవడానికి ఓ కొలను దగ్గరికి వెళ్లింది ఓ సింహం. అయితే.. అప్పటికే నీళ్లలో ఉన్న తాబేలు.. దానిని తాగనీయకుండా పదే పదే అడ్డుకుంది. ఒక దగ్గరి నుంచి మరో చోటికి వెళ్లిన కూడా సింహాన్ని సతాయిస్తూ ఇబ్బంది పెట్టింది.
ఎవడైతే నాకేంటి అనుకుందో ఏమో.. తన అడ్డాకి వచ్చిన సింహాన్ని అలా ఇబ్బంది పెట్టింది ఆ తాబేలు. సింహం కూడా ఆ చిట్టితాబేలును ఏం చేయకుండానే పక్కకు వెళ్లి నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. ఈ వీడియో కొత్తదా? పాతదా?.. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీశారో తెలియదుగానీ.. మిగతా జంతువుల్ని భయపెట్టే సింహానికి చుక్కలు చూపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు.
ఇదిలా ఉండగా.. కొంత కాలం కిందట వైకల్యం ఉన్న ఓ శునకం.. సుఖంగా నిద్రిస్తున్న రెండు సింహాలపైకి మొరుగుతున్న ఎగబడ్డ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం పైన తాబేలు వీడియో ట్రెండ్ అవుతున్న క్రమంలో.. ఈ పాత వీడియో సైతం మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment