చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. భారత్ తన విజయసూచకంగా అశోక ముద్రలు(మూడు సింహాల గుర్తు) జాబిల్లి నేలపై ముద్రించనుంది.
చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేస్తుంది. రోవర్ చక్రాలు జాబిల్లిపై తిరుగుతూ చంద్రునిపై నీటి జాడ, మట్టి, ఖనిజాలు సహా అనేక వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో రోవర్ చక్రాలు అశోక చిహ్నాన్ని చంద్రునిపై ముద్రించనున్నాయి.
భారత తన విజయసూచకంగా రోవర్ చక్రాలకు అశోక చిహ్నాలను ముద్రించింది. దీంతో రోవర్ తిరిగిన ప్రతిచోట అశోక ముద్రలతో కూడిన అడుగులు ఏర్పడతాయి. సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన అశోక ముద్రలను భారత్ తన వారసత్వ గుర్తుగా చంద్రుని మట్టిపై నిలుపుతోంది.
Big Breaking News - After landing, Chandrayaan-3 rover will etch an impression of the national emblem depicting the Lion Capital of Ashoka at Sarnath and ISRO on the lunar terrain.
— Times Algebra (@TimesAlgebraIND) August 23, 2023
It will signify India's presence and legacy on the Moon♥️🔥.
India set to create history today… pic.twitter.com/BnGBHrqxls
చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ..
Comments
Please login to add a commentAdd a comment