‘అమ‍్మ’ ప్రేమను చాటిన సింహం | Lioness Snatches Cub From Crocodile Infested River | Sakshi
Sakshi News home page

‘అమ‍్మ’ ప్రేమను చాటిన సింహం

Published Thu, Dec 19 2019 7:49 PM | Last Updated on Thu, Dec 19 2019 7:55 PM

Lioness Snatches Cub From Crocodile Infested River - Sakshi

బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ తల్లి అయినా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లిప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. దీనికి నిదర్శనం ఈ వీడియోనే. తన బిడ్డను నది దాటించే క్రమంలో ఓ ఆడసింహం చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. నదిలోని మొసళ్లు ఎక్కడ తన బిడ్డలను మింగేస్తాయోనని చూసుకుంటూ.. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది ఆ ఆడ సింహం. నది దాటే క్రమంలో పిల్ల సింహం ఒక్క క్షణం నిటిలో మునిగితే చాలు.. వెంటనే నోటితోపైకి లాగుతోంది.

తన బిడ్డను మొసలి మింగేసిదన్న భయంతో వెంటనే అప్రమత్తమై పిల్ల సింహాన్ని నోటితో పైకి లాగుతోంది. ఈ అసాధారణ దృశ్యం కెన్యాలోని ఎవాసో వద్దగల నైరో నది సమీపంలో చోటు చేసుకోగా.. లుకా బ్రాకాలి అనే ప్రముఖ ఫోటో గ్రాఫర్‌ తన కెమెరాలో బంధించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘తల్లి ప్రేమను మించింది లేదు’., ‘ సింహం అయినా కూడా ఓ బిడ్డకు తల్లియే కదా’  అని కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement