ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాంతో ఫోటోదిగి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాంతో ఫోటోదిగి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి మాత్రం బోణులో ఉన్న సింహంతో అతిసమీపంలోంచి ఈ ఫోటో దిగాడు. ఫెన్సింగ్‌లోపల ఉన్న సింహాన్ని జడేజా ముద్దాడడానికి ప్రయత్నిస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్యాప్షన్ కూడా అవసరం లేదనుకుంటా..అని రాసి మరీ ఫోటోతో పాటూ పోస్ట్ పెట్టాడు.
ఇది వరకు కూడా జడేజా ఇలాంటి ఓ సాహసమే చేసి చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. గత ఏడాదిలో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లో జడేజా, ఆయన భార్య రీవా సోలంకితో కలిసి జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, ఈ రకంగా ఫొటోలు దిగడం చట్ట వ్యతిరేకం కావడంతో గుజరాత్ అటవీశాఖ అధికారులు రూ.20,000 జరిమానా విధించారు.
అయితే ఇలాంటి ఫోటోలు దిగడమే కాకుండా, సోషల్ మీడియాలో పెడుతూ.. మీరు ఇబ్బందులు పడటమే కాకుండా జూ సిబ్బందిని కూడా ఎందుకు ఇబ్బందిపెడుతున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.