అమ్మ బాబోయ్​.. కాపాడండయ్యా నన్ను! | Cowardly Lion Run From Buffalo Heard And Climb Tree In Kenya | Sakshi
Sakshi News home page

అడవి దున్నలు గుంపుగా, సింహం సింగిల్​గా, ఆపై..

Published Tue, Jun 8 2021 4:45 PM | Last Updated on Tue, Jun 8 2021 5:04 PM

Cowardly Lion Run From Buffalo Heard And Climb Tree In Kenya - Sakshi

అడవికి రారాజు సింహమే. కానీ, అవతలి నుంచి గుంపుగా వస్తే ఆ సింహాం కూడా తోక ముడవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది.

  • నాలుగు సింహాలు.. పక్కనే ఉన్న జింకలను వదిలి.. మందగా ఉన్న అడవి దున్నల మీద కన్నేశాయి.
  • అయితే అది గమనించిన అడవి దున్నలు ఒక్కసారిగా వాటి మీదకు ఉరుకులు తీశాయి. 
  • మూడు సింహాలు పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది
  • ప్రాణ భయంతో పరుగులు తీసిన ఆ మృగరాజు.. అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది
  • చాలా సేపు ఇబ్బంది పడ్డాక ఎట్లాగోలా పైకి చేరుకుంది
  • కానీ, 500 దాకా ఉన్న అడవి దున్నలు మాత్రం ఆ సింహం చుట్టూ రౌండప్​ చేశాయి
  • కొన్ని గంటలపాటు చెట్టుమీదే ఉన్న సింహం.. చీకటి పడ్డాక దున్నలు వెళ్లిపోవడంతో దిగింది
  • నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్​ ఫొటోగ్రాఫర్​ ఓల్వ్​ థోక్లే(54) ఈ రసవత్తరమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement