Ashoka
-
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
జాబిల్లిపై మూడు సింహాల అడుగులు
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. భారత్ తన విజయసూచకంగా అశోక ముద్రలు(మూడు సింహాల గుర్తు) జాబిల్లి నేలపై ముద్రించనుంది. చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేస్తుంది. రోవర్ చక్రాలు జాబిల్లిపై తిరుగుతూ చంద్రునిపై నీటి జాడ, మట్టి, ఖనిజాలు సహా అనేక వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో రోవర్ చక్రాలు అశోక చిహ్నాన్ని చంద్రునిపై ముద్రించనున్నాయి. భారత తన విజయసూచకంగా రోవర్ చక్రాలకు అశోక చిహ్నాలను ముద్రించింది. దీంతో రోవర్ తిరిగిన ప్రతిచోట అశోక ముద్రలతో కూడిన అడుగులు ఏర్పడతాయి. సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన అశోక ముద్రలను భారత్ తన వారసత్వ గుర్తుగా చంద్రుని మట్టిపై నిలుపుతోంది. Big Breaking News - After landing, Chandrayaan-3 rover will etch an impression of the national emblem depicting the Lion Capital of Ashoka at Sarnath and ISRO on the lunar terrain. It will signify India's presence and legacy on the Moon♥️🔥. India set to create history today… pic.twitter.com/BnGBHrqxls — Times Algebra (@TimesAlgebraIND) August 23, 2023 చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ.. -
పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన
బెంగళూరు: కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2,000 సాయంగా అందించనున్నట్లు చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రకటిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు సీఎం బసవరాజ్ బొమ్మై వివరిస్తారన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.2,000ల చొప్పున సంవత్సరానికి రూ.24,000 ఇస్తామని చెప్పారు. ఆ మరునాడే అధికార పార్టీ మంత్రి పేదలకు రూ.2,000 పథకం ప్రకటించడం గమనార్హం. 75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి అశోక. కర్ణాటకలో మరోమారు తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
చరిత్రకు ఆనవాలు..మన సువర్ణగిరి....అదే నేటి జొన్నగిరి
సాక్షి, కర్నూలు(సెంట్రల్): చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలా శాసనాలు తుగ్గలి మండలం జీ ఎర్రగుడి-జొన్నగిరి గ్రామాల మధ్య ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అశోకుడు. గాంధార రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షణ భారత రాజ్యానికి సువర్ణగిరి రాజధానిగా (నేటి జొన్నగిరి) ఏర్పాటు చేశారు. తిరుగులేని రారాజుగా వెలుగొందిన మౌర్యవంశానికి చెందిన అశోక చక్రవర్తి పత్తికొండ నియోజక వర్గంలో రెండు చోట్ల శాసనాలు నిర్మించారు. పత్తికొండ నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో జొన్నగిరి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని పడమటి దిక్కున ఉన్న ఏనుగు కొండల్లో రాతి బండలపై శాసనాలు చెక్కించారు. కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు. వారిలో తన అనునూయులు కూడా ఉండడం చూసి వ్యధకోర్చిన అశోకుడు తర్వాత ఆచార్య ఉపగుప్తుడు ఆధ్వర్యంలో బౌద్ధమతం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి చెడు మార్గాలకు దూరంగా ఉండి ధర్మ ప్రచారం చేపడుతాడు. 365 రోజులు దేశ సంచారం చేసి ధర్మ బోధనలు చేస్తారు. తల్లి దండ్రులను పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని, సత్యమును మాత్రమే పలకాలని హిత బోధ చేస్తాడు. రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం వంటివి చేశాడు. (చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం) మగధ సామ్రాజ్యానికి రెండో రాజధాని జోన్నగిరి... భారత దేశంలో అశోకుడు పలు ప్రాంతాల్లో చిన్నరాతి పలక శాసనాలు చెక్కించినట్లు కథనం. అందులో జొన్నగిరి వద్ద, పత్తికొండ సమీపంలోని రాజుల మండగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా శాసనాలు చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శాసనాలు ప్రాకృత (పాలీ) భాషలో ఉన్నాయి. జొన్నగిరిలో ఉన్న శాసనాలు సింధూ లిపిని పోలి(సర్పలేఖన పద్ధతి) ఉండటంతో ప్రత్యేకత సంతరించు కుందని పేర్కొంటారు. మగధ సామ్రాజ్యంలో జొన్నగిరిని రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించి నట్లు చరిత్రకారుల అభిప్రాయం. దీంతో జొన్నగిరిని సువర్ణగిరి అని పిలుస్తుండే వారని, ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. అందుకు నిదర్శనం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏటా తొలకరి చినుకులకు విలువైన వజ్రాలు లభ్యమవడం. వజ్రాలవేట కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. కొంతమంది ఇక్కడే కొన్ని నెలల పాటు ఉంటూ ప్రతిరోజు పొలాల వెంబడి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో విశేషంగాబంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని జియో మైసూర్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది. ఎకరా రూ.12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేయాలని రైతులతో ఒప్పందం చేససుకొని కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అశోకుని శిలాశాసనాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి సిమెంటు రోడ్డు కాస్త మెరుగుపర్చాలి. శాసనాలను రక్షించేందుకు సంరక్షకులను నియమించారు. శాసనాలను చూసేందుకు ఆదోని–గుత్తి మార్గం గుండా వెళ్లే పర్యాటకులు తరచూ వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేలా తగు చర్యలు ప్రభుత్వ తీసుకుంటే ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. (చదవండి: ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!) -
తెలుగు గడ్డపై అశోకుడు కాలుమోపాడా?
సాక్షి, హైదరాబాద్: భారత ఉపఖండాన్ని అత్యద్భుతంగా ఏలిన మౌర్య రాజ్య చక్రవర్తి అశోకుడు మన ప్రాంతంలో కాలుమోపాడా?.. ఇప్పటివరకు పెద్దగా ఆధారాల్లేవు. గతంలో తెలుగుగడ్డపై అశోకుడి కాలం నాటి వందలకొద్దీ నాణేలు లభించాయి తప్ప ఎక్కడా ఆయన పర్యటన జాడలు బయల్పడలేదు. కానీ, మంజీరా నది ఏడుపాయల ప్రాంతంలో ఉన్న కుల్చారం వద్ద ఇటీవల పరిశోధకులకు లభించిన టెర్రకోట ముక్కపై ఉన్న ‘దేవానా’ అనే బ్రాహ్మీ లిపి అక్షరాలు దీనిపై ఆసక్తి పెంచుతున్నాయి. దేవానాంపియ (దేవానాంప్రియ) అనేది అశోకుడి బిరుదు. దేవుడికి ప్రీతికరమైన వ్యక్తిగా తననుతాను అశోకుడు అభివర్ణించుకున్నాడని అంటారు. దేశవ్యాప్తంగా చాలా ఏళ్లనుంచి లభిస్తున్న శాసనాల్లో దేవానాంపియ పదం తప్ప ఎక్కడా అశోకుడి పేరుండదు. దీంతో తొలుత ఆ పేరుతో రాజు ఉండేవాడని చరిత్రకారులు భావించారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన రాయచూరు సమీపంలోని మస్కీలో 1915లో లభించిన శాసనంలో దేవానాంపియ అనేది తన పేరుగానే అశోకుడు పేర్కొన్నట్టుగా ఉన్న శాసనం లభించింది. బ్రిటిష్ ఇంజనీర్ బీడన్ ఈ శాసనాన్ని చూడగా, నాటి ఎపిగ్రఫిస్ట్ కృష్ణశాస్త్రి నిపుణుల ద్వారా దాని గుట్టు విప్పారు. దీంతో దేవానాంపియ అంటే అశోకుడే అని ప్రపంచానికి తెలిసింది. ఏపీలోని అమరావతి, కర్నూలు సమీపంలోని రాజులమందగిరి, అనంతపురం దగ్గరి ఎర్రగుడిలో అశోకుడి శాసనాలు లభించాయి. తాజాగా, దేవానాంపియ పదంలో ‘దేవానా’ అన్న అక్షరాలున్న టెర్రకోట ముక్క కుల్చారం సమీపంలో లభించింది. మిగతా అక్షరాలున్న భాగం విరిగిపోయి ఈ ముక్క మాత్రమే మిగిలి ఉంటుందని దాన్ని గుర్తించిన శంకర్‌రెడ్డి, నాగరాజు, అరుణ్‌కుమార్‌తో కూడిన బృందానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు ఎం.ఎ.శ్రీనివాసన్ తెలిపారు. ఇది క్రీ.పూ.3వ శతాబ్దానికి చెంది ఉంటుందని తెలిపారు. తవ్వకాలు జరిపితే.. తెలంగాణ ప్రాంతంలో మౌర్యుల కాలం నాటి వందలకొద్దీ నాణేలు గతంలో లభించాయి. 1921లో కరీంనగర్ ప్రాంతంలో ఒకేసారి 420 పంచ్‌మార్క్‌డ్ నాణేలు దొరికాయి. మిగతా ప్రాంతాల్లోనూ మరిన్ని లభించాయి. కానీ అశోకుడి బిరుదుతో ఉన్న టెర్రకోట లభించటం ఇదే తొలిసారి. అది బౌద్ధ స్తూపానికి చెందిన ఫలకంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే స్తూపం ఆనవాళ్లు లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు. తన హయాంలో అశోకుడు వేలసంఖ్యలో స్తూపాలు వేయించాడు. ఈ ప్రాంతానికి ఆయన వచ్చినట్టు గుర్తుగా స్తూపం ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న రాతిగుహ బయల్పడింది. అక్కడి రాతిగుండుపై ‘హెనమో బుద్ధేయ’, ‘ధర్మ’, ‘హే జమ’ అన్న పదాలు బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉన్నాయి. -
అశోక విజయదశమి
సుదీర్ఘ భారతదేశ చరిత్రకే మణిమకుటం అశోక చక్రవర్తి. చండ అశోకునిగా పాలన ప్రారంభించి, ప్రపంచ చరిత్రలో ఘోరమైన యుద్ధంగా పేరొందిన కళింగయుద్ధంలో విజయం సాధించాడు. కానీ ఆ యుద్ధంలో పారిన రక్తపాతాన్ని చూసి చలించిపోయాడు. అప్పటికే అతని భార్య విదిశాదేవి వల్ల బౌద్ధం గురించి విన్న అశోకుని హృదయంలో ఏదో మూల కారుణ్యదీపం వెలిగింది. అదే అతని మనస్సులో మానవీయాంకురాన్ని మొలకెత్తించింది. మనస్సును బౌద్ధం ఆవరించింది. ఈ మార్పుకి అతని భార్య విదిశాదేవి, కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడే కారణం. తనలోని మొండితనం, తనలోని దుడుకుతనం తనకు బాగా తెలుసు. అందుకే తనకు తానే కళ్లెం వేసుకోవాలనుకున్నాడు. ఆనాటి బౌద్ధగురువు మొగ్గలిపుత్త తిస్స దగ్గరకు వెళ్లి తానూ బౌద్ధ దీక్ష తీసుకుంటానని చెప్పాడు. అప్పటికి కళింగ యుద్ధం ముగిసి ఏడాది కావస్తోంది. విజయోత్సవాలు ఘనంగా జరపాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయుధాల పూజకు దేశం అంతటా సిద్ధమైంది. ఆరోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. బౌద్ధులకు ఉపవాసదినం. అశోకుడు బిడ్డలతో ఆ రోజు బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఆ మరుసటి రోజున తన కారాగారాల్లో ఉన్న యుద్ధ ఖైదీలందర్నీ విడుదల చేశాడు. ఉరిశిక్ష రద్దు చేశాడు. ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ప్రతి యుద్ధ ఖైదీకీ రెండున్నర ఎకరాల భూమిని హక్కుపత్రాలతో అందించాడు. నవమి తర్వాతిరోజు దశమి. ఆ రోజుని శాంతి దశమిగా ప్రకటించాడు. ఆయుధాల్ని కట్టకట్టి మూలన పెట్టండి. కత్తికి బదులు కరుణ పతాకం ఎత్తండి. అని ప్రకటించాడు. దేశమంతా ధమ్మ విజయోత్సవాలు కజరిగాయి. ‘‘ఇక ఈ నాటినుండి, నేనుగాని, నా వారసులు గానీ యుద్ధాలు చేయరు. కరుణ, శాంతి, మానవీయతలే మా మార్గం’’ అని ప్రకటించాడు అశోకుడు. ఆ సంవత్సరం అంటే క్రీ.శ. 262నుండి మౌర్యవంశంలో ఆఖరి రాజైన దశరథుని వరకు భారతదేశమంతటా విజయ దశమినాడు అహింసోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత బౌద్ధపతనంతో అవీ కనుమరుగయ్యాయి. మరలా ఆ ఉత్సవాన్ని 1956 (అక్టోబర్ 14)విజయదశమి రోజున డా. బి.ఆర్. అంబేడ్కర్ నాగపూర్‌లో ప్రారంభించాడు. ఆ రోజున ఆరు లక్షల మందితో తానూ బౌద్ధదీక్ష తీసుకున్నాడు. అలా తిరిగి భారత గడ్డపై అశోక విజయ దశమి పునః ప్రారంభమైంది. శాంతికి సంకేతంగా, సంక్షేమానికి చిరునామాగా, మానవీయతకు మహా సందేశంగా పరిమళించిన ఈ అశోక విజయ దశమి శాంతికి బలిమి. కరుణకు కలిమి. – డా. బొర్రా గోవర్ధన్ -
నాడు అశోకుడు .. నేడు కేసీఆర్
హరిత హారానికి సినీ నటుడు కృష్ణ కితాబు రాయదుర్గం: నాడు అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటిం చినట్లు చరిత్రలో చదువుకున్నామని, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో, అంతటా మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రముఖ సినీనటుడు నటశేఖర కృష్ణ అన్నారు. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలో మంగళవారం తన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరం పేరుతో మొక్కలు నాటే కార్యకమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి పనుల్లో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ చెట్లు, పూలు, పచ్చదనం అంటే తనకు చాలా ఇష్టమని, తమ ఇంట్లో మూడు వందల రకరకాల మొక్కలు పెంచుతున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో సినీ నటులంతా పాల్గొంటున్నారన్నారు. నరేష్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, హెచ్ఎం అనంత రాములు, జగన్ మోహన్, టీఆర్ఎస్ నాయకులు చోటంసింగ్, జంగయ్యయాదవ్, మల్లేష్, వినోద్ కుమార్, అనీల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ యోధుడిగా!
వెండితెర అశోక చక్రవర్తిగా షారుక్‌ఖాన్ 15 ఏళ్ల క్రితమే ‘అశోక’ అనే చిత్రంలో నటించి, అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత ఆ జానర్‌ను టచ్ చేయలేదు. ఇప్పటివరకూ ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్స్, ‘రా వన్’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద దృష్టి సారించిన షారుక్ మరోసారి యోధుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారట. ‘‘వచ్చే ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మూడు నెలల్లోపే పూర్తి చేసేస్తానని ఆదిత్య చెప్పారు. చిత్రీకరణ ప్రారంభించే రెండు మూడు నెలలు ముందే నా పాత్ర కోసం వర్కవుట్ మొదలు పెట్టాలి’’ అని షారుక్ అన్నారు. -
వికలాంగురాలును గర్భవతి చేసిన దుండగులు
అనంతపురం: ఒంటిమిద్దెలో దారుణం జరిగింది. మానసికి వికలాంగురాలను కొందరు గుర్తు తెలియని దుండగులు గర్భవతిని చేసారు. అయితే అశోక అనే యువకుడుపై అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వెలలేని తల!
అశోకుడు గొప్ప చక్రవర్తి. కళింగయుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించి యుద్ధాలు మానేశాడు. ఒక రోజున ఒక బౌద్ధభిక్షువు ఆయనకు ఎదురయ్యాడు. అశోకుడు మోకాళ్లమీద కూర్చుని, శిరస్సు వంచి, ఆ భిక్షువుకు నమస్కరించాడు. ఇది ఆయన పక్కనే ఉన్న మంత్రికి నచ్చలేదు. తన అభిప్రాయాన్ని ‘‘మహారాజా! తమరు భరతఖండంలో మహోన్నత చక్రవర్తులు. మీ శిరస్సు, కిరీటం వొంగడం సమంజసం కాదు’’ అని చెప్పాడు. అశోకుడు చిరునవ్వు నవ్వి అప్పటికి ఊరుకున్నాడు. రెండురోజుల తర్వాత ఒక మేక తల, ఒక జింక తల తెప్పించి పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మని సేవకుణ్ణి పంపాడు. వాడు చాలా తక్కువ సమయంలోనే వాటిని అమ్మి వచ్చాడు. ఆ మరునాడు అప్పుడే మరణించిన ఒక మనిషి తలను కూడా ఒక పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మన్నాడు. వాడు మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగినా ఎవరూ కొనలేదు. మనిషి తలను అమ్మకుండా తిరిగొచ్చి ‘‘ప్రభూ! దీన్ని ఎవరూ కొనలేదు’’అన్నాడు. ‘‘సరే! మరలా వెళ్లు. ఈ సారి ఉచితంగా ఇస్తాను అని చెప్పు’’ అని అతన్ని పంపాడు. ఆ సేవకుడు సాయంత్రానికి తలతో తిరిగి వచ్చాడు. ‘‘ప్రభూ! ఉచితంగా ఇస్తానన్నా ఎవ్వరూ తీసుకోలేదు’’అని చెప్పాడు. అప్పుడు అశోకుడు తన మంత్రితో మంత్రి మహాశయా! ఇది ఒక దొంగవాడి తల. అందుకే కొనలేదు. మరి, దీని స్థానంలో నా తలను ఉంచితే కొంటారా?’’ అని అశోకుడు మంత్రిని అడిగాడు. ఆ మాటతో మంత్రికి జ్ఞానోదయం అయింది. అశోకునికి వినమ్రంగా నమస్కరించాడు. - బొర్రా గోవర్ధన్