Chandrayaan-3: Fifth And Final Orbit Reduction Manoeuvre Completed - Sakshi
Sakshi News home page

చివరి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్‌-3.. చంద్రుడికి అడుగు దూరంలో

Published Wed, Aug 16 2023 11:58 AM | Last Updated on Thu, Aug 17 2023 1:38 PM

Chandrayaan 3 Fifth And Final Orbit Reduction Manoeuvre Complete - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. చంద్రుడి ఉపరితలంపై దిగే కీలక ఘట్టానికి చంద్రయాన్‌–3 మరింత చేరువైంది.

ఇక ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరుకావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మిషన్‌ చంద్రుడి సమీప కక్ష్యలోకి(లూనార్‌ ఆర్బిట్‌) ఎలాంటి అవరోధాలు లేకుండా చేరుకుంది. చంద్రయాన్‌–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. అలాగే చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ను వేరుచేసే విన్యాసాన్ని ఈ నెల 17న చేపట్టనున్నట్లు ఇస్రో తెలియజేసింది.  

నేటి నుంచే ముఖ్యమైన ఆపరేషన్‌  
బెంగళూరులోని మిషన్‌ ఆపరేటర్‌ కాంప్లెక్స్‌(ఎంఓఎక్స్‌), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌), బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (ఐడీఎస్‌ఎన్‌) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయిన తర్వాత ల్యాండర్‌లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టనున్నారు. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. 
చదవండి: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement